గురువారం 24 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 12, 2020 , 03:31:27

సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం అగ్రస్థానం

సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం అగ్రస్థానం పాలకవీడు :  సంక్షేమ పథకాల అమలులో తెలంగాణా ప్రభుత్వం దేశం లో అగ్రస్థ్ధానం లో  ఉందని హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.  మండల కేంద్రంలోని తాసిల్దార్‌  కార్యాలయంలో  శనివారం  కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమం  రైతులకు నూతన పట్టాదార్‌ పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం లో కోదాడ మాజీ  ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావ్‌తో కలిసి  పాల్గొన్నారు. ఈ సంధర్భంగా ఆ  16 మంది లభ్ధిదారులకు ప్రభుత్వం అందచేసిన చెక్కులను  అందచేశారు. ఈ కార్యక్రమం లో తాసిల్దార్‌ కృష్ణానాయక్‌,  నాయబ్‌  తాసిల్దార్‌ కిశోర్‌బాబు, రైతు సమన్వయసమితి  మండల కోఆర్డినేటర్‌  దేవిరెడ్డి వెంకటరెడ్డి ,టీఆర్‌ఎస్‌  ప్రధాన కార్యదర్శి ఎరెడ్ల సత్యనారాయణరెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు  అంజిరెడ్డి, ఎంపీటీసీ ఉపేందర్‌  నాయకులు భూక్యారవినాయక్‌, తాటికొండ వెంకటరెడ్డి,  చినవీరారెడ్డి పలు సర్పంచ్‌లు వెంకటేశ్వర్లు   పాల్గొన్నారు.


logo