బుధవారం 23 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 13, 2020 , 04:16:02

కార్మికుల పక్షపాతి సీఎం కేసీఆర్‌

కార్మికుల పక్షపాతి సీఎం కేసీఆర్‌
  • - ఎంపీ బడుగుల


సూర్యాపేటటౌన్‌ : కార్మికుల పక్షపాతిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నిరంగాల కార్మికులను ఆదుకుంటూ అన్నివిధాలుగా ప్రోతహిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మి ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన తెలంగాణ ప్రైవేట్‌ ఎలక్ట్రికల్‌ టెక్నీషియన్స్‌ ఫెడరేషన్‌ జనరల్‌ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులను రాజుగా చేయడంతోపాటు అన్నిరంగాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌, జిల్లాలో మంత్రి జగదీశ్‌రెడ్డి సంచలనాత్మక పాలన అందిస్తున్నారన్నారు. అందులో భాగంగానే నిరంతర విద్యుత్‌ అందిస్తున్నారని, దానికి తోడుగా రెండు పంటలు సస్యశ్యామలంగా పండాలని కాళేశ్వరం జలాలతో చెరువులు, కుంటలు నింపించారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో ఇప్పటికే అన్నిరంగాల కార్మికుల సమస్యలు చాలా వరకు పరిష్కారమయ్యాయని, మిగిలిన సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తారని తెలిపారు. అనంతరం సంఘానికి సంబంధించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తోట్ల శ్రవణ్‌ కుమార్‌, బ్రహ్మచారి, రాజేశ్వర్‌రావు, నర్సింహారెడ్డి, ఏకస్వామి, నబీ, శ్రీను, లక్ష్మీనారాయణ, రామారావు తదితరులు పాల్గొన్నారు. 


logo