గురువారం 01 అక్టోబర్ 2020
Suryapet - Jan 15, 2020 , 03:59:07

సూర్యాపేటలో 5వ వార్డు టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవం

సూర్యాపేటలో 5వ వార్డు టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవం
  • -అభ్యర్థి బాషామియాకు మంత్రి అభినందనలు

సూర్యాపేట సిటీ : సూర్యాపేట మున్సిపల్‌ పరిధిలోని 5వవార్డులో టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవమైంది. ఎన్నికల బరిలో 13నామినేషన్లు దాఖలు కాగా వీటిలో టీఆర్‌ఎస్‌ తరపున 3, కాంగ్రెస్‌ తరపున 3, టీడీపీ 2, స్వతంత్య్ర 5 ఉన్నాయి. ఉపసంహరణలో భాగంగా పోటీలో ఉన్న పదిమందిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎస్‌.కె.బాషామియా మినహా మిగిలిన వారంతా తమ నామినేషన్‌లను ఉపసంహరించుకున్నారు. దీంతో బరిలో ఉన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎస్‌కే.బాషామియా ఎన్నిక ఏకగ్రీవమైంది. అధికారులు ప్రకటించడమే తరువాయి. కాగా బాషామియా మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనకు స్వీట్‌ తినిపించి అభినందనలు తెలిపారు.

logo