e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home బతుకమ్మ మన చుట్టూ.. రాజు రాణి

మన చుట్టూ.. రాజు రాణి

మన చుట్టూ.. రాజు రాణి

హాయ్‌ బుడుగులూ! 

మన చుట్టూ  ఎంతోమంది రాజులు, రాణులు ఉంటారు తెలుసా? మీరెప్పుడూ వాళ్లను కలుస్తూ ఉంటారు. ఇష్టపడతారు కూడా? ఆశ్చర్యంగా ఉందా? వారెవరో తెలుసుకోవాలనుందా? అయితే చదివేయండి మరి.

కూరగాయల్లో రాజు

పిల్లలూ.. నా గురించి కొత్తగా మీకు పరిచయం చేయాల్సిన పన్లేదు కదా! నన్ను రోజూ చూస్తుంటారు.  ప్రపంచ వ్యాప్తంగా నేను చాలా ఫేమస్‌. అందుకే నన్ను కూరగాయల్లో ‘రాజు’ అంటారు.  తెలుగు ప్రాంతంలో  నన్ను ఎక్కువగా పండిస్తారు. నేను రకరకాలుగా కనిపిస్తాను. చిన్నగా, పొడుగ్గా, తెల్లగా, ఎర్రగా ఉంటాను. నేను పుట్టింది భారతదేశంలోనే అని చాలామంది అంటారు. నాలో విటమిన్లు, ఖనిజాలు, కీలకమైన ఫైటో పోషకాలు ఉంటాయి.  నా పొట్టులో ఉండే తెల్లటి గుజ్జును ‘న్యాసునిన్‌’ అంటారు. 

హాయ్‌ పిల్లలూ! నేను మామిడి పండును.

మన చుట్టూ.. రాజు రాణి

ఎండాకాలం వచ్చిందంటే నాతో మీకు పండగే పండగ.   పండ్లన్నిటిలో  రాజును నేను. నేను రాజును ఎందుకు అయ్యానో చెప్పే జానపద కథలు అనేకం ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఇష్టపడి, ఎక్కువ పండిచే పండును నేనే. అందుకే నన్ను ‘కింగ్‌ ఆఫ్‌ ఫ్రూట్స్‌’ అంటారు. నేను కేవలం దక్షిణాసియాకే చెందిన ఒక మధురఫలాన్ని. ఇండియా, చైనా, థాయ్‌లాండ్‌, ఇండోనేషియాలలో విస్తారంగా పండిస్తారు.  దేశదేశాలకు ఎగుమతి అవుతూ ఆదరణ పొందాను. భారత్‌లో 16 లక్షల హెక్టారలో, చైనాలో  4 లక్షల హెక్టార్లలో సాగు చేస్తారు. నాలో కెరోటిన్‌, విటమిన్‌ సీ, కాల్షియం ఎక్కువగా లభిస్తాయి. ఫిలిప్పైన్స్‌లో ప్రిమ్స్‌ అనే చేపల గుజ్జుతో చేర్చి తింటారు. థాయ్‌లాండ్‌లో భోజనం తర్వాత తినడం అలవాటు. 

హాయ్‌ పిల్లలూ! నేను బెండకాయను.

మన చుట్టూ.. రాజు రాణి

వంకాయ, మామిడి కాయలాగే నాకూ ఎంతో ఖ్యాతి ఉంది. నేను కూరగాయల్లో రాణిని. వినడానికి ఆశ్చర్యంగా ఉందా? అవును మీరు ఎప్పుడూ ఇష్టపడే కూరల్లో నేను కనిపిస్తూ ఉంటాను కదా! నేను పుట్టింది అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతాల్లో.  నన్ను ఫ్రెంచ్‌లో ఓక్రా అని, ఇంగ్లిష్‌లో లేడీస్‌ ఫింగర్‌ అనీ అంటారు. నాలో ఎ, బి, సి – విటమిన్లు, పోషక పదార్థాలు, అయోడిన్‌ ఎక్కువగా ఉంటాయి. నన్ను ఎండబెట్టి వరుగులను తయారుచేస్తారు. నా కాండాన్ని కాగితపు పరిశ్రమలో ఉపయోగిస్తారు. నాకు గల్ఫ్‌ దేశాల్లో మంచి గిరాకీ ఉంది. గుజరాత్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, హర్యానా, పంజాబ్‌లలో నన్ను ఎక్కువ పండిస్తారు. నా పచ్చడికి తిరుగులేదు. నన్ను నేరుగా కూడా తినేయవచ్చు.

Advertisement
మన చుట్టూ.. రాజు రాణి
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement