బుధవారం 28 అక్టోబర్ 2020
Sunday - Mar 28, 2020 , 22:51:01

రాశి ఫలాలు

రాశి ఫలాలు

 మేషంవృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.  నిత్యావసర వస్తు వ్యాపారం వస్త్ర, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారాల్లోని వారికి ఈ వారం కలిసి వస్తుంది. పూర్వపు పెట్టుబడుల వల్ల ఆదాయం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. ఉద్యోగంలో ఉన్న వారికి తోటి వారితో జాగ్రత్తలు, సమయస్ఫూర్తితో మెలగడం అవసరం. చదువు, శుభకార్యాల విషయాల్లో ఆలస్యం, ఆటంకాలు ఉంటాయి. రెట్టింపు ప్రయత్నాలు అవసరం. మంచి వారి సహచర్యం ఉంటుంది. సంఘంలో పేరును సంపాదిస్తారు. అనవసర చర్చలకు దూరంగా ఉండడం మంచిది.


వృషభంకుటుంబసభ్యులతో సమన్వయంగా  ఉంటారు. సంతృప్తిగా గడుపుతారు. ఇంటికి కావాల్సిన వస్త్ర, వస్తువులను కొంటారు.  ఆధ్యాత్మిక పరమైన ప్రవచనాలు, సాహిత్యంపై దృష్టి నిలుపుతారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. చదువు విషయంలో అనుకూలిస్తుంది. శుభకార్యాలు చేస్తారు. నలుగురిలో  పేరును సంపాదిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదల వల్ల పనులు బాగా నెరవేరుతాయి. నిత్య వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు అనుకూలిస్తుంది.


మిథునంఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. పై అధికారులతో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ చాకచక్యంతో పనులు చేస్తూ వెళతారు. తోటి ఉద్యోగుల సహకారం చాలా ఉంటుంది. ధైర్యంతో ముందుకు వెళతారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ప్రధాన గ్రహాల అష్టమ స్థితి కొంత ఇబ్బందికర వాతావరణాన్ని ఇస్తుంది. రాబట్టి జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకోవడం అవసరం. నిర్మాణరంగం, వ్యాపార రంగాల్లో ఉన్న వారు  పనులను, నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది.


కర్కాటకంకుటుంబసభ్యులతో సౌఖ్యంగా ఉంటారు. సంగీత సాహిత్య, సినిమా రంగాల్లోని వారికి అనుకూలంగా ఉంటుంది. ఇంటికి కావాల్సిన వస్త్రాలు, వస్తువులను కొంటారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక పరమైన ప్రవచనాలు, విషయాలపై మనసు నిలుపుతారు. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. అంతేకాకుండా అనుభవజ్ఞులు, తల్లిదండ్రులను గౌరవించడంతో సమాజంలో  మంచి పేరు సంపాదిస్తారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న వారికి విజయం చేకూరుతుంది. శుభకార్యాలు చేస్తారు. ముఖ్యంగా విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. 


సింహంఆలోచనలు స్ఫురిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. రావాల్సిన డబ్బు వస్తుంది. పనులు నెరవేరుతాయి. అన్నదమ్ములు, బంధువులు, ఆత్మీయులతో మంచి సంబంధాలు ఉంటాయి. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. నిర్మాణ రంగాలలో ఉన్న వారికి ఆదాయం కలిసి వస్తుంది. వ్యవసాయ దారులకు అనుకూలమైన వారం. ఇరుగు పొరుగు వారితో సంబంధాలు పెంపొందుతాయి. ఉద్యోగస్తులకు తోటి వారితో, పై అధికారులతో అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఇంటిలో అనవసరమైన చర్చలకు తావులేకుండా చూసుకోవడం మంచిది. 


కన్య


శనిస్థితి ప్రతికూలంగా ఉంది. అయినా గురు రాశి మార్పు వల్ల కొన్ని పనులు నెరవేరుతాయి. ఇంటి వాతవరణం సంతృప్తికరంగా ఉంటుంది. శుభకార్యాల సమాలోచన, పిల్లల చదువు, ఉద్యోగాల ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో పేరును సంపాదిస్తారు. ఆధ్యాత్మిక పరమైన ప్రవచనాలపై మనసు నిలుపుతారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లో శ్రద్ధ కనబరుస్తారు. నిత్య వ్యాపారం అనుకూలిస్తుంది. న్యాయవాద, ఉపాధ్యాయ, వైద్య వృత్తులోని వారికి బాగా కలివస్తుంది. కుటుంబసభ్యులతో  సమన్వయంగా ఉంటారు. 


