ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 18, 2020 , 04:00:23

మైక్రో అబ్జర్వర్లు సమర్థవంతంగా విధులు నిర్వహించాలి

మైక్రో అబ్జర్వర్లు సమర్థవంతంగా విధులు నిర్వహించాలి
  • -పోలింగ్‌లో ఎప్పటికప్పడు వివరాలు నమోదు చేయాలి
  • - మున్సిపల్‌ ఎన్నికల సాధారణ పరిశీలకుడు చంపాలాల్‌

సూర్యాపేట, నమస్తేతెలంగాణ : జిల్లాలో  ఈ నెల 22న  జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో నియమించిన మై క్రో అబ్జర్వర్లు తమ విధులను పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల సాధారణ  పరిశీలకుడు చంపాలాల్‌ అన్నారు.  కలెక్టరేట్‌లో శుక్రవారం ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లు నిర్వహించాల్సిన విధులపై ఏర్పాటు చేసిన సమావేశంలో డీఆర్‌ఓ పి.చంద్రయ్యతో కలసి మాట్లాడారు. ఎన్నికల రిపోర్టులు పంపడం, పోలింగ్‌ కేంద్రంలో జరిగిన విధానం చెక్‌ లిస్ట్‌లో నింపడం, పోలింగ్‌ శాతాన్ని డైరీలో తప్పకుండా నమోదు చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో ఎలాంటి సంఘటనలు జరిగిన వెంటనే తనకు రిపోర్టు చేయాలని సూచించారు. మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని ఎలాంటి ప్రలోభా లకు లోనవ్వకుండా ఉండాలని అలాగే పోలి ంగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ ఫోన్‌లు అనుమతించరాదన్నారు. మైక్రో అబ్జర్వర్లు సాధారణ పరిశీలకుల పర్యవేక్షణలో పోలింగ్‌ రోజున పోలింగ్‌ కేంద్రాల్లో జరిగే పోలింగ్‌ ప్రక్రియను పరిశీలిస్తారన్నారు. నియమించిన ఆయా మున్సిపాల్టీల్లో మైక్రో అబ్జర్వర్లు పోలింగ్‌ సిబ్బందితో కలసి ఒక రోజు ముందు వెళ్లాలని, పోలింగ్‌ రోజున ఉదయం 6గంటలకు విధుల్లో ఉండాలన్నారు. అంతే కాకుండా పోలింగ్‌ కంపార్టుమెంట్‌లోకి పోలింగ్‌ అధికారుతో సహా మరెవ్వరు కూడా వెళ్లకుండా చూడాలన్నారు.  ఎన్నికల విధి విధానాలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా మాస్టర్‌ ట్రైనర్‌ నరేందర్‌ మైక్రో అబ్జర్వర్లకు వివరించారు.   సమావేశంలో డీఆర్వో చంద్రయ్య ఎల్‌డీఎం జగదీష్‌చంద్రబోస్‌, వివిధ బ్యాంకుల మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.


logo