సోమవారం 21 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 12, 2020 , 03:29:14

యాదాద్రిలో ముగిసిన అధ్యయనోత్సవాలు

యాదాద్రిలో ముగిసిన అధ్యయనోత్సవాలు


యాదాద్రి భువనగిరి జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి అధ్యయనోత్సవాలు శనివా రం ముగిశాయి. శ్రీలక్ష్మీనరసింహస్వామి అలంకారం గావించి బాలాలయంలో స్వామివారిని ఊరేగించారు. వారం రోజులుగా జరగుతున్న అధ్యయనోత్సవాలు నేటితో ముగిశాయి. ఇలవేల్పు దర్శనం కోసం వచ్చిన భక్తులతో తిరువీధులన్నీ కిటకిటలాడా యి. కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు నారసింహుడిని దర్శించాలని గంటల కొద్దీ క్యూలో వేచి ఉన్నారు. శ్రీలక్ష్మీసమేతుడైన నరసింహస్వామి దర్శనానికి భక్తుల బారులు దీరారు. శ్రీ సత్యనారాయణస్వామి వారి వ్రతపూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహించారు.  ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీ లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేధనలు అర్పించారు. శ్రీసుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం ని ర్వహించారు. ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకు నే శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రతాల్లో భక్తులు పాల్గొన్నా రు.  సామూహిక వ్రతాలు పెద్ద ఎత్తున జరిగాయి. శ్రీసత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

శ్రీవారి ఖజానాకు రూ. 8,38,677 ఆదాయం
శ్రీవారి ఖజానాకు రూ. 8,38,677ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ. 62, 316, 150రూపాయల టిక్కెట్‌తో రూ. 27,000, కళ్యాణకట్ట ద్వారా రూ. 18,000, వ్రత పూజల ద్వారా రూ.40,000, ప్ర సాద విక్రయాలతో రూ. 3, 95, 453, శాశ్వత పూజల ద్వారా రూ.10,116తో పాటు మిగతా అన్ని విభాగాల నుంచి శ్రీవారి ఖజానాకు రూ. 8,38,677ఆదాయం సమకూరినట్లు తెలిపారు.


logo