బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 24, 2020 , 04:51:38

గ్రామాభివృద్ధికే పల్లె ప్రగతి

గ్రామాభివృద్ధికే పల్లె ప్రగతి
  • -దాతల సహకారం తీసుకోవాలి..
  • పెండింగ్‌ సమస్యలన్నీ పరిష్కరించుకోవాలి
  • -రాచకొండ అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు
  • - నాగారం మండలంలో రెండో విడుత పల్లె ప్రగతి పనుల పరిశీలన

గ్రామాల అభివృద్ధికే సీఎం కేసీఆర్‌ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, ప్రణాళికకనుగుణంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములై అభివృద్ధికి బాటలు వేసుకోవాలని రాచకొండ అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు అన్నారు. ఈ నెల 2 నుంచి 11వరకు చేపట్టిన రెండోవిడుత పల్లె ప్రగతి పనులను ఆయన కలెక్టర్‌ అమయ్‌కుమార్‌తో కలిసి నాగారం మండలంలోని పలు గ్రామాల్లో పరిశీలించారు. పారిశుధ్యం, వన నర్సరీలు, డంపింగ్‌ యార్డులు, ఇంకుడు గుంతలు, శ్మశాన వాటిక పనులు పూర్తి చేసి సమస్యల్లేని గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు.


నాగారం : రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధికే తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని, ఇప్పటికే 30రోజుల ప్రణాళిక ద్వారా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి పరిష్కరించినట్లు, మిగిలిన పనుల పరిష్కారానికి రెండో విడుత పల్లెప్రగతిని నిర్వహించినట్లు రాచకొండ అడిషనల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సుధీర్‌బాబు అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌తో కలిసి ఈనెల 2 నుంచి 11వరకు గ్రామాల్లో చేపట్టిన రెండో విడుత పల్లెప్రగతి పనులను పరిశీలించారు. మండలంలోని నాగారం, ఈటూరు, శాంతినగర్‌ గ్రామాలను సందర్శించి ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వైకుంఠధామాలు,  మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. హరితహారంలో భాగంగా గ్రామాల్లో నాటిన మొక్కలకు నీళ్లు పోసి సంరక్షించాలన్నారు. ప్రజలు ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించి ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధిలో అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు కలిసి అభివృద్ధి చేసుకోవాలన్నారు. అనంతరం గ్రామాల్లోని వీధులు, పారిశుధ్య పనులు, వననర్సరీలు, డంపింగ్‌యార్డులు, శ్మశాన వాటికల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా శాంతినగర్‌ సర్పంచ్‌ నాగుల్‌మీరా పక్కా గ్రామపంచాయతీ భవనాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో పీడీ కిరణ్‌కుమార్‌, జడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డీపీఆర్‌ఓ యాదయ్య, మండల ప్రత్యేకాధికారి జగ్గూనాయక్‌, ఎంపీడీఓ హరిప్రసాద్‌, తాసిల్దార్‌ గొబ్బిళ్ల శ్రీకాంత్‌, ఏపీఓ లక్ష్మి, ఎంపీఓ దారా శ్రీనివాస్‌, ఎంపీపీ కూరం మణివెంకన్న, ఎంపీటీసీ చింతల్‌రెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సర్పంచులు పేరాల సరితయాదగిరి, చిప్పలపల్లి స్వప్న, నాగుల్‌మీరా, ఉపసర్పంచులు పొదిల శ్రీను, కన్నెబోయిన బద్రీ, రాంపల్లి సోమయ్య, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌ఓలు, టీఏలు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.logo