ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Suryapet - Jan 10, 2020 , 10:38:54

శ్రీకృష్ణుడిగా శ్రీలక్ష్మీనర్సింహుడు

శ్రీకృష్ణుడిగా శ్రీలక్ష్మీనర్సింహుడు

యాదాద్రి భువనగిరిజిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : శ్రీవారి అధ్యయనోత్సవాల్లో గురువారం శ్రీలక్ష్మీనర్సింహస్వామి వారు ఉదయం శ్రీకృష్ణుడిగా రాత్రి కాళీయమర్ధనుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. విశ్వశాంతి లోకకల్యాణార్ధం నిర్వహించే ఉత్సవాల్లో దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కోసం ఆయా కాలాల్లో భక్తులను కాపాడేందుకు ఆవిర్భవించిన అవతారవిశేషాలను వివరించేందుకు నాటి అవతార అలంకార రూపాలను నృసింహుడి సన్నిధిలో భక్తులకు కనువిందు కలిగే విధంగా తిరువీధుల్లో ఊరేగిస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు గోపికలు వెన్నముద్దలు అందించిన వారు చెప్పిన చేసేడి వాడని దీని అర్థం భగవానుడికి సమర్పణ బుద్ధితో సమర్పిస్తే భక్తుల సేవలో ఉంటాడని ప్రధానార్చకులు నల్లందీగల్ లక్ష్మీనర్సింహాచార్యులు వివరణ చేశారు.

కాళీయమర్ధనుడైన నర్సింహుడు...
అధ్యయనోత్సవాల్లో శ్రీనర్సింహుడు రాత్రి కాళీయమర్ధనుడిగా భక్తులకు దర్శనం కలిగించారు. శ్రీకృష్ణతత్వంలోని కాళీయమర్ధనుడు వృత్తాంతమును వివరించి తరింపజేశారు. బృందావనమునకు అతి సమీపమున గల మడుగులో కాళీయుడను భయంకర సర్పరాజు యమునా నదిలో భయబ్రాంతులకు గురిచేసే ఘట్టాలను వివరించారు. నదిలో ఉంటూ గోవులకు, గోపబాలుర ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తుండగా శ్రీస్వామివారిని ప్రా ర్ధించగా కాళీయమడుగులో దూకి భయంకరపోరాటంలో కాళీయుని గర్వం అణచివేసిన వైనాన్ని ప్రధానార్చకుడు న ల్లందీగల్ లక్ష్మీనర్సింహాచార్యులు వివరణ చేశారు. ఆలయ ఈఓ గీత, అనువంశికధర్మకర్త బి. నర్సింహమూర్తి తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఏఈఓ మేడి శివకుమార్, స్థానాచార్యులు రాఘవాచార్యులు, ఆలయ ఉపప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు పాల్గొన్నారు.


logo