శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 13, 2020 , 04:18:20

వివేకానందుడు ఆదర్శనీయుడు

వివేకానందుడు ఆదర్శనీయుడు


హుజూర్‌నగర్‌, నమస్తేతెలంగాణ : వివేకానందుడి జీవితం ఆదర్శనీయమని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఇందిరాసెంటర్‌లో వివేకానందుడి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి తరం వివేకానందుడి బోధనలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ పశ్య శ్రీనివాసరెడ్డి, గుండా రమేశ్‌, అంకతి అప్పయ్య, అనంతరామశర్మ, రాంరెడ్డి, సైదారత్నం, అప్పారావు, నర్సింహారావు, సాముల శివారెడ్డి, దొంతగాని శ్రీనివాస్‌, జక్కుల వెంకయ్య, కోట సూర్యప్రకాశ్‌రావు, మల్లికార్జున్‌రావు, అరుణ్‌కుమార్‌దేశ్‌ముఖ్‌ తదితరులు పాల్గొన్నారు. 

 గొప్ప తాత్వికుడు స్వామి వివేకానంద : కలెక్టర్‌ 

బొడ్రాయిబజార్‌ : గొప్ప తాత్వికుడు స్వామి వివేకానందుడని కలెక్టర్‌ దుగ్యాల అమయ్‌కుమార్‌ అన్నారు. స్వామి వివేకానంద 157వ జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలోని వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వివేకానంద బోధనలు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. ఒక మంచి ఆలోచన లక్షలాది మందిని కదిలిస్తుందని, అలాగే లక్షలాది మందిలో కదలిక ఒక సమాజాన్ని కదిలిస్తుందని పేర్కొన్నారు. వివేకానంద సందేశాలు, బోధనలు ఎంతో గొప్పవని కొనియాడారు. ఆయన స్ఫూర్తి, మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రామానుజులరెడ్డి, జిల్లా యువజన సంక్షేమాధికారి వెంకట్‌రెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు అంగిరేకుల నాగార్జున, ప్రధాన కార్యదర్శి నాగవల్లి ప్రభాకర్‌, తల్లమల హసేన్‌, కుంట్ల రామకృష్ణారెడ్డి, గజ్జల వెంకట్‌రెడ్డి, కర్నాటి కిషన్‌, శ్రీనివాస్‌, కుమారస్వామి, చంద్రశేఖర్‌, న్యాయవాదులు మారపాక వెంకన్న, ఏడిండ్ల అశోక్‌, పురపాలక సంఘం శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


logo