గురువారం 24 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 12, 2020 , 03:30:38

యూనిఫాం సర్వీసులో క్రమశిక్షణ ముఖ్యం : ఎస్పీ

యూనిఫాం సర్వీసులో క్రమశిక్షణ ముఖ్యం : ఎస్పీ


 సూర్యాపేట సిటీ : యూనిఫాం సర్వీసులో క్రమశిక్షణ కీలకమని ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ సిబ్బందికి సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం  ఆయన పోలీసు దర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. 

నిజాయితీగా పని చేయాలి 
సిబ్బంది ప్రతి ఒక్కరూ స్వీయ క్రమశిక్షణ కలిగి ఉండి నిజాయితీగా పని చేయాలన్నారు. అందరూ కలసి సమష్టిగా పని చేసి లక్ష్యాలను సాధించాలన్నారు. పనితో పాటు ఆరోగ్యపై దృష్టి పెట్టాలని, కుటుంబ సభ్యులకు సమయం కేటాయించాలని సూచించారు. ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశించారు.
 
కోర్టు డ్యూటీ సిబ్బందికి  శిక్షణ
సకాలంలో నిందితులను, సాక్షులను, బాధితులను కోర్టులో హాజరు పర్చి నేరస్తులకు శిక్షలు పడేలా పని చేయాలని ఎస్పీ ఆర్‌.భాస్కరన్‌ కోర్టు సిబ్బందికి సూచించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలో పని చేస్తున్న కోర్టు డ్యూటీ సిబ్బందికి ఒక రోజు శిక్షణ  నిర్వహించారు. ఈ సందర్భంగా   సిబ్బందికి విధుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. నేరాలకు పాల్పడే వారికి జైలుశిక్ష పడితేనే నేరాలు చేయడానికి బయపడుతారని అన్నారు. కోర్టు డ్యూటీ సిబ్బంది కోర్టు అధికారులతో సమన్వయంతో పని చేయాలని తెలిపారు. సకాలంలో నిందితులను, సాక్షులను కోర్టులో హాజరుపర్చి ఫలితం వచ్చేలా పని చేయాలని పేర్కొన్నారు. కేసు పురోగతి ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. కోర్టు సామన్లు, ఎన్‌బీడబ్ల్యూలు, వారెంట్స్‌లు పెండింగ్‌లో ఉండకుండా వెంట వెంటనే సర్వ్‌ చేయాలని ఆదేశించారు. కేసుల పురోగతి చూపి నేరస్తులకు శిక్ష పడేలా పని చేసి ప్రతిబ చూపిన సిబ్బందికి ఆయన రివార్డులు అం దించారు.  కార్యక్రమంలో స్పెషల్‌ బ్రాంచి ఇన్‌స్పెక్టర్‌ రాజేష్‌, నర్సింహ, ఆర్‌ఐలు నర్సింహారావు, గోవిందరాజు, శ్రీనివాస్‌, డీసీఆర్‌బీ సీఐ సుధాకర్‌, ఎస్‌ఐ రామారావు, ఆర్‌ఎస్‌ఐ సంతోష్‌, శ్రావణి, రాంసింగ్‌, సంక్షేమ సంఘం అధ్యక్షుడు అమర్‌సింగ్‌ పాల్గొన్నారు.

కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికైన హోంగార్డులకు అభినందనలు
జిల్లాలో హోంగార్డ్సుగా పనిచేస్తూ ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన కానిస్టేబుల్‌ ఉద్యోగాల్లో ఎంపికైన ఆరుగురు హోంగార్డ్సును శనివారం ఎస్పీ ఆర్‌. భాస్కరన్‌ అభినందించారు. జిల్లాలో పని చేస్తున్న శ్రీనివాస్‌, అనిల్‌, అశ్విని, పుష్ప, రవీందర్‌, రాములు మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు.  కానిస్టేబుల్‌గా ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.


logo