e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, January 16, 2022
Home News మా ఆయ‌న‌కు ఆ స‌మ‌స్య ఉంది.. డాక్ట‌ర్‌ను క‌లుద్దామంటే విన‌ట్లేదు.. ఏం చేయమంటారు?

మా ఆయ‌న‌కు ఆ స‌మ‌స్య ఉంది.. డాక్ట‌ర్‌ను క‌లుద్దామంటే విన‌ట్లేదు.. ఏం చేయమంటారు?

మేడమ్‌! నా వయసు 35. వివాహమై 13 ఏండ్లు అవుతున్నది. మా ఆయనకు నేనంటే చాలా ప్రేమ. అయితే, మొదట్నుంచీ శీఘ్రస్ఖలన సమస్య ఉన్నది. మొదట్లో ఫర్వాలేదనిపించినా, మెల్లగా ఆ సమస్య ఎక్కువైంది. క్షణాల్లోనే స్ఖలనం అవుతున్నది. దీంతో ఆయన చాలా ఇబ్బంది పడుతున్నారు. మా సమస్య సెక్స్‌ కాదు. నాకు ఆయనే ముఖ్యం. కానీ, మా వారు మాత్రం రెండేండ్లుగా నాతో సరిగ్గా ఉండటం లేదు. కనీసం మాట్లాడరు కూడా. ఇప్పుడు అనుమానం కూడా పెంచుకొన్నారు. ఈ సమస్యలతో ఉద్యోగాన్ని కూడా సరిగ్గా చేయడం లేదు. డాక్టర్‌ను కలుద్దామన్నా వినరు. డాక్టర్‌ దగ్గరికి వెళ్లి చికిత్స తీసుకోవడం నా కోసం కూడా కాదు..కేవలం ఆయన బాధ తగ్గడానికే. కానీ, ఎంత చెప్పినా హాస్పిటల్‌కు రారు. ఏం చేయమంటారు?

ఎన్‌ఎంఆర్‌, హైదరాబాద్‌

Premature ejaculation | శీఘ్రస్ఖలన సమస్య
- Advertisement -

మీవారికున్న సమస్య వల్ల ఇద్దరూ బాధపడుతున్నారు. భర్తకు సెక్స్‌ సమస్య ఉంటే భార్య అర్థం చేసుకోదని భర్తలు ఎందుకు అనుకుంటారు? ఇది ఇద్దరికీ సమస్యే కదా. శీఘ్రస్ఖలన సమస్య జలుబు లాంటిది. ప్రపంచంలో కోటానుకోట్ల మంది పురుషులకు ఉంది. ఇది చికిత్సకు తగ్గని సమస్య ఏ మాత్రమూ కాదు. శీఘ్రంగా.. అంటే త్వరగా అయ్యే స్ఖలనాన్ని ఆపి, అంగస్తంభన కాలాన్ని పెంచే అద్భుతమైన టెక్నిక్స్‌ సెక్స్‌ థెరపీలో ఉన్నాయి. వీటిని సాధన చేస్తే మీవారి సమస్య ఇట్టే పరిష్కారమవుతుంది. ఇందులో కొన్ని భర్త విడిగా, మరికొన్ని భార్య సహకారంతో చేయాలి. పర్ఫార్మెన్స్‌ యాంగ్జయిటీ వల్ల శీఘ్రస్ఖలనం వస్తుంది. సమస్య తగ్గకపోతే ఆందోళన ఇంకా ఎక్కువ అవుతుంది. దీనికి సైకోథెరపీ ఉంది. విపరీతమైన ఆందోళన, భయం, అజ్ఞానం, భాగస్వామి తిరస్కారంలాంటి మానసిక కారణాలు కూడా శీఘ్రస్ఖలనానికి దారితీస్తాయి. ఇక, శారీరక కారణాల విషయానికి వస్తే.. సెక్స్‌ కండరాలు బలహీనంగా ఉండటం, తరచూ వచ్చే మూత్రనాళపు ఇన్ఫెక్షన్స్‌, ప్రొస్టేట్‌ గ్రంథి ఇన్‌ఫెక్షన్స్‌, డయాబెటిస్‌, బీపీ వంటివీ కారణమే. ఏదేమైనా మిమ్మల్ని ఆనంద పరచలేకపోతున్నానన్న బాధలోంచి వచ్చిన కోపం, చికాకు, ఆత్మన్యూనత.. మిమ్మల్ని అనుమానించే స్థాయికి తీసుకెళ్లాయి. సెక్స్‌ కంటే ఆయన ప్రేమే మీకు ముఖ్యమని భరోసా ఇవ్వండి. శీఘ్రస్ఖలనం అవమానకరమైన, సిగ్గుతో భయపడాల్సిన విషయం కాదు. మీ వారిని సెక్సాలజిస్ట్‌ వద్దకు తీసుకెళ్లండి. ఇద్దరికీ కౌన్సెలింగ్‌, సెక్స్‌ సైకోథెరపీ చాలా అవసరం. రెండు రోజుల
చికిత్సతో తగ్గిపోయే దానికి, ఇద్దరి జీవితాన్ని నరకం చేసుకోకండి.

డా. భారతి (ఎమ్మెస్‌), మారిటల్‌ కౌన్సిలర్‌, సైకోథెరపిస్ట్‌,
జయా హాస్పిటల్‌, బీ.ఎన్‌. రెడ్డి నగర్‌ క్రాస్‌రోడ్‌, హైదరాబాద్‌
bharathid506@gmail.com, 7989227504

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

ఆ టైంలో నా భ‌ర్త‌ వేరే అమ్మాయిల పేర్లు పిలుస్తుంటాడు? న‌న్నేం చేయ‌మంటారు?

ప‌క్కింటి ఆంటీపై ఇష్టం పెరిగిపోతుంది.. మరిచిపోలేకపోతున్నా..

బైపాస్‌ సర్జరీ తర్వాత ఎన్ని రోజులకు శృంగారంలో పాల్గొనవచ్చు ?

ఆయనకు ఆ కోరిక ఎక్కువ.. నేనేం చేయాలి?

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement