మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 25, 2020 , 01:24:50

ఎన్నికల కౌంటింగ్ వద్ద పటిష్ట బందోబస్తు :ఎస్పీ ఆర్.భాస్కరన్

ఎన్నికల కౌంటింగ్ వద్ద పటిష్ట బందోబస్తు  :ఎస్పీ ఆర్.భాస్కరన్
సూర్యాపేట సిటీ  :  నేడు నిర్వహించే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ తెలిపారు. శుక్రవారం విధులకు హాజరయ్యే సిబ్బందికి కౌంటింగ్ కేంద్రాల వద్ద పాటించాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేసి మాట్లాడారు. కళాశాల ప్రాంగణం ముందు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అనుమతి లేకుండా ఎవరిని లోనకు పంపించవద్దని సూచించారు. పా ర్కింగ్ కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనుమతి ఉన్న ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి లోపలకు పంపించాలని ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. కౌంటింగ్ అనంతరం సంబంధిత మున్సిపాల్టీల్లో డీఎస్పీలు, సీఐలు అప్రమత్తంగా ఉం డి డీజేలు పెట్టకుండా చూడాలని, ఎలాంటి ర్యాలీలకు అనుమతి ఇవ్వవద్దన్నారు. నేడు నిర్వహించే ఎన్నికల కౌంటింగ్‌కు ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 20మంది ఎస్‌ఐలు, ఎఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు 15మంది, పోలీస్ కానిస్టేబుళ్ల 110మంది, ఆర్మూడ్ గ్రూప్- 2, బీడీ టీమ్స్ 3, స్పెషల్ పార్టీలు 2తో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో డీఎస్పీ నాగేశ్వర్‌రావు, రఘు, సీఐలు శివశంకర్, రవి, రాఘవరావు, శివశంకర్‌గౌడ్, శివరాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, స్పెషల్ సీఐలు నర్సింహ, రాజేష్, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.logo