e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home నల్గొండ దేశ రక్షణలో సైనికులే నిజమైన హీరోలు

దేశ రక్షణలో సైనికులే నిజమైన హీరోలు

దేశ రక్షణలో సైనికులే నిజమైన హీరోలు

సూర్యాపేట టౌన్‌, జూలై 22 : దేశ రక్షణకు ప్రాణాలకు తె గించి పోరాడుతున్న సైనికులే నిజమైన హీరోలని ఎయిర్‌ క మాండర్‌ టీఎస్‌ఎస్‌ కృష్ణన్‌ అన్నారు. మాతృభూమి రుణం తీర్చుకోవడానికి యువత సైన్యంలో చేరాలని పిలుపునిచ్చారు. తెలంగాణ 31వ బెటాలియన్‌ ఆధ్వర్యంలో గురువారం కర్నల్‌ సంతోష్‌ బాబు విగ్రహాన్ని శుభ్రం చేశారు. అనంతరం కమాండ ర్‌ కృష్ణన్‌ జిల్లా ఎస్పీ భాస్కరన్‌తో కలిసి సంతోష్‌ బాబు విగ్రహా నికి నివాళులర్పించారు. నిమిషంపాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహావీర చక్ర కర్నల్‌ సంతోష్‌ బాబు సేవలను ఆయన ఈ సందర్బంగా కొనియాడా రు. రాష్ట్ర ప్రభుత్వం దివంగత సంతోష్‌ బాబు కుటుంబానికి అందించిన తోడ్పాటును సైనికులు ఎన్నటికీ మరువలేరని స్ప ష్టం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు చౌరస్తాకు సంతోష్‌బాబు పేరు పె ట్టడం గర్వంగా ఉందన్నారు.

యువత కర్నల్‌ సంతోష్‌ బాబు స్ఫూర్తితో సైన్యంలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొ న్నారు. ప్రతి సంవత్సరం మిలటరీ బెటాలియన్‌ ఆధ్వర్యంలో ఆయా రాష్ర్టాల్లోని అమర సైనికుల విగ్రహాలను శుభ్రం చేసి ని వాళులర్పిస్తారని తెలిపారు. అనంతరం కర్నల్‌ సంతోష్‌ బాబు తల్లిదండ్రులు ఉపేందర్‌, మంజుల మాట్లాడుతూ తన కుమా రుడు సైనికుడిగా దేశానికి అందించిన సేవలను గుర్తించి సీఎం కేసీఆర్‌, మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అందించిన సహకా రం, సూర్యాపేటలో తమ కుమారుడి విగ్రహం ఏర్పాటు చేయ డం సంతోషంగా ఉందన్నారు. అనంతరం పోలీస్‌ కళాజాతతో పాటు ఇమామ్‌ పేట, మోడల్‌ పాఠశాల, ఎస్వీ కళాశాల ఎన్‌సీసీ విద్యార్థులు పాడిన దేశభక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. కార్యక్ర మంలో కల్నల్‌ వినయ్‌ డాఖా, కల్నల్‌ ఎంసీఎస్‌ రావు, డీఎస్పీ మోహన్‌కుమార్‌, విశ్రాంత సైనికుడు కల్నల్‌ శ్రీనివాస్‌రావు, కె ప్టెన్‌ వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కమిషనర్‌ రామానుజుల్‌రెడ్డి, వి శ్రాంత సైనికులు, ఎన్‌సీసీ అధికారులు, పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దేశ రక్షణలో సైనికులే నిజమైన హీరోలు
దేశ రక్షణలో సైనికులే నిజమైన హీరోలు
దేశ రక్షణలో సైనికులే నిజమైన హీరోలు

ట్రెండింగ్‌

Advertisement