e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home Top Slides గాంధారి మైసమ్మ | మేడారం జాత‌రలాగే రెండేండ్ల‌కొక‌సారి జ‌రిగే ఆదివాసీల జాత‌ర గురించి తెలుసా

గాంధారి మైసమ్మ | మేడారం జాత‌రలాగే రెండేండ్ల‌కొక‌సారి జ‌రిగే ఆదివాసీల జాత‌ర గురించి తెలుసా

‘గాంధారి ఖిల్లా’.. విభిన్న సంస్కృతుల నిలయం. అబ్బురపరిచే శిల్ప సంపదకు, చారిత్రక విశేషాలకు కేంద్రం. గోండులు, మన్నెలు, మెకాసి, నాయక్‌ పోడ్‌లు, కోయ గిరిజనుల ఆరాధ్య దైవం ‘ గాంధారి మైసమ్మ ’ కొలువైన క్షేత్రం. ప్రతి రెండేండ్లకు ఒకసారి ఇక్కడ జరిగే జాతర.. ఆదివాసీల ఐక్యతకు నిదర్శనం.

మంచిర్యాల జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో ఉంది.. ‘గాంధారి ఖిల్లా’. వెయ్యేండ్లకు పూర్వమే ఈ కోట నిర్మితమైంది.‘గాంధారి’ కోట కేంద్రంగా గోండు రాజులు పాలించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నది. అయితే, రాష్ట్రకూటులు మొదలు కాకతీయుల వరకూ వివిధ పాలకులు వేయించిన శాసనాలు, చెక్కించిన శిల్పాలు అక్కడ దర్శనమిస్తున్నాయి. కొండల వరుసను శత్రుదుర్భేద్యంగా మార్చి, బలమైన కోటగా తీర్చిదిద్దారు. పలు రాతి కొండలను తొలిచి, మెట్లు మలిచారు. అవి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. గుర్రాలు, ఏనుగులు వెళ్లడానికి ఓ ప్రత్యేక మార్గం ఉండటం విశేషం. గిరిజనుల ఇలవేల్పు ‘గాంధారి మైసమ్మ’ కూడా ఇక్కడ కొలువై ఉన్నది. అమ్మవారితోపాటు భైరవుడు, శివుడు, వేంకటేశ్వరుడు, ఆంజనేయుడి విగ్రహాలూ దర్శనమిస్తాయి.

సాంస్కృతిక వైభోగం

- Advertisement -

‘గాంధారి జాతర’ను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. ఆ సందర్భంగా మూడు రోజులు జరిగే ఆదివాసీ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకొంటాయి. సంప్రదాయ నృత్యాలు అబ్బుర పరుస్తాయి. గిరిజన ‘దర్బార్‌’ చూసి తీరాల్సిందే! స్థానిక మెకాషీలు ఏటా దసరా, పుష్య వైశాఖ మాసాల్లో మైసమ్మ దేవతను పూజిస్తారు. గాంధారి కోటను పర్యాటక ప్రదేశంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇప్పటికే కోట సమీపంలోని అటవీ ప్రాంతాన్ని గాంధారి వనంగా తీర్చిదిద్దింది. జింకల పార్కు, హెర్బల్‌ గార్డెన్‌, నవగ్రహ వనం, రాశివనం, పిల్లల పార్కు ఏర్పాటు చేసింది. జరగాల్సింది ఇంకా ఉంది.

మైసమ్మ జాతర

  • రెండేండ్లకోసారి కార్తీకమాసంలో మూడు రోజులపాటు ‘గాంధారి మైసమ్మ జాతర’ను వైభవంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలో ‘కోవ మెకాశీలు’ పూజారులుగా వ్యవహరిస్తారు. స్థానిక కోయలు, మన్నెలు, మెకాసి, నాయక్‌ పోడ్‌లు, గోండులతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల నుంచీ గిరిజనులు హాజరవుతారు. అమ్మవారికి పూజలు చేసి, మొక్కులు చెల్లించుకొంటారు.
  • జాతరలో భాగంగా మొదటి రోజు దేవతామూర్తులను కోట ప్రవేశ ద్వారం సమీపంలోని చెరువులో స్నానానికి తీసుకెళ్తారు. అదేరోజు రాత్రి ఖిల్లా సమీపంలోని భైరవుడి విగ్రహం వద్ద జాతర నిర్వహిస్తారు. వర్షాలు కురవాలంటూ భీమన్న దేవుడికి (భైరవుడికి) నైవేద్యం పెడతారు.
  • రెండో రోజు, మరోసారి భైరవుడికి నైవేద్యం సమర్పించి, మైసమ్మ కొలువైన ప్రదేశానికి చేరుకొంటారు. డప్పు చప్పుళ్లతో, సంప్రదాయ వాద్యాలతో, కొమ్ము బూరలను ఊదుతూ సంబురాలు చేస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే ‘మైసమ్మ పటం కొలువు’.. జాతరలో అత్యంత కీలక ఘట్టం. అర్ధరాత్రి దాటాక.. పూజారి, జట్టీలు కోటలోని ప్రధాన దర్వాజా ఎడమ పట్టీకి చెక్కి ఉన్న విగ్రహం ముందు మైసమ్మ ఆకారంలో మూడు ముగ్గులు, పసుపు కుంకుమలతో ‘పటం’ గీస్తారు. గాజులు, గంధం, నిమ్మకాయలతో అలంకరించి పూజిస్తారు. ఆ తర్వాత మహిషాన్ని బలిస్తారు. మట్టితో చేసిన గుర్రాలు, ఏనుగు బొమ్మలను మొక్కులుగా చెల్లిస్తారు. కల్లు, ఇప్ప
  • సారాతో మైసమ్మకు ఆరగింపు చేస్తారు. పంటలో కొంత దిగుబడిని అమ్మవారి పాదాల వద్ద కానుకగా సమర్పిస్తారు.
  • మూడోరోజు తెల్లవారుజాము నుంచి సాధారణ భక్తులు మైసమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొంటారు. కోళ్లూ మేకలను బలిచ్చి, అమ్మవారికి ఆరగింపు చేస్తారు. అనంతరం కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి వన భోజనాలు, విందులు చేసుకొంటారు. కోట సమీపంలో పారే పాల వాగులోని పవిత్ర జలాన్ని ఇండ్లకు తీసుకెళ్తారు. ఈ నీళ్లను పొలాల్లో చల్లుకొంటే, మంచి దిగుబడి వస్తుందని విశ్వసిస్తారు.

-అరవింద్‌ ఆర్య ,7997 270 270

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి :

Pregnancy Tips | ఏ సమయంలో కలిస్తే పిల్లలు పుడతారు?

bullettu bandi | బుల్లెట్టు బండి పాట పాడింది మోహ‌న‌.. మ‌రి రాసింది ఎవ‌రో తెలుసా?

శ్రీదేవి సోడా సెంటర్‌ ఆనందికి పెళ్లయిందా?

చేతులను ఎందుకు 20 సెకన్లు శుభ్రంచేసుకోవాలి?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana