ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 20, 2020 , 04:31:34

పోలియో రహిత జిల్లాగా మార్చుదాం

పోలియో రహిత జిల్లాగా మార్చుదాంపోలియో రహిత జిల్లాగా మార్చేందుకు  ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం కోదాడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.

కోదాడ రూరల్‌: పోలియో రహిత జిల్లాగా  తీర్చిదిద్దేందుకు  అందరూ సహకరించాలని కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అన్నారు. కోదాడ పట్టణ జడ్పీ  ఉన్నత పాఠశాల మేకల అభినవ్‌ ఇండోర్‌ స్టేడియంలో వైద్యశాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన పల్స్‌ పోలియోను ఆయన ప్రారంభించి మాట్లాడారు. 0 నుంచి 5 సంవత్సరాలలోపు చి న్నారులకు తప్పని సరిగా పోలియో చుక్కల మం దు వేయించాలన్నారు.   కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ నిరంజన్‌, ఆర్‌డీఓ కిశోర్‌కుమార్‌, డీటీ సొంపంగు సురయ్య, వైద్యులు రమ్యశ్రీ, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఉన ్నత పాఠశాలలో మున్సిపల్‌ పోలింగ్‌ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఓటరు ఓ టు వేసేందుకు అన్ని వసతులు కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు. వీరి వెంట ఆర్డీఓ కిషోర్‌కుమార్‌, పాఠశాల హెచ్‌ఎం పి.కృష్ణయ్య, , సిబ్బంది పాల్గొన్నారు.logo