e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home News ganesh chaturthi | ఈ న‌వ‌రాత్రుల‌ను ఇలా ఎకో ఫ్రెండ్లీగా జ‌రుపుకోండి..

ganesh chaturthi | ఈ న‌వ‌రాత్రుల‌ను ఇలా ఎకో ఫ్రెండ్లీగా జ‌రుపుకోండి..

పండుగ రోజు ఉదయం లేవగానే పొలానికెళ్లి బంకమట్టి తీసుకొస్తాం.ఆ మట్టి వినాయకుడిగా రూపుదిద్దుకుంటుంది. కండ్లకు గురివింద గింజలు పెడతాం. పళ్లు, బొట్టు సున్నంతో రాస్తాం.
చిన్న కర్రపుల్ల తీసుకొని చేతులు, తొండం, కాళ్ల ఆకృతిని గీసి అచ్చు వినాయకుడి రూపం తీసుకొస్తాం. ఆ తర్వాతే పూజా కార్యక్రమం. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు మార్కెట్లో
దొరికే రసాయనవిగ్రహాలను కొనుగోలు చేసి పూజ మొదలు పెడుతున్నారు. వీటిని నిమజ్జనం చేయడం వల్ల పర్యావరణానికి భారీగా నష్టం వాటిల్లుతున్నది. పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా
గణేశుడిని తయారు చేయడం అన్ని విధాలా మంచిది.

బంకమట్టి గణేశుడు

బంకమట్టితో చేసిన వినాయకుడిని చూస్తే కలిగే అనుభూతి మార్కెట్లో దొరికే ఏ విగ్రహాన్ని చూసినా రాదు. మట్టి విగ్రహం కచ్చితంగా ఈ ఏడాది వేడుకలకు సంప్రదాయ ఆకర్షణను తెస్తుంది. ఈ విగ్రహానికి తొమ్మిది రోజుల పాటు పూజలు చేయాలి. బాగా అలంకరించిన ప్రదేశంలో గణేశుడిని పెడితే అందంగా ఉంటుంది. అలాగే పండుగ ముగిసిన తర్వాత మట్టి విగ్రహాన్ని చిన్న బకెట్‌లో ముంచితే మట్టంతా కరిగిపోతుంది. దీంతో పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు.

విత్తన గణపతి

- Advertisement -

పేరు వినగానే ఆశ్చర్యపోకండి. నిజమే. ఈ విగ్రహాలు కరిగితే చాలు, మొక్కలుగా మారుతాయి. పలు పర్యావరణ సంస్థలు తులసి తదితర విత్తనాలతో గణేశుడి విగ్రహాలు తయారు చేస్తున్నాయి. వేడుకలు పూర్తయిన వెంటనే విగ్రహాన్ని నదులలో ముంచడం కంటే భూమిలో నాటడం వల్ల ఏడాది పొడవునా గణేశుడి ఆశీర్వాదం పొందినవాళ్లం అవుతాం. తోటలో నాటి కొద్దిగా నీళ్లు పోస్తే.. విగ్రహం కాస్తా కరిగి.. రెండు రోజుల తర్వాత మొక్కలు మొలకెత్తుతాయి.

మొక్కల కోసం..

కొన్ని స్వచ్ఛంద, పర్యావరణ సంస్థలు ఆవుపేడతో విగ్రహాలు తయారుచేస్తున్నాయి. ఈ రకం విగ్రహాలను పండుగ తర్వాత గార్డెన్‌లో పెడితే సరిపోతుంది. వర్షానికి ఎరువుగా మారి మొక్కల పెరుగుదలకు దోహదం చేస్తాయి. ఏవైనా కారణాలతో విగ్రహాలను పూజించే అవకాశం లేకపోతే.. వినాయక చవితి రోజున ఇంటికి దగ్గర్లో ఉన్న గుడికి వెళ్లి అర్చించినా సరిపోతుంది. కాదూ, మనమే పూజ చేయాలని అనుకుంటే.. ఇంట్లో వినాయకుడి విగ్రహం లేదా ఫొటోఉంటే దానికి పందిరి వేసి పండ్లు, తోరణాలతో వేడుకను ఘనంగా చేసుకోవచ్చు. వేడుక ముగిశాక మళ్లీ విగ్రహాన్ని యథాస్థానానికి మార్చవచ్చు. ఇలా చేయడం వల్ల ఖర్చు తగ్గుతుంది. మన ఇంట్లోని వినాయకుడికే పూజ చేసినట్లూ ఉంటుంది.

గుర్తుగా పెట్టుకోవచ్చు..

గణేశుని విగ్రహాలను పర్యావరణానికి హానిచేయని బంకమట్టితోనే కాదు.. పేపర్లు, అట్టముక్కలు, గాజుతోనూ రూపొందించవచ్చు. వీటిని నీటిలో నిమజ్జనం చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. అందమైన మూర్తిని ఇంట్లోని షెల్ఫ్‌లో పెట్టుకోవడానికి ఇదొక మంచి మార్గం. కాకపోతే, సంప్రదాయం ప్రకారం ఇవి పూజకు పనికిరావు. అలంకరణకు మాత్రం అద్భుతంగా సరిపోతాయి. అతిథులను ఇట్టే ఆకర్షిస్తాయి కూడా.

వేడుక అనంతరం..

  • ఏ పండుగకూ లేని విధంగా వినాయక చవితికి విద్యుత్‌ దీపాలు అలంకరిస్తారు.
  • అలంకణలో ప్లాస్టిక్‌ను నివారించాలి. పర్యావరణానికి హాని కలగని విధంగా చూసుకోవాలి.
  • వినాయకుడి పూజకు ఉపయోగించిన పూలను నీటిలో పడేయకుండా వాటితో లిప్‌బామ్‌ వంటివి చేసుకోవచ్చు.
  • గణేశుడికి వేసిన పందిరి కర్రలను గార్డెన్‌లోని మొక్కలకు సపోర్ట్‌గా పెట్టుకోవచ్చు.
  • కుండీలలో కొత్త మొక్కలునాటి వాటిని విగ్రహానికి అలంకరణగా పక్కన పెడితే, పచ్చని తోరణంలా ఉంటుంది.
  • పూజలో నివేదించిన పండ్లను పక్షులకు ఆహారంగా పెట్టవచ్చు. పాడైపోయి ఉంటే, మొక్కలకు కంపోస్ట్‌గా చేయవచ్చు.
  • అలంకరణ కోసం చాలామంది థర్మోకోల్‌ వాడుతుంటారు. దీనివల్ల పర్యావరణానికి ఎంతో హాని ఈ వేడుకను పర్యావరణ హితంగా మార్చడానికి నేతితోనే దీపాలు వెలిగించండి.
  • విగ్రహ పరిమాణం కంటే, భక్తి ముఖ్యమని గుర్తించాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

వినాయ‌క చ‌వితి రోజు మాత్రమే గణపతికి తులసిదళం ఎందుకు సమర్పించాలి?

Ganesh Chaturthi 2021 : గణపతి పూజ ఎలా చేయాలి? కావాల్సిన సామగ్రి ఏంటంటే..

అరుదైన రూపాల్లో వినాయ‌కుడు క‌నిపించే ఆల‌యాలు ఎక్క‌డెక్క‌డ ఉన్నాయి? వాటి విశిష్టతేంటి?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana