శుక్రవారం 23 అక్టోబర్ 2020
Sunday - Jan , ,

రాశి ఫలాలు.. 12-01-2020 నుంచి 18-01-2020 వరకు

రాశి ఫలాలు.. 12-01-2020 నుంచి 18-01-2020 వరకు

మేషం : ఈ వారంలో ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో సంతోషంగా వుంటారు. వస్త్ర, వస్తువులను కొంటారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీసులో అందరితోనూ సమన్వయంతో ఉంటారు. అధికారుల ఆదరణ ఉంటుంది. రాజకీయాల్లో కలిసి వస్తుంది. చదువు, వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి.మంచి సంబంధాలు మెరుగు పడతాయి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. మంచి ఆలోచనలతో, ఆనందంతో, ఉత్సాహంతో పనులు చేస్తారు. ప్రయాణాలు కలిసివస్తాయి. దేవతా, గురుభక్తి చాలా ఉపయోగపడుతుంది.

వృషభం : వ్యాపారస్తులకు క్రయవిక్రయాలు సంతృప్తిగా ఉంటాయి. లాభం చేకూరుతుంది. నిత్యావసర వస్తు వ్యాపారం, న్యాయవాద, వైద్యవృత్తుల్లోని వారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబసభ్యులతో సంతోషంగా ఉంటారు. సభలకు, సమావేశాలకు హాజరవుతారు. ఇంటికి కావాల్సిన వస్తువులను అలంకార వస్తువులను కొంటారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి తాత్కాలిక ప్రయోజనాలు ఉంటాయి. మంచి ఉద్యోగం కోసం శ్రమ అవసరం. పెద్దవారి సహాయ సహకారాలను విస్మరించడం మూలంగా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు.

మిథునం : ఈ వారంలో ఈ రాశి వారు కొత్త వస్తువులను కొనే ప్రయత్నం చేస్తారు. అన్నదమ్ములు, బంధువులతో సంబంధాలు పెంపొందుతాయి. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. పిల్లల చదువు, శుభకార్యాల విషయంలో కలిసివస్తుంది. శుభకార్యాలు చేస్తారు. సంఘంలో మంచివారితో సంబంధాలు పెరుగుతాయి. దేవతా, గురుభక్తి వృద్ధి పొందుతుంది. సభలకు, సమావేశాలకు, ప్రవచనాలకు హాజరవుతారు. నలుగురికి ఉపయోగపడే పనులతో పాటు, నిత్య వ్యాపారం అనుకూలిస్తుంది.


కర్కాటకం : ఈ రాశి వారికి ఈ వారంలో సమయానికి పెద్దలు, అనుభవజ్ఞులు, తల్లిదండ్రుల సూచనలు, సలహాలు అందుతాయి. కుటుంబసభ్యులతో సంతృప్తిగా వుంటారు. సద్గోష్టి, ప్రవచనాలకు, దేవాలయాలకు వెళతారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. రావాల్సిన డబ్బు వస్తుంది. ఆదాయ పరిస్థితి మెరుగవుతుంది. పనివారితో ఇబ్బందులు దూరమవుతాయి. పనులు నెరవేరుతాయి. అనవసర ఆలోచనలకు ప్రాధానం ఇవ్వడం వల్ల కొంత కాలయాపన జరుగుతుంది. నిర్మాణ రంగంలో ఉన్న వారు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించకుండా ఉండడం మంచిది.


సింహం : క్రయవిక్రయాల్లో సంతృప్తి ఉంటుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. నిత్యావసర వస్తు వ్యాపారం, వడ్డీ, షేర్, వ్యాపారాలు అనుకూలిస్తాయి. లాభాలను పొందుతారు. చదువు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి సంబంధాలు పెంపొందుతాయి. భక్తి భావనలు పెరుగుతాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలు చేయాలనే తలంపు కార్యరూపం దాలుస్తుంది. పనివారితో సమస్యలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.


