శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 12, 2020 , 03:29:54

కనుల పండువగా కూడారై ఉత్సవం

కనుల పండువగా కూడారై ఉత్సవంబొడ్రాయిబజార్‌ : నెల రోజులుగా పట్టణంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా శనివారం శ్రీ వేంకటేశ్వరస్వామికి కూడారై పాయస నివేదన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయం భక్తులతో కిటకిటలాడింది.  తెల్లవారుజాము నుంచే స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, తిరుప్పావై ప్రబంధ సేవాకాలం, భజనలు నిర్వహించగా దేవాలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకుడు ఎన్‌.సీహెచ్‌.వేణుగోపాలచార్యులు మాట్లాడుతూ గోదాదేవి స్వామి వారిని దర్శించగా నీకు ఎమి కావాలని అడుగగా స్వామి వారికి ఇష్టమైన పాలు, నెయ్యితో తయారు చేసిన పాయసం స్వామి వారితో కలసి స్వీకరించే బాగ్యాన్ని కలిగించమని కోరిందన్నారు. ఈ మేరకు నాటి నుంచి నేటి వరకు ఆ విధంగా భక్తులు అమ్మవారికి మొక్కులు తీరుస్తూ వస్తున్నారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన పాయసాన్ని స్వామివారికి, అమ్మవారికి నివేదించి భక్తులకు అందజేశారు. భక్తులు పాయసాన్ని స్వీకరించి అమృతాన్ని స్వీకరించిన అనుభూతిని పొందినట్లు తెలిపారు. కార్యక్రమంలో హరిచరణ్‌ఆచార్యులు, సునీల్‌ ఆచార్యులు, ఈఓ ఎరువ శ్రీనివాస్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

మేళ్లచెర్వు : మండల కేంద్రంలోని వేంకటేశ్వరాలయంతో పాటు మండలంలోని రామాపురం, రేవూరు, కందిబండ తదితర గ్రామాల్లోని  వైష్ణవ ఆలయాల్లో ధనుర్మాసోత్సవాల్లో భాగంగా కూడారై ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాదేవికి తిరుప్పావై పాశురం, అభిషేకాలు, అర్చనలు ఘనంగా నిర్వహించారు.  స్థానిక వేంకటేశ్వరుడికి 108 గంగాళాలతో పాయసం నైవేద్యం సమర్పించారు. కార్యక్రమాల్లో అర్చకులు సుదర్శనం ప్రసాదాచార్యులు, మోహనకృష్ణమాచార్యులు, వేదాంతం వరప్రసాదాచార్యులు, అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు,  భానుకిరణ్‌శర్మ పాల్గొన్నారు.


logo