e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home బతుకమ్మ కనిపించని గాథలు

కనిపించని గాథలు

‘నోముల’ ఫలం
ఒక దార్శనికుడితో పరిచయం జీవితాన్ని ఊహించని మలుపులు తిప్పుతుంది. దారి తప్పిన వారికి రుజుమార్గం చూపుతుంది. సరైన దారిలో నడిచే వారిని గొప్ప గమ్యానికి చేరుస్తుంది. అలాంటి దార్శనికుడితో తన పరిచయాన్ని గ్రంథస్తం చేసి మరెందరికో స్ఫూర్తినిచ్చారు సంపాదకుడు పెన్నా శివరామకృష్ణ. బహుభాషావేత్త, ఆదర్శ అధ్యాపకుడు, సామాజిక నిర్మాత, ఉత్తమ రచయిత డా॥ నోముల సత్యనారాయణను కొత్తగా పరిచయం చేశారు. ఆయన జీవితాన్ని ఆయనతోనే చెప్పించారు. పుట్టుకనుంచి మొదలుపెట్టి నోముల సత్యనారాయణ బాల్యం, విద్యాభ్యాసం, ఉద్యోగం, సాహితీ ప్రస్థానం, ఉర్దూతో అనుబంధం, రచనా శైలి.. ఇలా ఎన్నో విశేషాలను వారి మాటలలోనే ఆవిష్కరించారు. ఈ పుస్తకం నోముల జీవితాన్ని, ఆయన సాహితీ పరిశోధనా వైచిత్రిని పరిచయం చేస్తుంది. ఆయన పరిశోధన ఎంత లోతుగా ఉంటుందో తెలియజేస్తుంది. సినిమా సంగీత, సాహిత్యాలపై నోముల అభిప్రాయాలు ఆపాత సంగీతాన్ని మరోసారి గుర్తుకు తెస్తాయి. మరెన్నో విషయాలను ఆయన విశదీకరించిన తీరు ఆయా అంశాలపై సగటు పాఠకుడికి ఉన్న దృక్కోణాన్ని మారుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

నోముల సాహిత్య ముచ్చట్లు
సంపాదకుడు: పెన్నా శివరామకృష్ణ
పేజీలు: 139 వెల: రూ.100
ప్రతులకు: నవచేతన బుక్‌హౌస్‌
(అన్ని శాఖలు), నవోదయ బుక్‌హౌస్‌, కాచిగూడ

- Advertisement -

కనిపించని గాథలు
దాదాపు ఏడాదిన్నరగా ప్రపంచం కనిపించని శత్రువుతో పోరాడుతున్నది. సూక్ష్మదర్శిని నుంచి చూసినా కూడా కనిపించని కరోనా క్రిమి పెట్టిన కష్టాలు పుట్టెడు. వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. లక్షల కుటుంబాలు వలసబాట పట్టాయి. కరోనా ప్రభావం ప్రత్యక్షంగా ఎంతుందో వార్తా కథనాలు చెబుతూనే ఉన్నాయి. కానీ, ఈ మహమ్మారి పరోక్షంగా ఎలాంటి సమస్యలు సృష్టించిందో కండ్లకు కట్టింది ‘కాలుతున్న కాలం’ మినీ కథల సంకలనం. చిన్నచిన్న కథలే కానీ, ప్రతిదీ గుండెను కదిలిస్తుంది. మస్తిష్కాన్ని తొలుస్తుంది. కరోనా ప్రభావంతో బీదాబిక్కీ జీవితాలు ఎంతలా అతలాకుతలమయ్యాయో చెప్పాయీ కథలు. కనిపించని కోణాలెన్నో హృద్యంగా స్పృశించారు రచయితలు. లాక్‌డౌన్‌ కాలంలో 52 మంది రచయితలు, రచయిత్రులు తమకు ఎదురైన అనుభవాలను తక్కువ నిడివితో ఆలోచింపజేసేలా ఆవిష్కరించారు. ఈ కథా సంకలనం అద్భుతంగా ఉందని చెప్పడానికి కాయగూరలమ్మే చెలవమ్మ కథ ఒక్కటి చదివితే సరిపోతుంది. ‘కనికరం లేని కాలంలో’ చెలవమ్మ పరిస్థితి మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. ఒక్క చెలవమ్మే కాదు, గోవిందమ్మ కథ, వలస పక్షి చంద్రయ్య గాథ, మాధురి స్వప్నం వీరందరి జీవితాలూ కరోనాకు ప్రభావితమైనవే! మనసున్న మనుషులు ఈ కథలను చదివాక బాగానే కాలక్షేపం అయిందని ఊరుకోరు. ఈ కాలుతున్న కాలంలో ఒక్కరికైనా సాయం చేయడానికి కంకణబద్ధులు అవుతారు.

కాలుతున్న కాలం (మినీ కథా సంకలనం)
సంపాదకులు: డా॥ పాతూరి అన్నపూర్ణ, వడలి రాధాకృష్ణ
పేజీలు: 152, వెల: రూ.150
ప్రతులకు: 99853 36444,
94902 30939

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana