శనివారం 26 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 14, 2020 , 03:40:58

గులాబీ జెండాతోనే గ్రామాలు అభివృద్ధి

గులాబీ జెండాతోనే గ్రామాలు అభివృద్ధి

సూర్యాపేట రూరల్‌ : మున్సిపాలిటీ ఎన్నికల్లో 48వార్డుల్లో గులాబీ జెండా ఎగురాలని, గులాబీ జెండాతోనే గ్రామాలు, వార్డులు వార్డుల అభివద్ధి జరుగుతుందని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి పట్టణ పరిధిలోని 10వ వార్డు పిల్లలమర్రి, 11వ వార్డు రాయిన్‌గూడెం గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నాయకులు, 100 మంది కార్యకర్తలు మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు కొణతం స్వాతిపుల్లారెడ్డి, చెర్కుపల్లి శ్రీనులను గెలిపించాలని ఏర్పాటు చేసిన ప్రచార సభలో పాల్గొని మాట్లాడారు. 


అన్ని వర్గాల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని, జిల్లా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులే అందుకు నిదర్శనమన్నారు. జరుగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో 48వార్డుల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ జెండా ఎగురాలన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో సోమగాని సత్యనారాణ, వెంకటయ్యలతోపాటు 100మంది కార్యకర్తలు ఉన్నారు.  జడ్పీటీసీ జీడి భిక్షం, టీఆర్‌ఎస్‌ నాయకులు ఈదుల యాదగిరి, ముత్యాల సైదులు, చిత్తలూరి కృష్ణ, కొణతం శ్రీనివాస్‌రెడ్డి, సోమగాని లింగస్వామిగౌడ్‌, రాపర్తి శ్రీనివాస్‌గౌడ్‌, వడ్డెపల్లి రవి, రాపర్తి సైదులుగౌడ్‌, వల్లాల సైదులుయాదవ్‌, మోదుగు సంజీవరెడ్డి, చెర్కుపల్లి వెంకట్‌లాల్‌, రాపర్తి మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.  


logo