గురువారం 29 అక్టోబర్ 2020
Sunday - Jan , ,

ఈ వారం రాశి ఫలాలు

ఈ వారం రాశి ఫలాలు

ఈ రాశి వారు శుభకార్యాలకు హాజరవుతారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. వస్త్ర, వస్తువులను, ఆభరణాలను కొంటారు. వైద్య, ఇంజినీరింగ్, ఉపాధ్యాయ వృత్తులలో ఉన్నవారికి పనులు కలిసివస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులు చేస్తారు. సాహిత్య, సంగీత, పత్రికా రంగాలలో ఉన్న వారికి సమాజంలో మంచి పేరు వస్తుంది

మేషం :పనులు అనుకూలిస్తాయి. ప్రయాణాలు కలిసివస్తాయి. సంఘంలో సంబంధాలు మెరుగవుతాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు, ఆధ్యాత్మికమైన పనులలో పాల్గొంటారు. నలుగురికి సహాయపడే పనులు చేస్తారు. ఆలోచనలను సమయంలో అమలు చేయడం వల్ల ఫలితాలు పొందుతారు. డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం వంటి వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. మంచి సంస్థలలో చేరుతారు. కోర్టు, రాజకీయ వ్యవహారాల్లో అనుకూల ఫలితాలుంటాయి.

వృషభం

చిన్న చిరు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వస్త్ర, ఫ్యాన్సీ, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, అలంకార వస్తువులు, నిత్యావసర వస్తు వ్యాపారాల్లోని వారికి రావాల్సిన డబ్బు అందుతుంది. లాభదాయకంగా ఉంటుంది. వైద్య, న్యాయవాద వృత్తుల్లోని వారికి అవకాశాలు బాగా వస్తాయి. ఆదాయం ఉంటుంది. ఆభరణాలు, వస్తువులు, ఇంటికి కావలసిన పనిముట్లు కొనుగోలు చేస్తారు. విందులలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతారు. పిల్లల చదువు, వివాహ ప్రయత్నాలలో కొంత అనుకూలత ఉండవచ్చు.మిథునం

ఈ వారంలో ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్, భూమి, వాహనాల క్రయావిక్రయాల వ్యాపారాలు అనుకూలిస్తాయి. తద్వారా ఆదాయం పెరుగుతుంది. సోదరులు, స్నేహితులు, ఆత్మీయులతో అనుబంధాలు ఏర్పడతాయి. అందరితోనూ ఉల్లాసంగా ఉంటారు. పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. పేరు, ప్రతిష్టలు ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పడతాయి. పనులు నెరవేరడానికి ఇది ఉపయోగ పడుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు.

కర్కాటకం

ఈ వారంలో ఈ రాశి న్యాయవాదులకు, రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలుంటాయి. సంతృప్తి, ఆర్థిక లాభం ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నంలోని వారికి ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ, కార్పొరేటు రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి అందరితోనూ మంచిమాట ఏర్పడుతుంది. నలుగురిలో పేరును సంపాదిస్తారు. అధికారుల ఆదరణను పొందుతారు. మంచి పనులను అప్పజెప్పుతారు. సమయ స్ఫూర్తితో పనులు చేయడంతో మంచి ఫలితాలను పొందుతారు. నిత్య వ్యాపారం లాభసాటిగా ఉంటుంది.

సింహం

ఈ వారంలో ఈ రాశి వారికి మంచి సంబంధాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక ప్రసంగాలు, ప్రవచనాలలో పాల్గొంటారు. మంచివారితో చర్చాగోష్టులు ఉంటాయి. పనులు పూర్తవుతాయి. పిల్లల చదువు, ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. పై చదువుల, విదేశీ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడంతో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాజకీయంలో ఉన్న వారికి పై వారితో మంచి అవగాహన సంబంధాలు ఉంటాయి. నిత్య వ్యాపారం అనుకూలిస్తుంది.

కన్య

ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఈ వారం ప్రయోజనకరంగా ఉంటుంది. తాత్కాలికంగా ఉద్యోగాలను పొందుతారు. అయితే పర్మనెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం అవసరం. వ్యవసాయంలో ఉన్న వారికి ఇరుగు పొరుగు వారితో మంచిమాట ఉంటుంది. దిగుబడి అనుకూలంగా ఉంటుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. పనులు నెరవేరుతాయి. స్నేహితులు, ఆత్మీయులతో సంబంధ బాంధవ్యాలు పెంపొందుతాయి. కార్మికులకు, కర్షకులకు ప్రయోజనాలు ఉంటాయి. వైద్య, న్యాయవాద, ఇంజినీరింగ్ వృత్తుల్లో కలిసివస్తుంది.

