గురువారం 01 అక్టోబర్ 2020
Suryapet - Jan 25, 2020 , 01:24:11

భక్త జన సంద్రం.. పార్వతీ సమేతుడి క్షేత్రం

భక్త జన సంద్రం.. పార్వతీ సమేతుడి క్షేత్రం
  • -ఘనంగా రామలింగేశ్వరుడి లక్ష పుష్పార్చన

నార్కట్‌పల్లి : మండల పరిధిలోని చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. శుక్రవారం అమావాస్య కావడం తో జిల్లానుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి  వచ్చిన భక్తుల తాకిడితో పార్వతీ సమేతుడి క్షేత్రం పోటెత్తింది. గుట్టపై నిద్ర చేసే భక్తులు ఓం శివా, నమః శివా అంటూ శివసత్తుల పూనకాలతో స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. అదేవిధంగా మానసిక రుగ్మతులతో బాధ పడేవారు ఈ క్షేత్రంపై మండల ధీక్ష చేసి శివ నామస్మరణతో జపిస్తే అనారోగ్యం మటుమాయమై సంపూర్ణ ఆరోగ్యవంతులౌతారనే విశ్వాసం భక్తుల్లో ఉంది. దీంతో ప్రతీ నెల అమావాస్య రోజున భక్తులు అధిక సంఖ్యలో నిద్ర చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారికి భోనాన్ని భక్తి శ్రద్ధలతో సమర్పించారు.

పార్వతీ పరమేశ్వరులకు లక్ష పుష్పార్చన..

అమావాస్య సందర్భంగా శ్రీపార్వతీ పరమేశ్వరు ల ఉత్సవ విగ్రహాలకు కల్యాణమండపం వద్ద లక్ష పుష్పార్చనలు ఆలయ ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ ఆధ్వర్యంలో అర్చకుల సహాయంతో వేదమంత్రాల మధ్య ఘనంగా నిర్వహించారు. స్వామివారి లక్ష పుష్పార్చనను చూసి భక్తులు పుణీతులయ్యారు. అనంతరం గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగించుకుంటూ కోనేరు వద్దకు తీసుకెళ్లి స్వామివారికి పంచ హారతిని సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, ఈఓ సులోచన, సూపరింటెండెంట్ తిరుపతి రెడ్డి అన్ని వసతులను కల్పించారు. కార్యక్రమంలో దేవాలయ పాలక మండలి సభ్యులు, దేవాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.logo