సోమవారం 21 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 25, 2020 , 01:22:52

ఆడ పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలి

ఆడ పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలిజాతీయ బాలికా దినోత్సవంలో జేసీ సంజీవరెడ్డి

సూర్యాపేటరూరల్ : ఆడ పిల్లలను రక్షించి వారిని ఉన్నత చదువులు చదివించడం వల్ల వారు అన్ని రంగాల్లో రాణిస్తారని జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బాలెంల గ్రామ సమీపంలోని గురుకుల పాఠశాలలో జిల్లా మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధులు, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ బాలిక దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. సమాజంలో బాలికల పట్ల ఉన్న వివక్షతను తొలగించి వారికి సమాన అవకాశాలు కల్పించడం కోసం తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ బాలికలకు విద్యను పెంపోందించడానికి, ప్రోత్సహించడానికి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు నెలకొల్పా రన్నారు. బాలికలు పట్టుదలతో కష్టపడి చదువుకోవాలని విద్యార్థినులకు సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి కె. నర్సింహారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆర్‌సి. సౌజన్య, జిల్లా వైద్యాధికారి నిరంజన్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రవికుమార్, అధికారులు అనంతలక్ష్మి, పుండరీకాక్ష, సునీల్, రమాదేవి, వెంకటలక్ష్మి, నాగమణి, శ్రీజ, శమంతకమణి, ప్రియదర్శిని, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి అవార్డులు సాధించిన బాలకేంద్రం విద్యార్థులు

 సూర్యాపేటఅర్బన్ : బాలికా దినోత్సవం సందర్భంగా  జిల్లా కేంద్రంలోని బాలకేంద్రం విద్యార్థులు రాష్ట్రస్థాయి అవార్డు సాధించారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక బాలకేంద్రంలో రాష్ట్రస్థాయి అవార్డులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా బాలకేంద్రం అభివృద్ధి కమిటీ ప్రథమ ఉపాధ్యక్షుడు వనమా వెంకటరామయ్య మాట్లాడుతూ తెలంగాణ మోడల్ స్కూల్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో శాస్త్రీయ నృత్యం విభాగంలో ఆమని ప్రథమ బహుమతి, దివ్యాంగ బాలికలు రాజ్‌భవన్‌లో   గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సమక్షంలో ప్రియాంక, శిరీష ప్రదర్శన ఇచ్చి రాష్ట్రస్థాయి అవార్డులు సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను అభినందించిన వారిలో బాలకేంద్రం సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణారెడ్డి, సత్యనారాయణసింగ్, వీరునాయుడు, ఉమ, తదితరులు పాల్గొన్నారు.


logo