e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, November 29, 2021
Home News చెమ‌ట వాస‌న‌ను నా భార్య భూత‌ద్దంలో చూస్తుంది.. నా స‌మ‌స్య‌కు ప‌రిష్కార‌మేంటి?

చెమ‌ట వాస‌న‌ను నా భార్య భూత‌ద్దంలో చూస్తుంది.. నా స‌మ‌స్య‌కు ప‌రిష్కార‌మేంటి?

Advice | నాకు ఈమధ్యే పెండ్లయ్యింది. ఉద్యోగరీత్యా బయట ఎక్కువగా తిరుగుతుంటాను. దీంతో చెమట ఎక్కువగా పడుతుంది. నా భార్యకు వ్యక్తిగత పరిశుభ్రతపై పట్టింపు ఎక్కువ. చెమట వాసనను కూడా భూతద్దంలో చూస్తుంది. దీనివల్ల నిత్యం ఏదో ఒక గొడవ జరుగుతుంది. మా సమస్యకు పరిష్కారం చూపండి.

– నవీన్‌, హైదరాబాద్‌.

- Advertisement -

వ్యక్తిగత పరిశుభ్రత గురించి తీవ్రమైన పట్టింపు.. ముఖ్యంగా శరీరం నుంచి వచ్చే దర్వాసనలు, శరీరపు మురికిలాంటివి శృంగార అనుభూతిని దెబ్బతీస్తాయి. అసూయ, అనుమానం, మొండితనం, భావోద్వేగాల్ని పంచుకోలేని ఒంటరితనం..జీవితభాగస్వాముల్లో ఏ ఒక్కరిలో ఉన్నా, సంబంధాన్ని మరింత దిగజారుస్తాయి. మనిషి వ్యక్తిత్వాన్నయితే పునాది నుంచి మార్చలేం. కానీ, ప్రవర్తనను మార్చవచ్చు. దంపతీ చికిత్సలో దంపతుల మధ్య సంబంధ బాంధవ్యాలను మెరుగు పరచడం ద్వారా సమస్యలను పరిష్కరించవచ్చు.

మా అమ్మాయి వయసు 26. ఇటీవలే పెండ్ల‌యింది. తనకు సన్నగా ఉండాలన్న కోరిక ఎక్కువ. దీంతో అన్నమే తినకుండా డైటింగ్‌ చేసేది. ఇప్పుడు పూర్తి నీరసంగా తయారై, ఒక ముద్ద ఎక్కువ తిన్నా వాంతులు చేసుకుంటున్నది. భర్తతోనూ దాంపత్య సమస్యలు వస్తున్నాయి. అమ్మాయి ప్రవర్తనతో అల్లుడు కూడా విసుక్కుంటున్నాడు. పరిష్కారం చెప్పండి.

– దేవిక, హిమాయత్‌ నగర్‌, హైదరాబాద్‌.

ఆకలి పూర్తిగా మందగించే మానసిక స్థితిని ‘అనొరెక్సియా నర్వోసా’ అంటారు. డిప్రెషన్‌ అనేది తీవ్రస్థాయిలో ఉన్నవారిలో ఈ మానసిక స్థితి ఎక్కువగా ఉంటుంది. అందంగా కనిపించాలనే తాపత్రయం, త్వరగా లావు తగ్గాలన్న ఆందోళన ఉన్న స్త్రీలలోనూ ఈ సమస్య ఉంటుంది. అందంగా లేమన్న తీవ్ర అసంతృప్తితో రగిలిపోయేవారిలో కూడా ‘అనొరెక్సియా నర్వోసా’ కనిపిస్తుంది. ఇది శరీర సహజ ప్రతిస్పందనలైన ఆకలి, దాహం, శృంగార భావనలాంటి వాటిని నియంత్రిస్తుంది. దీనివల్ల కూడా వీరిలో సహజ శృంగార వాంఛలు కలగవు. ఫలితంగా వివాహమైన తర్వాత తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. ఇలాంటి వారికి మానసిక చికిత్సతోపాటు సెక్స్‌ థెరపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వివిధ పరీక్షల ద్వారా రోగి మనోస్థితిని అంచనా వేయడం సాధ్యమే.

– డా. భారతి (ఎమ్మెస్‌)
మారిటల్‌ కౌన్సిలర్‌, సైకోథెరపిస్ట్‌,
జయా హాస్పిటల్‌ ,బీ.ఎన్‌. రెడ్డి నగర్‌ క్రాస్‌రోడ్‌, హైదరాబాద్‌
bharathid506@gmail.com, 7989227504

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

ఆ టైంలో నా భ‌ర్త‌ వేరే అమ్మాయిల పేర్లు పిలుస్తుంటాడు? న‌న్నేం చేయ‌మంటారు?

ప‌క్కింటి ఆంటీపై ఇష్టం పెరిగిపోతుంది.. మరిచిపోలేకపోతున్నా..

బైపాస్‌ సర్జరీ తర్వాత ఎన్ని రోజులకు శృంగారంలో పాల్గొనవచ్చు ?

ఆయనకు ఆ కోరిక ఎక్కువ.. నేనేం చేయాలి?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement