e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home బతుకమ్మ రాశి ఫలాలు

రాశి ఫలాలు

రాశి ఫలాలు

మేషం
ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. కొత్త స్నేహితుల పరిచయాలతో పనులు కలిసివస్తాయి. బంధువులు, స్నేహితులను కలువడంతో ఖర్చులు పెరుగవచ్చు. పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. భక్తిభావనతో ఉంటారు. ఆలోచనలను ఆచరణలో పెడతారు. అనుకూల ఫలితాలు పొందుతారు. సేవాభావంతో పనులు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. బాగా రాణిస్తారు. అనుకూల ఫలితాలను పొందుతారు. వ్యాపార విస్తరణలో జాగ్రత్తలు పాటించాలి. పెట్టుబడులు కలిసివస్తాయి.

రాశి ఫలాలు

వృషభం
ఆత్మీయులతో సంబంధాలు పెంపొందుతాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. పనిపై శ్రద్ధ, మనసు నిలుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. సంతృప్తిగా ఉంటారు. అన్నదమ్ములతో పనులు కలిసివస్తాయి. చిన్న చిన్న మనస్పర్ధలు ఉండవచ్చు. సమయానికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉన్నత స్థాయి వారితో పరిచయాలు ఏర్పడతాయి. నలుగురిలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. చాలా రోజులుగా నలుగుతున్న సమస్యలు, వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు, భూముల విషయంలో జాగ్రత్త అవసరం. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. చిన్నపాటి మనస్పర్ధలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు.

రాశి ఫలాలు

మిథునం
వృత్తి, వ్యాపారాలలో బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఆత్మీయులతో సంతోషాన్ని పంచుకొంటారు. ఆలోచనలను ఆచరణలో పెట్టడంలో ఆలస్యం జరగవచ్చు. విద్యార్థులు అనుకూల ఫలితాలను పొందడానికి కొంత శ్రమ అవసరం కావచ్చు. పనులలో విజయం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రయాణాలవల్ల ఖర్చులు పెరుగవచ్చు. పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. సలహాలను గౌరవించి అమలు చేస్తారు. పట్టుదలతో, విశ్వాసంతో ముందుకు వెళతారు. సమాజంలో ఉన్న మంచిపేరుతో పనులు నెరవేరుతాయి. ఆలోచనలను నలుగురితో పంచుకొని సరైన నిర్ణయాలు తీసుకోవడం అవసరం. డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

రాశి ఫలాలు

కర్కాటకం
నిలిచిన పనులలో కదలిక ఉంటుంది. సమస్యలు దూరమవుతాయి. వ్యక్తుల పరిచయాలతో అదృష్టం కలిసివస్తుంది. సమయస్ఫూర్తితో ఆలోచనలు అమలు చేస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. గృహనిర్మాణ పనులలో ఆలస్యమైనా పనులు పూర్తవుతాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. ఉద్యోగ, వివాహాది శుభకార్య ప్రయత్నాలలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. రావలసిన డబ్బు చేతికి అందడంలో జాప్యం జరుగవచ్చు. ఆదాయం స్థిరంగా ఉండటంతో సంతృప్తిగా ఉంటుంది. నిత్య వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతారు.

రాశి ఫలాలు

సింహం
శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. అనుకోకుండా వివాదాలు ముందుకు రావచ్చు. బంధువర్గంతో జాగ్రత్త అవసరం. అన్నదమ్ములతో చిన్నపాటి మనస్పర్ధలు ఉండవచ్చు. పనిపట్ల మనసు నిలుపడం, పట్టుదలతో పని చేయడం అవసరం. భక్తి భావనలు పెంపొందించుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా కలిసివస్తాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కొత్త పనులను ప్రారంభించడానికి అనుకూలం. కుటుంబసభ్యులు, భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు.

రాశి ఫలాలు

కన్య
బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ప్రారంభించిన పనులు అనుకొన్న సమయంలో పూర్తవుతాయి. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. ఉద్యోగస్తులు ఆఫీసులో అధికారుల ప్రశంసలు పొందుతారు. నిర్మాణ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఆర్థిక సమస్య మూలంగా కొన్ని పనులలో జాప్యం ఉండవచ్చు. కుటుంబ సభ్యులందరితోనూ సరదాగా ఉంటారు. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. చదువులో రాణించి ఉత్తమ ఫలితాలు పొందుతారు. నిర్ణయాలు సమయానుకూలంగా తీసుకోవడంతో పనులు కలిసివస్తాయి. వృత్తి, వ్యాపారాలలో భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలలో కొంత జాగ్రత్త అవసరం. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. నియంత్రణ అవసరం. ఉద్యోగం స్థిరంగా ఉంటుంది.

రాశి ఫలాలు

తుల
వృత్తి, ఉద్యోగాలలో ఆదాయం అస్థిరంగా ఉన్నా గత పెట్టుబడులవల్ల కలిసి రావడంతో సంతృప్తిగా ఉంటారు. బంధుమిత్రులు, ఆత్మీయులతో స్నేహభావం పెంపొందించుకోవాలి. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. పనులు శ్రమతో పూర్తవుతాయి. అందరితో సామరస్యంగా ఉంటూ పనులు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. పరిచయాలు కార్య సాఫల్యాన్నిస్తాయి. మిత్రుల కలయిక సంతోషకరమైనా ఖర్చులు పెరగవచ్చు. శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సలహాలు తీసుకుంటూ ముందుకు వెళతారు. వాహనాల కొనుగోలులో ఆలస్యం జరుగవచ్చు. కావలసిన వస్త్ర, వస్తువులను కొంటారు. ప్రత్యర్థులతో సమస్యలు ఉంటాయి. ఓపికతో పరిష్కరించుకోవాలి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది.

రాశి ఫలాలు

వృశ్చికం
ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. మిత్రులను కలుసుకోవడంతో ఖర్చులు పెరుగుతాయి. కొత్త పనులు ప్రారంభించడంలో జాప్యం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. పనులను శ్రమించి పూర్తి చేస్తారు. ఆస్తుల విషయంలో తగాదాలు పరిష్కారమవుతాయి. సంగీత, సాహిత్య, రచనా వ్యాసంగాలపై ఆసక్తి పెరుగుతుంది. పొదుపునకు అనుకూల సమయం. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండటంతో కొత్త పనులు ప్రారంభించవచ్చు. బాకీలు వసూలవుతాయి. చదువులో శ్రమ అవసరం. ప్రయత్నాలు కలిసివస్తాయి.

రాశి ఫలాలు

ధనుస్సు
ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందడంలో జాప్యం జరుగవచ్చు. ఆదాయ మార్గాలను అన్వేషించడంలో సఫలీకృతులవుతారు. విధానపరమైన మార్పులు చేపడతారు. కొత్త పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. డబ్బు విషయంలో జాగ్రత్తలు అవసరం. నిత్య వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో మంచిపేరు సంపాదిస్తారు. పనిలో బాధ్యతలు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులవల్ల కొన్ని పనులు వాయిదా పడవచ్చు. ఆర్థిక సర్దుబాట్లు అవసరమవుతాయి. విద్యార్థులు ఏకాగ్రతతో శ్రమించి సత్ఫలితాలు పొందుతారు.

రాశి ఫలాలు

మకరం
బంధు మిత్రులతో కార్యసాఫల్యత ఉంటుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలున్నా సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు. పనులను సరైన సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. పెద్దల సలహాలతో పనులు నెరవేరుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ప్రయత్నాలలో తాత్కాలిక ఫలితాలు ఉంటాయి. నిత్య వృత్తి, వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. వివాదాలను నేర్పుతో అధిగమిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. సిబ్బందితో ఇబ్బందులు ఎదురుకావచ్చు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. అనవసరమైన ఖర్చులు ముందుకు రావచ్చు.

రాశి ఫలాలు

కుంభం
పరిస్థితులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూల ఫలితాలు పొందుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంట్లో భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యంతో సంతృప్తిగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. కొన్ని విషయాలలో అనవసరమైన ఖర్చులు ఉండవచ్చు. గృహ నిర్మాణం, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. శుభకార్యాలవల్ల ఖర్చులు పెరుగవచ్చు. రావలసిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. వాహనాల కొనుగోలు వాయిదా పడుతుంది. పనిలో నైపుణ్యతవల్ల మంచిపేరు సంపాదిస్తారు.

రాశి ఫలాలు

మీనం
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు చేయడానికి అనువైన వారం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పెద్ద పెట్టుబడితో దీర్ఘకాలిక పనులను ప్రారంభిస్తారు. ఆస్తుల వివాదాలు పరిష్కారమవుతాయి. మంచి సలహాలు పొందుతారు. సహోద్యోగులతో చిన్నపాటి మనస్పర్ధలు ఉండవచ్చు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. పట్టుదలతో శ్రమించి సత్ఫలితాలు పొందుతారు. ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. భూములు, వాహనాలు, వస్తువులను కొనుగోలు చేస్తారు. పనిలో నైపుణ్యం వల్ల నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్‌., ఫోన్‌: 040-27651530
ఈ మెయిల్‌ : [email protected]

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రాశి ఫలాలు

ట్రెండింగ్‌

Advertisement