గురువారం 01 అక్టోబర్ 2020
Suryapet - Jan 13, 2020 , 04:14:23

స్వల్ప భూప్రకంపనలపై భయాందోళనలు వద్దు

స్వల్ప భూప్రకంపనలపై భయాందోళనలు వద్దు
  • - ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్త శ్రీనగేశ్‌

చింతలపాలెం : ఇటీవల ఉమ్మడి మండలంలో తరచుగా వస్తున్న స్వల్ప భూప్రకంపనలపై ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురికావద్దని ఎన్‌జీఆర్‌ఐ ముఖ్య శాస్త్రవేత్త శ్రీనగేశ్‌ అన్నారు. ఆదివారం మండలంలోని దొండపాడు గ్రామంలోని ఆదర్శకాలనీ ప్రభుత్వ పాఠశాలలో భూప్రకంపనల స్థితిగతులను తెలుసుకునేందుకు సిస్మోగ్రాఫ్‌(భూకంప లేఖిని)ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొద్దిరోజులుగా వస్తున్న భూప్రకంపనలు సాధారణం(టెక్టోనిక్‌)గా వచ్చేవి మాత్రమేనన్నారు. ఈ భూప్రకంపనలు గుంటూరు జిల్లా అచ్చంపేట, బెల్లంకొండ కేంద్రంగా వస్తున్నాయని తెలిపారు. ఈ కేంద్రంలో 3.2 అత్యధిక భూప్రకంపనలు జరిగాయని, 6పాయింట్ల వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగదని చెప్పారు. ఉమ్మడి మండలంతోపాటు ఇతర ప్రాంతాల్లో 1డిసెంబర్‌ 2019 నుంచి ఇప్పటి వరకు 32సార్లు భూప్రకంపనలు జరిగాయని, వాటిలో అత్యధికంగా 2.8పాయింట్ల మేర భూప్రకంప తీవ్రత నమోదైందన్నారు. ప్రజలు అనుకున్నట్లు మైనింగ్‌, పులిచింతల ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌తో ప్రకంపనలు రాలేదని, 10కిలోమీటర్ల లోతులో రాళ్లలో కదలికల వల్ల వస్తున్నాయని, ప్రకంపనలు వచ్చినప్పుడు కొద్దిసేపు ఇళ్ల బయట ఉండాలని సూచించారు. ఎప్పుడైనా భూప్రకంపనల తీవ్రత ఎక్కువైతే సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఆయన వెంట  జిల్లా మైన్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎస్‌.సుధాకర్‌, తాసిల్దార్‌ కమలాకర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు సురేశ్‌, నరేశ్‌, ఎంపీపీ కొత్తమద్ది వెంకట్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ బాబురావు, వెంకటరంగారెడ్డి, శ్రీనివాసరెడ్డి, సత్యనారాయణరెడ్డి, శేషు, శ్రీను తదితరులు ఉన్నారు.

తాజావార్తలు


logo