గురువారం 24 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 10, 2020 , 10:39:47

జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షను పటిష్టంగా నిర్వహించాలి

జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షను పటిష్టంగా నిర్వహించాలి

నల్లగొండ విద్యావిభాగం : జవహర్ నవోదయ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్షను పటిష్టవంతంగా నిర్వహించాలని డీఈఓ బి.భిక్షపతి సూచించారు. నల్లగొండలోని డీఈఓ కార్యాలయంలో ఆ ప్రవేశ పరీక్ష కేంద్రాల చీప్ సూపరింటెండెంట్స్‌తో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష జరుగుతుందన్నారు.
విద్యార్థులు గంట ముందుగానే పరీ క్ష కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. హాల్‌టికెట్, పరీక్ష ఫ్యాడ్, బ్లూ లేదా బ్లాక్ పెన్ను, హెచ్‌బీ పెన్సి ల్, ఎరేజర్ తెచ్చుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వ ద్ద 144సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. అనంతరం పరీక్షలకు సంబంధించి మెటీరియల్స్‌ను వారికి అందజేశారు. సమావేశంలో సీఎస్‌లు, అధికారులు పాల్గొన్నారు.


logo