తుల

ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇంటికి కావాల్సిన సామాగ్రిని, వస్తువులను, ఆభరణాలను కొంటారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు, ప్రసంగాలు వినడంలో శ్రద్ధ కనబరుస్తారు. వినోదాలు, విందులకు వెళతారు. పెద్దవారు, అనుభవజ్ఞుల సహాయ సహకారాలు అందుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించడం పై మనసు నిలుపుతారు. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. పనులు నెరవేరుతాయి. ఆదాయం పెరుగుతుంది. డబ్బు సమయానికి అందుతుంది.

వృశ్చికం

ఈ వారంలో ఈ రాశి వారు శుభకార్యాలకు హాజరవుతారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. వస్త్ర, వస్తువులను, ఆభరణాలను కొంటారు. వైద్య, ఇంజినీరింగ్, ఉపాధ్యాయ వృత్తులలో ఉన్నవారికి పనులు కలిసివస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులు చేస్తారు. సాహిత్య, సంగీత, పత్రికా రంగాలలో ఉన్న వారికి సమాజంలో మంచి పేరు వస్తుంది. చాలా మందితో పరిచయాలు ఏర్పడతాయి. నిత్య వ్యాపారం వృత్తి లాభదాయకంగా ఉంటుంది. పిల్లల చదువు, ఉద్యోగం, వివాహ శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి సంబంధాలు కుదురుతాయి.ధనుస్సు

ఈ వారంలో ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చు. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఖర్చుల నియంత్రణ అవసరం. భార్యా పిల్లల సహాయ సహకారాలు ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యానికి ప్రథమ ప్రాధానాన్యన్ని ఇవ్వాలి. ఇంటికి కావాల్సిన వస్తువులను కొంటారు. గురుభక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నలుగురికి సహాయపడే పనులు చేపడతారు. ప్రవచనాలకు వెళతారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. పనులు ప్రారంభించేటప్పుడు జాగ్రత్త అవసరం.

మకరం

ఈ వారంలో ఈ రాశి వారికి బంధువులు, స్నేహితులతో కొత్త సంబంధాలు ఏర్పడతాయి. వారితో చర్చించడం వల్ల పనులు సానుకూలంగా పూర్తవుతాయి. వాహనాలు కొంటారు. తద్వారా పనులు నెరవేరుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రావాల్సిన డబ్బు వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయదారులు సంతృప్తిగా ఉంటారు. శ్రద్ధతో పనులు చేస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబ సభ్యులందరితోనూ హాయిగా వుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పనులు వాయిదా వేసుకోవడం మంచిది.

కుంభం

విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది. మంచిమార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. మంచి సంస్థలలో పై చదువుల కోసం చేరే అవకాశాలు బాగా ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి ఉద్యోగం లభిస్తుంది. సంతృప్తిగా వుంటారు. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరెట్ ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారులతో మంచి సంబంధాలు, ఆదరణ లభిస్తాయి. ప్రమోషన్‌లను పొందుతారు. పేరు సంపాదిస్తారు. అనుకున్న ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్‌లు. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు.

మీనం

ఈ రాశి వారికి ఈ వారంలో ఆఫీసులో తోటి పనివారితో మంచి మాట ఏర్పడుతుంది. పై అధికారుల వద్ద విశ్వాసాన్ని పెంపొందించుకుంటారు. పేరు సంపాదిస్తారు. కోర్టు, రాజకీయ పనులలో అనుకూలత ఉంటుంది. పనులను మనస్ఫూర్తిగా చేస్తారు. ఇష్టంతో, శ్రద్ధతో చేయడం వల్ల సత్ఫలితాలను పొందుతారు. తద్వారా ఉత్సాహం, ఉల్లాసం చోటు చేసుకుంటాయి. నిత్య వ్యాపారాలు అనుకూలిస్తాయి. ప్రధానంగా న్యాయవాద, వైద్య వృత్తుల్లో ని వారు ప్రధానంగా సంతోషంగా వుంటారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేముందు ఆలోచన, సమయస్ఫూర్తి అవసరం.


logo