శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Jul 18, 2020 , 20:02:28

ఈ వారం మీ రాశి ఫలాలు

ఈ వారం మీ రాశి ఫలాలు

గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చి, అవసరానికి ఉపయోగపడుతుంది. పొదుపునకు మంచి సమయం. పనులు లాభదాయకంగా ఉంటాయి. పూర్వ పెట్టుబడులలో అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. శ్రద్ధతో, ఉత్సాహంతో పనులు చేస్తారు. ఇంటికి కావలసిన వస్తువులను కొంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. సమయానికి భోజనం చేస్తారు. ఆహార నియమాలను పాటిస్తూ సంతోషంతో ఉంటారు. ప్రారంభించిన పనులకోసం ఆర్థిక సర్దుబాట్లు ఉండవచ్చు. అయినా, అవి సకాలంలో పూర్తవుతాయి. స్నేహితులను కలుసుకొంటారు. రాజకీయ, కోర్టు పనుల కోసం అధిక ఖర్చులు ఉండవచ్చు. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. అందరితో సత్సంబంధాలు పెంచుకుంటారు.

మేషం

గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చి, అవసరానికి ఉపయోగపడుతుంది. పొదుపునకు మంచి సమయం. పనులు  లాభదాయకంగా ఉంటాయి. పూర్వ పెట్టుబడులలో అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. శ్రద్ధతో, ఉత్సాహంతో పనులు చేస్తారు. ఇంటికి కావలసిన వస్తువులను కొంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. సమయానికి భోజనం చేస్తారు. ఆహార నియమాలను పాటిస్తూ సంతోషంతో ఉంటారు. ప్రారంభించిన పనులకోసం ఆర్థిక సర్దుబాట్లు ఉండవచ్చు. అయినా, అవి సకాలంలో పూర్తవుతాయి. స్నేహితులను కలుసుకొంటారు. రాజకీయ, కోర్టు పనుల కోసం అధిక ఖర్చులు ఉండవచ్చు. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి.  అందరితో సత్సంబంధాలు పెంచుకుంటారు. 


వృషభం

ఆలోచనలను కార్యరూపంలో పెట్టండి. ప్రయత్నం మీద కార్యాలలో తాత్కాలిక ప్రయోజనాలు ఉంటాయి. పనులు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. జాగ్రత్త అవసరం. గృహ నిర్మాణం, పరిశ్రమలు, వ్యవసాయం లాభదాయకంగా ఉంటాయి. భూమి, వాహనాల వల్ల లాభం వుండవచ్చు. డబ్బు విషయమై జాగ్రత్త అవసరం. స్త్రీలకూ అనుకూలమైన వారం. స్వయంవృత్తి ద్వారా ధనలాభం పొందగలరు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొంటారు. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. నూతన వస్త్ర వస్తుప్రాప్తి కలగవచ్చు. భార్యాపిల్లలతో ఆనందంగా ఉంటారు. కీర్తి, గౌరవ మర్యాదలు ఉంటాయి. 


మిథునం

వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మీయులు, పెద్దల సలహాలకు ప్రాధాన్యం ఇస్తారు. దేవతా గురుభక్తి పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఒప్పందాలలో అభివృద్ధి వుండవచ్చు. డబ్బు విషయమై జాగ్రత్త అవసరం. అనుకున్న పనులు పూర్తవుతాయి. కొన్ని అవాంతరాలు ఉండవచ్చు. వృథా ఖర్చులు ఉండవచ్చు. నియంత్రణ అవసరం. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి. ఆలోచనలను కార్యరూపంలో పెట్టాలి. భార్యాపిల్లలతో సుఖంగా ఉంటారు. ధనలాభం వుండవచ్చు. విలాస వస్తువులను కొంటారు. సుగంధద్రవ్యాలు, అలంకార వస్తువులను కొని అనుభవిస్తారు. సేవా, భగవత్‌ ఆరాధన కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభ ఫలితాలు కలుగుతాయి. సుఖ, సంతోషాలకు అధికంగా ఖర్చు చేస్తారు. బంధువులతో సామరస్యం అవసరం. 


కర్కాటకం

వారం మొదట్లో కొంత ఇబ్బంది ఉన్నా క్రమేపీ అనుకూలిస్తుంది. భార్యాపిల్లలతో హాయిగా ఉంటారు. సమయానికి మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. వాటిని కార్యరూపంలో పెడతారు. సంఘంలో మంచి పేరు, గౌరవ మర్యాదలు పొందుతారు. విలాసవంత జీవితం గడుపుతారు. సంప్రదాయాలు, సంగీత సాహిత్యాలపై మనసు నిలుపుతారు. కళలు, రచనల ద్వారా మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకూ ఈవారం కలిసివస్తుంది. ఋణంగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఆదాయం స్థిరంగా ఉండటంతో సంతృప్తిగా ఉంటారు. వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పనిభారం ఉన్నా సకాలంలో భోజనం చేస్తారు. ఆహార నియమాలను పాటిస్తారు. 


సింహం

ప్రారంభంలో, చివరిలో అనుకూలం. వ్యాయామం, ధ్యానంపై శ్రద్ధ కనపరుస్తారు. ఆరోగ్యంగా ఉంటూ పనులను  ఉత్సాహంతో చేస్తారు. చిరుతిండ్లకు దూరంగా ఉండటం మంచిది. ఆహార నియమాలను పాటిస్తారు. బంధువులు, స్నేహితులతో బాంధవ్యాలు పెంచుకోవాలి. తద్వారా పనులు నెరవేరుతాయి. గతంలో ఋణంగా ఇచ్చిన డబ్బు చేతికి వస్తుంది. దానికి తోడుగా ఆదాయం పెరుగుతుంది. ఖర్చులను నియంత్రిస్తే పొదుపుకు, స్థిరచరాస్తుల కొనుగోలుకు  అనుకూలమైన సమయం. పనివారు అనుకూలంగా ఉంటారు. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి మంచి అవకాశం వస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. సమాజంలో మంచి పేరు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. 


కన్య

వారం చివర ఖర్చులు ఉండవచ్చు. మిగతా రోజులు అనుకూలంగా ఉంటాయి. ఆహార నియమాలను పాటిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. పనులలో ఉత్సాహం ప్రదర్శిస్తారు. భోజన సౌఖ్యం ఉంటుంది. సంపాదన సంతృప్తికరంగా ఉంటుంది.  ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త వస్ర్తాలను కొంటారు. సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక, సంప్రదాయ కార్యక్రమాలలో పాల్గొంటారు. స్నేహితులు, ఆత్మీయులతో ఆప్యాయత పెంచుకొంటారు. సహాయ సహకారాలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలలో ఖర్చులు ఉన్నా తాత్కాలికంగా కలిసివస్తుంది. ఆఫీసులో అందరితో బాగా ఉంటారు. అనుకున్నవి సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉంటూ పై అధికారులతో అభిప్రాయ బేధాలు రాకుండా జాగ్రత్త పడతారు. 


తుల

వారం చివరిలో ఖర్చులు ఉంటాయి. సమయస్ఫూర్తితో తాత్కాలిక ప్రయోజనాలు చాలా లభించగలవు. బంధుమిత్ర సోదరులతో ప్రేమపూర్వకంగా ఉంటారు. గత తగాదాలు పరిష్కారం కావచ్చు. పెద్దల సహాయ సహకారాలను  వినియోగించుకోవాలి. దైవభక్తి, గురుభక్తి, సాంప్రదాయ భావనలు పెరుగుతాయి. పురాణ ఇతిహాస పఠనాలతో ప్రశాంతంగా ఉంటారు. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. శ్రామికులకు పనులు కలిసివస్తాయి. వివాదాలలో  జాగ్రత్త అవసరం. వ్యాపారంలో లాభాలు స్థిరంగా ఉంటాయి. క్రయ విక్రయాలలో అప్రమత్తంగా ఉండాలి. ప్రారంభించిన  పనులను పూర్తి చేయడంపైన మనసు నిలపాలి. కొత్త పనులు ప్రారంభించకుండా ఉండటం మంచిది. సమయానికి తగ్గట్టుగా ఆలోచనలు చేస్తారు. 


వృశ్చికం

ఈ వారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సంతృప్తిగా ఉంటారు. పొదుపు చర్యలకు అనుకూలమైన సమయం. గతంలో ఋణంగా  ఇచ్చిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు చేయడానికి ఆలోచిస్తారు. ఆదాయం పెరుగుతుంది. మంచి పనులకు ఖర్చు  చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. చదువులో అనుకూల ఫలితాలు రావచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రద్ధ అవసరం. మంచి ప్రణాళికతో కొత్త పనులు ప్రారంభించడానికి ఈవారం చాలా అనుకూలం. మంచివారితో స్నేహం పెరుగుతుంది. పూర్వ పరిచయస్తులను కలుసుకుంటారు. కావలసిన వస్త్ర వస్తువులను కొంటారు. విందులు, వినోదాలకు దూరంగా ఉంటారు. 