కన్య : ఈ వారం ఈ రాశి గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఖర్చులను నియంత్రించుకోవాలి. అనవసరమైన మాటలు మాట్లాడకుండా పనిపై శ్రద్ధ నిలపాలి. అన్నదమ్ములు, బంధువులతో కొంత సఖ్యత ఉంటుంది. వారి సలహాలు, సూచనల మేరకు కొన్ని పనులు నెరవేరుతాయి. వాహనాల వల్ల పనులు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ పనులు అనుకున్న సమయంలో పూర్తి కాకపోవచ్చు. నిత్య వ్యాపార పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం.


తుల : ఈ రాశి వారికి ఈ వారంలో రావాల్సిన డబ్బు వస్తుంది. ఆదాయ పరిస్థితి నయమవుతుంది. పనివారితో సమస్యలు తీరుతాయి. ఆరోగ్యం నయమవుతుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. పెద్దల అండదండలు, సూచనలు సమయానికి అందుతాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. న్యాయపరమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా వుంటాయి. నిత్యావసర వస్తు వ్యాపారం, హోటలు, క్యాటరింగు, వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలు సంతృప్తిగా సాగుతాయి.


వృశ్చికం : ఈ వారంలో ఈ రాశి వారికి పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. చదువు విషయంలో కలిసి వస్తుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలలో మంచి స్థాయిలో నిలుస్తారు. నలుగురిలో పేరును సంపాదిస్తారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. రాజకీయంలో ఉన్న వారికి పై వారితో మంచి సంబంధాలు పెంపొందుతాయి. ఇంటా, బయటా అన్ని రకాలుగా అనుకూలత ఏర్పడుతుంది. వస్తువులు కొంటారు. సంగీత, సాహిత్య సినిమా రంగాల్లోని వారికి కొత్త అవకాశాలు వస్తాయి. పేరు సాధిస్తారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు.


ధనస్సు : ఈ వారంలో ఈ రాశి వారికి ముఖ్యమైన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులను కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. కొన్ని విషయాల్లో తాత్కాలిక ప్రయోజనాలుంటాయి. నిత్య వ్యాపారం, క్రయ విక్రయాల్లో అనుకూలత, కుటుంబసభ్యులతో సౌఖ్యం, అనుకూలతతో కొన్ని పనులు సునాయాసంగా ముందుకు సాగుతాయి. న్యాయవాద, వైద్య వృత్తుల్లోని వారికి సంతృప్తికరంగా ఉంటుంది. హోటలు, క్యాటరింగు, నిత్యావసర వస్తు వ్యాపారాల్లో తాత్కాలిక ప్రయోజనాలు ఉంటాయి.


మకరం : ఈ వారంలో ఈ రాశి వారికి అన్నదమ్ములు, స్నేహితులు, ఆత్మీయులతో కొన్ని పనులు నెరవేరుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. తద్వారా పనులు నెరవేరుతాయి. వ్యవసాయ దారులకు ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు. నిర్మాణ రంగంలోని వారికి తాత్కాలికంగా కలిసి వస్తుంది. అయితే పెద్ద పెట్టుబడులకు దీర్ఘకాలిక పనులను కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబసభ్యులతో సంతోషంగా ఉంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. నిత్య వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్త.


కుంభం : కుటుంబసభ్యులతో సంతోషంగా ఉంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. కొత్త వస్త్ర, వస్తువులను, నగలను కొనుగోలు చేస్తారు. సరదాగా గడుపుతారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. పిల్లల చదువు, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పేరు సంపాదిస్తారు. మంచి సంబంధాలు పెంపొందుతాయి. రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. కొత్త పనులను ప్రారంభిస్తారు. ముఖ్యంగా శుభకార్యాలు, నూతన గృహ నిర్మాణ పనులు చేపడతారు. పెద్దల ఆదరణ లభిస్తుంది.


మీనం : ఈ రాశి వారికి ఈ వారంలో రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి తాత్కాలిక ప్రయోజనాలుంటాయి. రాజకీయంలో ఉన్న వారికి కార్యకర్తలు, పైవారి ఆదరణ లభిస్తుంది. నిత్య వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. న్యాయవాద, ఉపాధ్యాయ వృత్తుల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. సంతృప్తిగా వుంటారు. హోటలు, క్యాటరింగ్, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్న వారికి ఈ వారం ప్రధానంగా కలిసి వస్తుంది. సభలు, సమావేశాలకు హాజరవుతారు.


logo