e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home నల్గొండ పేదింటి ఆడబిడ్డకు ‘కల్యాణలక్ష్మి’ వరం

పేదింటి ఆడబిడ్డకు ‘కల్యాణలక్ష్మి’ వరం

పేదింటి ఆడబిడ్డకు ‘కల్యాణలక్ష్మి’ వరం

సూర్యాపేట టౌన్‌/ చివ్వెంల, జూలై 22 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరమని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట పట్టణంలో 51మంది, చివ్వెంల మండలంలోని గుంజలూరు, జి. తిరుమలగిరి, గుంపుల, తుల్జారావుపేట, వల్లభాపు రం, ఉండ్రుగొండ, దురాజ్‌పల్లి గ్రామాల్లో 30మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను నేరుగా వారి ఇండ్లకు వెళ్లి అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ మహిళల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలతో నిరుపేద ఆడబిడ్డల కుటుంబాల్లో ఆనందం వెల్లి విరుస్తున్నదని పేర్కొన్నారు.

ఉద్యమ సమయంలోనే అందరి కష్టాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. సూర్యాపేటలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పుట్ట కిశోర్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు. చివ్వెంల మండలంలో కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, ఆర్డీవో రా జేంద్రకుమార్‌,ఎంపీపీ ధరావత్‌ కుమారీ బాబూనాయక్‌, జడ్పీ టీసీ భూక్యా సంజీవ్‌ నాయక్‌, వైస్‌ ఎంపీపీ జూలకంటి జీవన్‌రెడ్డి, తాసీల్దార్‌ రంగారావు, ఎంపీడీవో జమలారెడ్డి, సర్పంచ్‌లు సుంకరి లక్ష్మమ్మ, కంచర్ల నిర్మల, దొంగరి కోటేశ్వర్‌రావు, జీడిమెట్ల నాగలక్ష్మి, పల్లేటి శైలజ, హనుమంతరావు పాల్గొన్నారు.

- Advertisement -

సీఎం కేసీఆర్‌ విజన్‌తో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి
కోదాడ: ‘రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ అభివృద్ధి ఆగదు.. సీఎం కేసీఆర్‌ రాష్ర్టాన్ని వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిపారు.. ముఖ్యమంత్రి విజన్‌తోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించింది..’ అని మం త్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. కోదాడ పట్టణంలో ఆర్డీవో కార్యాల యం కొత్త భవనం, ఇండ్లపై ఉన్న 33/11 కేవీ లైన్‌ తొలగించి హెచ్‌టీ లైన్లుగా మార్చుటకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తానని ఇచ్చిన హామీమేరకు ముఖ్యమం త్రి కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి గోదావరి జలాలను ర ప్పించి మెట్ట పొలాల్లో సిరుల పంట పండిస్తున్నారని అన్నారు. కోదాడలో గులాబీ జెండా ఎగిరిన తర్వాతే ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ నేతృత్వంలో అభివృద్ధి పరుగు తీసిందని పేర్కొన్నారు.

దశాబ్దాల నుంచి ప్రజల ఇండ్లపై వెళ్తున్న 33/11 కేవీ విద్యుత్‌ లైన్‌తో అనేక మంది మృత్యువాత పడినా గత పాలకులు పట్టించుకోలేదన్నారు. రూ.కోటి 16 లక్షల వ్యయం తో సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పారు. విద్యుత్‌ సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేసిన మంత్రి జగదీశ్‌రెడ్డికి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఆర్డీఓ కిశోర్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయ ణ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ బుర్రా సుధారాణి, ఎంపీపీలు చింతా కవితారెడ్డి, వెంకటేశ్వర్లు, యాతాకుల జ్యోతి, జడ్పీటీసీలు మందలపు కృష్ణకుమారి, పుల్లారావు, ఉమాశ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పేదింటి ఆడబిడ్డకు ‘కల్యాణలక్ష్మి’ వరం
పేదింటి ఆడబిడ్డకు ‘కల్యాణలక్ష్మి’ వరం
పేదింటి ఆడబిడ్డకు ‘కల్యాణలక్ష్మి’ వరం

ట్రెండింగ్‌

Advertisement