‘కస్తూర్బా ఏం చేసిందని ఆవిడ పేరుతో పాఠశాలలు ఇతరేతర సంస్థలు నెలకొల్పడం?’ అని గాంధీ మహాత్ముడి జీవిత సహచరి జీవితం తెలియని వారు వేసే ప్రశ్న. అలాంటివారికి జవాబు ‘కస్తూర్బా గాంధీ – ధీరోదాత్త చరిత్ర’. మహాత్ముడి వ్యక్తిత్వం ముందు ఎవరైనా మరుగుజ్జులే! కానీ కస్తూర్బా తన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు. పైగా పెంచుకుంది. అవసరాన్ని బట్టి గాంధీజీకి ధైర్యం చెప్పింది. దేశం కాని దేశంలో భర్త, కొడుకు జైళ్లలో మగ్గుతుంటే చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా ఆశ్రమ బాధ్యతలు నిర్వహించింది. అదే సమయంలో తన ఆరోగ్యం క్షీణించినా ఆ వార్తను భర్తకు చేరవేయడానికి ఇష్టపడలేదు.
వైద్యంలో భాగంగా మాంసాహారం స్వీకరించాలని డాక్టర్లు ఒత్తిడి చేసినా లొంగలేదు. భర్త- నిర్ణయం ఆమెకే వదిలేసినా రాజీ పడలేదు. ‘మహిళలు జైలుకెళ్లలేరేమో.. వెళ్లినా మధ్యలో తిరిగొచ్చేస్తే సత్యాగ్రహ లక్ష్యానికి, తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం వాటిల్లవచ్చున’ని బాపూ భావించిన తరుణంలో జైలుశిక్షకు సిద్ధపడి ఆత్మాభిమానాన్ని చాటుకుంది. పెద్ద విద్యావంతురాలు కాని సాధారణ గుజరాతీ మహిళ అవసరమైన వేళల్లో ఎంతో తెగువ చూపించింది. మొండితనానికి పెట్టింది పేరు గాంధీజీ. అలాంటి మనిషిని కూడా తన సాహసోపేత నిర్ణయాలతో విచలితుడిని చేసింది కస్తూర్బా. కొన్ని సందర్భాలలో ఆయన కంటే మొండిగా నడుచుకుంది. ఇదంతా భర్తకు మద్దతుగా నిలవడానికి మాత్రమే. ఒకటా రెండా గాంధీజీ జీవితంలో ఎన్నో ఉదంతాలు, ఎన్నెన్నో మలుపులు, మరెన్నో భయానక పరిస్థితులు… ఆయా సందర్భాలన్నిటా కస్తూర్బా భర్త వెనకే ఉంది. ఈ పుస్తకం మొదలుపెడితే పూర్తిగా చదవకుండా వదలలేం. అంత బిగువుగా రాశారు కాటా చంద్రహాస్.
కస్తూర్బా గాంధీ
రచన: కాటా చంద్రహాస్
పేజీలు: 200; వెల: రూ. 160
ప్రతులకు: ఫోన్: 040-24191419
చంద్రప్రతాప్ కంతేటి
బుక్ షెల్ఫ్
అంతరంగపు భాష (కవిత్వం)
రచన: జెల్ది విద్యాధర్ రావు, పేజీలు: 236
వెల: రూ. 200
ప్రచురణ: పాలపిట్ట బుక్స్
ప్రతులకు:
ఫోన్: 94904 69606
అంతర్లీన (కవిత్వం)
రచన: అడ్డగూరి శ్రీలక్ష్మి
పేజీలు: 111
వెల: రూ. 100
ప్రతులకు: పాలపిట్ట బుక్స్
ఫోన్: 88975 83885
వ్యాస పూర్ణిమ
డాక్టర్ సి. నారాయణ రెడ్డి ప్రసంగాలు – వ్యాసాలు
పేజీలు: 168
వెల: రూ. 200
ప్రతులకు: నవోదయ, నవచేతన పబ్లిషింగ్ హౌస్