1 పుంటికూర = గోంగూర / పుల్లటి కూర (యాట కూరల పుంటికూర వేసి వండితే ఉంటది నా సామిరంగా..!!)
2 ఒత్తుకొచ్చుడు = ఒత్తిడి అనివార్యం (ఒంటిరెక్కపానం ఇంట్ల సమస్యలన్నీ ఒత్తుకొచ్చినయ్.. తట్టుకోలేక బిడ్డ ఉసురు తీసుకుంది)
3 కచ్చెపెక్క ఉడుకుడు = అన్నం సరిగా ఉడక్క పోవడం (సర్వలో ఎసరు సరిగా పొయ్యకపోతివి.. బువ్వ కచ్చెపెక్క ఉడికె.. ఏం సుఖం? ఎట్ల తినేది?)
4 అక్కల్ల తిరగడం = చాలాచోట్ల తిరగడం (నేను ఒక్కణ్నే ఎన్ని అక్కల్లని తిరగాలె.. నాలుగు అక్కల్ల తిరగేసరికి యాష్టకొచ్చింది.. దూపై సిరిసెమటలు పట్టినయ్!)
5 కమిరిచ్చుడు = కాల్చడం/ బూరు/ ఈకలు పీకిన కోడిని మంటపై కమిరిచ్చుడు (కమిరిచ్చింది చాల్లేగాని.. కోసి కుప్పలేస్తే.. నా భాగం తీసుకెళ్త)