e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home బతుకమ్మ ఇంట్లో ఏ వైపుకు ఏముండాలి..

ఇంట్లో ఏ వైపుకు ఏముండాలి..

మాది మంచి డూప్లెక్స్‌ ఇల్లు. తూర్పులో మెట్లు ఉన్నాయి. దాని కింది స్థలాన్ని బయటి నుంచి ‘స్టాఫ్‌ గది’గా ఇవ్వొచ్చా?

  • మోతి చంద్రకళ, మేడిపల్లి

మీది అందమైన భవనమే అయినా, గొప్పగా ఉన్నా, తూర్పువైపు మెట్లు రావడం పెద్ద దోషం. పైగా మీది డూప్లెక్స్‌ ఇల్లు అంటున్నారు. ఇక మెట్ల కింది స్థలాన్ని బయటకు ఇవ్వడం మంచిది కాదు. మెట్లు దక్షిణంలో ఉన్నా, పడమరలో ఉన్నా దాని కింది స్థలాన్ని ‘స్టోర్‌’గా వాడుకోవడం మంచిది. కాస్త అడ్జస్ట్‌ అయితే దాని కింద బాత్‌ రూమ్‌ కూడా కట్టుకోవచ్చు. ఏ మూల, ఏ దిశ నుంచి అయినా ఇంటి భాగం కట్‌ చేయడం సరైన విధానం కాదు. ఇంటి అన్ని దిశలూ పూర్ణంగా ‘గృహ ఆవరణ’తోనే కలిసి ఉండటం ప్రధానం. అవసరం కూడా! ఇంట్లో అనవసరమైన ఇతరత్రా ‘స్టాఫ్‌ గదులు’ బయటి ఆవరణలో సర్దుబాటు చేయడం మంచిది. వేటికవి స్వతంత్రంగా ఉండాలి కానీ, ప్రధాన గృహానికి అనుబంధంగా ఉండకూడదు.

- Advertisement -

మాకు తూర్పు బాల్కనీ వాలుగా ఉంది. వంటగదిని ముందుకు పెంచుకోవచ్చా?

  • గటిక శ్రీనివాస్‌, సిద్దిపేట

ఇంటికి ఉన్న తూర్పు బాల్కనీ ఎలివేషన్‌ కోసం వాలుగా చేయడం సర్వసాధారణమే. కొందరు ముందుకు పెంచుతుంటారు. ఇంటి ముందు స్థలం ఖాళీగా ఉండాలనే ఆలోచన నుంచే బాల్కనీలు పుట్టాయి. నేల మీద ఇల్లుకడితే ఎంతో కొంత ఇంటి ముందు ఖాళీ స్థలం వదులుతాం. అదేవిధంగా పైఅంతస్తులో కట్టినపుడు బాల్కనీలే ఖాళీ స్థలాలు అవుతాయి. వాటిని గదుల్లోకి కలుపుకోవడం దోషం. స్లోప్‌గా ఉన్న బాల్కనీ స్ట్రెయిట్‌గా చేసినప్పుడు స్థలం పెరుగుతుంది. కానీ, ఆ భాగాన్ని వంటగదిలోకి కలుపుకొంటే మీ ఇంటి ఆగ్నేయం పెరుగుతుంది. స్లోప్‌ స్థలం మీకు అదనంగా వచ్చినా ఇంటి తూర్పు పారు దాటి కిచెన్‌ను ముందుకు జరపడం మంచిది కాదు. యథా స్థానంలో ఉంచండి.

మా ఇంటికి తూర్పు, పడమర రోడ్లు ఉన్నాయి. పడమర సెల్లార్‌ తీసి, తూర్పు నుంచి నడుస్తున్నాం. మంచిదేనా?

  • ధీరజ్‌కుమార్‌, తెల్లాపూర్‌

మీ ఇంటికి ఉన్న రోడ్ల ఎత్తుపల్లాలు ముందు చూడాలి. సెల్లార్‌ పడమర వైపు తీయడం మంచిది కాదు. తూర్పు, పడమర రోడ్లు ఉన్నాయి కాబట్టి, పడమర సింహద్వారం చేసుకొని ఇంటికి సెల్లార్‌ తీసుకోవచ్చు. అవసరమైతే ఫస్ట్‌ ఫ్లోర్‌ను తూర్పు నుంచి వాడుకోవచ్చు. పడమర సెల్లార్‌ తీసి, తూర్పు వైపు నడవడం మంచిది కాదు. తూర్పు సగభాగం ఎత్తు చేసి, పడమరన గొయ్యి తీయడం చాలా సమస్యలకు కారణం అవుతుంది. వెంటనే మార్చండి. మీ నడక కన్నా, మీ సెల్లార్‌ నిర్మించిన తీరు ముందు సరిచేయండి. రెండు రోడ్లు సమాన ఎత్తులో ఉన్నప్పుడు.. సెల్లార్‌ను సగం వరకు కాకుండా పూర్తిగా తీయండి.

పాత ఇంటిని మార్చితే మంచి ఫలితాలు వస్తాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దయచేసి వివరించండి.
-కోదు లత, ఖమ్మం

మంచి ఫలితాల కోసమే కదా ప్రయత్నమంతా. దోషాలు ఉన్నప్పుడు ఇంటిని మార్చుకోవడం మంచి నిర్ణయమే అవుతుంది. ప్రధానంగా ఊళ్లలోని పాత గృహాలు పిల్లర్స్‌ లేకుండా కట్టినవే అయి ఉంటాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని మార్పులు మొదలుపెట్టాలి. ఒకచోట ద్వారం మూయాల్సివచ్చి, మరోచోట పెట్టాల్సి వస్తే ముందుగా గోడలు కట్టాలి. అడ్డుగోడలు తొలగించేటప్పుడు ముందుగానే మార్కింగ్‌ చేసుకొని సరైన సపోర్ట్‌ ఉంచాలి. అవసరం అనుకుంటే రెండు గోడల మధ్య బీములు వేయడం మంచిది. శాస్త్రప్రకారం ముందుగా ‘నక్ష’ గీసుకొని ఆ ప్రకారంగా మార్పులు చేయండి. సరైన పద్ధతిలో కాంపౌండ్‌ నిర్మించండి. పునర్నిర్మాణానికి ముందే అన్ని రకాలుగా చూపించుకొని, మార్పులు చేసుకోవడం మంచిది.

సుద్దాల సుధాకర్‌ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678

మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా

‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం. రోడ్‌ నం: 10, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌ – 500034.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana