శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 12, 2020 , 03:38:02

కోర్టు నూతన భవననిర్మాణానికి కృషి

కోర్టు  నూతన భవననిర్మాణానికి కృషికోదాడఅర్బన్‌ : శిథిలావస్థలో ఉన్న భవన స్థానంలో నూతన భవన నిర్మాణానికి,ఆఫీసర్స్‌ వసతి నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించి అందుబాటులో ఉంచేందుకు  తక్షణ చర్యలు  తీసుకుంటామని ఉమ్మడి  నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.వీ.రమేశ్‌ అన్నారు.శనివారం పట్టణ కోదాడ కోర్టు పరిశీలన నిమిత్తం విచ్చేసిన ఆయన మాట్లాడారు.  కోర్టుల్లో న్యాయ సేవలు పొందే వారికి భరోసాతో కూడిన సేవలు అందించేందుకు బార్‌ అసోసియేషన్‌ సభ్యులు, న్యాయవాదులు ఐకమత్యంతో పనిచేయాలని పేర్కొన్నారు. ము ందుగా శిథిలావస్థ కోర్టును,అద్దె భవనంలో నడుస్తున్న కోర్టు పరిస్థితులను, ఆవరణలను పరిశీలించి ఆరా తీశారు.ఆవరణలో ఉన్న వాహనాలను తొలగించేందుకు రూరల్‌ పోలీసులకు తగు సూచనలు చేశారు. ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీదేవి సమక్షంలో న్యాయవాదులు జిల్లా న్యాయమూర్తికి  దృష్టికి పలు అంశాలను తీసుకొచ్చారు.  అనంతరం జిల్లా న్యాయమూర్తిని బార్‌ అసోసియేషన్‌ సభ్యులు,న్యాయవాదులు శాలువాలతో ఘనంగా సత్కరించారు.  కార్యక్రమంలో బార్‌ అ సోసియేషన్‌ అధ్యక్షుడు నాగార్జునరావు,ప్రధాన కార్యదర్శి శ్రీనివాసుల శ్రీని వాస్‌(వాసు) కార్యవర్గ సభ్యులు కేఎల్‌ఎన్‌ ప్రసాద్‌, రియాజ్‌,నయీం,రాజు,ధనమూర్తి,సీనియర్‌ న్యాయవాదులు బొబ్బా కోటిరెడ్డి,పాలేటి నాగేశ్వరరావు,ఈదుల కృష్ణయ్య,చింతకుంట్ల రాంరెడ్డి,నాగరాజు,రహీం,ఇతర న్యాయవాదులు,కోర్టు ఇబ్బంది పాల్గొన్నారు


logo