బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 22, 2020 , 04:37:36

ఓటర్ కార్డు లేకున్నా..18 కార్డులతో ఓటేయొచ్చు

ఓటర్ కార్డు లేకున్నా..18 కార్డులతో ఓటేయొచ్చు


నీలగిరి : నేడు జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలకు జరుగనున్న సాధారణ ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్ స్లిప్ ప్రామాణికం కాదు. స్లిప్ పాటు గుర్తింపునకు ఈపీఐసీ(ఫోటో ఓటర్ గుర్తింపు కార్డు)తో కూడా ఓటు వేయొచ్చు. ఈపీఐసీ కార్డు లేనివారు వారి గుర్తింపును నిరూపించుకోవడం కోసం ఎన్నికల కమిషన్ నిర్ధేశించిన 18రకాల ఫొటోలతో కూడిన ఏదేని ప్రత్యామ్నాయ డాక్యూమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ పాస్ డ్రైవింగ్ లైసెన్స్, రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఉద్యోగులకు జారీ చేసిన ఫొటోగ్రాఫ్ కూడిన సర్విస్ గుర్తింపు కార్డులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇవేకాకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు/టీఎస్ తపాలా కార్యాలయంలో జారీ చేసిన ఫొటోగ్రాఫ్ కూడిన పాస్ ఆదాయ పన్ను  గుర్తింపు కార్డు(పాన్ జాతీయ జనాభా నమోదు పథకం కింద భారత రిజిస్ట్రార్ జనరల్(ఆర్ చేసిన స్మార్ట్ కార్డులు(ఎన్ జాతీయ ఉపాధి హామి పథకం కింద జారీ చేసిన ఫొటోతో కూడిన ఉద్యోగ కార్డు, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఫొటోతో కూడిన ఆరోగ్య బీమా పథకం కార్డు(ఈఎస్ సైతం ఓటు హక్కు సమయంలో ఆమోదించనున్నారు.

ఇక  మాజీ సైనికోద్యోగుల పింఛన్ పుస్తకం, పింఛన్ చెల్లింపు ఉత్తర్వు, మాజీ సైనికోద్యోగుల వితంతు, వారిపై ఆధార పడిన వారికి చెందిన ధృవపత్రాలు, వృధ్ధుల పింఛన్ ఉత్తర్వు, ఫొటోతో కూడిన వితంతు పింఛన్ ఉత్తర్వులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభ, శాసన మండలి సచివాలయం జారీ చేసిన ఫొటోతో కూడిన గుర్తింపు కార్డు రేషన్ ప్రాధికారమివ్వబడిన అధికారితో జారీ చేసిన ఫొటోతో కూడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ ధ్రువపత్రం, స్వాతంత్య్ర సమరయోధుల గుర్తింపు కార్డులు సైతం పరిగణలోకి తీసుకోనున్నారు.  ఫొటోతో కూడిన ఆయుధ లైసెన్స్, వికలాంగ ధ్రువపత్రం, పార్లమెంట్ సభ్యులకు లోక్ రాజ్యసభ సచివాలయం జారీచేసిన గుర్తింపు కార్డు, పట్టాదారు పాస్ పుస్తకాలు(మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత జారీ చేసినది)ఓటు వేయడానికి గుర్తింపుగా సమర్పించవచ్చని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఎపిక్ కార్డు లేదా 18రకాల ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక కార్డును ఓటర్లు చూపించి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవచ్చు.

మద్యం తాగి వస్తే ఓటు ఉండదు..

మద్యం తాగి ఓటు వేసేందుకు వస్తే పోలీసులు ఆపుతారు. ఓటు వేసేందుకు అనుమతి ఉండదు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బ్రీత్ ఎనలైజర్ చెక్ చేసిన తర్వాతే పోలింగ్ బూత్ అనుమతిస్తారు. మందు తాగినట్లు తేలితే కేసు నమోదు చేసే అవకాశాలున్నాయి.


logo