తులఅర్దాష్టమ గ్రహస్థితి వల్ల పనుల్లో ఆటంకాలు ఉండొచ్చు. జాగ్రత్త అవసరం. ఉద్యోగం నిరాటంకంగా కొనసాగుతుంది. తోటి వారితో సంతృప్తిగా ఉంటారు. ఆఫీసులో పేరు సంపాదిస్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. కుటుంబసభ్యులందరితోనూ సమన్వయంతో, హాయిగా ఉంటారు. అనవసరమైన ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం, చిన్న సమస్యలను పెద్దవిగా ఊహించుకోవడంతో తాత్కాలికంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. మానసిక దృఢత్వం అవసరం. 


వృశ్చికంరావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. పనివారితో అనుకూలత ఉంటుంది.  పనులు వేగవంతంగా సాగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. స్నేహితులు, ఆత్మీయులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. మంచి చర్చల వల్ల పనులు అనుకూలిస్తాయి. నిత్య వ్యాపారం బాగా కలిసి వస్తుంది.  వడ్డీ, షేర్లు మొదలగు వ్యాపారాల్లో  తాత్కాలిక లాభాలుంటాయి. న్యాయవాద, ఇంజినీరింగ్‌ వృత్తుల్లోని వారికి కలిసి వస్తుంది. పెద్దల సహాయ సహకారాలు తీసుకుంటే పనులు ముందుకు సాగుతాయి. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలి. 


ధనుస్సుగతం కంటే అనుకూలంగా ఉంటుంది. పనులు పూర్తవుతాయి. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. విద్యార్థులకు చదువు విషయంలో అనుకూలత, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. మిగతా గ్రహాల స్థితి ప్రతికూలంగా ఉంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించడం, చాలా అవసరం. గృహనిర్మాణం, రియల్‌ ఎస్టేట్‌ వారికి మెరుగైన ఫలితాలుంటాయి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లో ఉన్న వారికి పనులు నెరవేరుతాయి. అయితే అనుకున్న రాబడి ఉండకపోవచ్చు.


మకరం


నిత్య వ్యాపారం బాగా కలిసి వస్తుంది. పూర్వపు పెట్టుబడుల వల్ల ఫలితాలు ఉంటాయి. న్యాయవాద, వైద్య వృత్తుల్లోని వారికి మంచి పేరు వస్తుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి తాత్కాలిక ప్రయోజనాలు ఉన్నాయి. తోటి ఉద్యోగులతో సమన్వయం,  అనుకూల ప్రాంతాలకు బదిలీలుంటాయి. ఆఫీసులో మంచి పేరు సంపాదిస్తారు. కుటుంబసభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆలోచించి పనులు చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ఉత్సాహం కలుగుతుంది. 


కుంభం


కుటుంబసభ్యులతో సంతృప్తిగా ఉంటారు. పెద్దల సహాయ సహకారాలు సమయానికి అందుతాయి. తద్వారా చాలా పనులు నెరవేరుతాయి. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లో ఉన్న వారికి ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. నిర్మాణ రంగం, రియలెస్టేట్‌ వ్యాపారంలో ఉన్న వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.   నిత్యవ్యాపారంలో మానసికం దృఢత్వం అవసరం. న్యాయ పరమైన సమస్యలను ఎదుర్కొంటారు.


మీనంనిత్య వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. వడ్డీ, షేర్లు, వస్త్ర, ఫ్యాన్సీ, క్యాటరింగ్‌ వ్యాపారాల్లో ఉన్న వారు లాభాలను గడిస్తారు. కుటుంబసభ్యులందరితోనూ సంతృప్తిగా, హాయిగా ఉంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. రాబడి పెరుగుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్న వారికి ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులకు మంచి సమయం, అనుకున్న ఫలితాలు పొందుతారు. పోటీ పరీక్షలలో మంచి స్థాయిలో నిలుస్తారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. 


logo