ధనుస్సు

ఆలోచించి పనులు చేయాలి. అన్ని పనులలో సహనంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ఇతరులపైనా ఆధారం పడటం తగ్గించాలి. స్వయంగా పనులు చేసుకోవడం మంచిది. వృత్తి వ్యాపార పనులను సంయమనంతో చేయాలి. క్రయవిక్రయాలలో పనివారితో ఇబ్బందులు వుండవచ్చు. ఆత్మవిశ్వాసంతో పనులు చేయండి. పరిస్థితులు కొంతవరకు అనుకూలిస్తాయి. పనులలో ఆలస్యం ఉండవచ్చు. శ్రమించి పనులు చేయాలి. వృథా కాలయాపనలు ఉండవచ్చు. అనవసర చర్చలు, విందులు, వినోదాలకు దూరంగా ఉండాలి. ప్రతికూలంగా గ్రహాలు సంచరిస్తున్నాయి. దైవచింతనతో ఆ పరిస్థితులను అధిగమిస్తారు. కొత్త పనులు ప్రారంభించకండి. పాతవి పూర్తి చేయండి. పనులలో ఆలస్యంగా ఫలితాలు ఉంటాయి.


మకరం

ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా వృత్తి వ్యాపారాలలో ప్రయోజనాలు ఉంటాయి. వారం ప్రారంభంలో అనుకూలం, మధ్యలో పనిభారం ఉండవచ్చు. వారం చివర ప్రయాణాలు కలిసి వస్తాయి. పెట్టుబడులవల్ల లాభాలు, క్రయ విక్రయాలు  లాభదాయకంగా ఉంటాయి. నిర్ణయాలు సకాలంలో తీసుకొంటారు. పెద్దల సూచనలు, సలహాలను కార్యరూపంలో పెడతారు. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఖర్చులు ఆలోచించి చేయాలి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యవసాయదారులకు మంచి ఫలితాలు వుంటాయి. సమయం కలిసివస్తుంది. ప్రయోజనాలు ఉంటాయి. భార్యా పిల్లలు, కుటుంబసభ్యులతో సంతోషంగా ఉంటారు. 


కుంభం

వారం చివర ఆహారం విషయమై జాగ్రత్త అవసరం. వివాహాది శుభకార్య, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగం లభిస్తుంది. పదోన్నతులు ఉండవచ్చు. మంచిపేరు, ప్రారంభించిన పనులలో సత్ఫలితాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. పొదుపు చేస్తారు. పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. అవగాహన పెంచుకుంటారు. పెద్దలనుండి మంచి సలహాలను సమయానికి పొందుతారు. శ్రమ, ఖర్చు ఉన్నా పనులలో ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. సంగీత, సాహిత్యాలపైనా శ్రద్ధ నిలుపుతారు. భార్యాపిల్లలతో హాయిగా ఉంటారు. ప్రయాణాలవల్ల ఖర్చు ఉండవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తారు. 


మీనం

వారం ప్రారంభంలో కొంత ఇబ్బంది కలుగవచ్చు. క్రమేపీ పనులు అభివృద్ధిలోకి వస్తాయి. పెద్దల సూచనలను పాటించడంతో పనులు పూర్తవుతాయి. వివాహం, చదువు, ఉద్యోగం, వ్యాపార యత్నాలు అనుకూలిస్తాయి. బదులుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఇతరత్రా ఆదాయం పెరుగుతుంది. మిత్రులతో జాగ్రత్త అవసరం. ఆహార నియమాలను పాటిస్తూ జీవన విధానంలో స్వయంగా మార్పులు తెచ్చుకుంటారు. ఆరోగ్యంగా ఉంటారు. సంగీత సాహిత్యాలపై శ్రద్ధ చూపుతారు. ఉద్యోగంలో పదోన్నతులు ఉండవచ్చు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. సంతోషంతో అన్ని విధాలా సంతృప్తిగా ఉంటారు. సమయ పాలనకు ప్రాధాన్యమిస్తారు.


logo