e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home బతుకమ్మ కాంబో..అదరహో!

కాంబో..అదరహో!

కాంబో..అదరహో!

ఒక్కొక్కరికి ఒక్కో రుచి నచ్చుతుంది. కొందరికి కేక్స్‌ ప్రాణం, ఇంకొందరికి బిస్కెట్స్‌ ఇష్టం. ఆ కేక్స్‌లోకూడా ఒకరి ఓటు చాక్లెట్‌ కేక్‌కు, మరొకరి మొగ్గు స్ట్రాబెర్రీ ఫ్లేవర్‌కు. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే కన్నవారికి పెద్ద కష్టమే. కవలల విషయంలో అయితే, మరింత ఇబ్బంది. ఇద్దరి బర్త్‌డే ఒకేరోజున వస్తుంది కాబట్టి, ఇద్దరికీ ఒకే ఫ్లేవర్‌ నచ్చదు కాబట్టి, పరిష్కారంగా ‘టూ ఇన్‌ వన్‌’ ఫ్లేవర్‌ కేక్స్‌ తయారు చేస్తున్నారు బేకరీల నిర్వాహకులు. ‘టూ ఇన్‌ వన్‌’ ట్రెండ్‌ చాక్లెట్స్‌, మఫిన్స్‌ మొదలైన రుచులకూ విస్తరించింది. ఈ ట్రెండ్‌వల్ల ఇటు ఫుడ్‌ వేస్టేజీ తగ్గుతుంది. కస్టమర్లకు జంట రుచులూ దొరుకుతున్నాయి. ఇంట్లో పిల్లలమధ్య గొడవలూ ఉండవు. పిజ్జాలకూ ఈ ‘టూ ఇన్‌ వన్‌’ ట్రెండ్‌ విస్తరించింది. ‘పిజ్జేరియా’ అనే ప్రముఖ పిజ్జా కార్నర్‌ కూడా టూ ఇన్‌ వన్‌ కాంబినేషన్‌లో ప్రయోగాలు చేస్తున్నది. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్‌, ఫ్రెండ్స్‌ గ్రూప్స్‌ ఈ కాంబినేషన్‌ను బాగా ఇష్టపడుతున్నారు. దీనివల్ల ఒకరికోసం ఒకరు ఇష్టాల్ని వదులుకోవాల్సిన పనుండదు. ఎవరూ త్యాగరాజులు కానక్కర్లేదు. “టూ ఇన్‌ వన్‌ ట్రెండ్‌వల్ల మాకు కస్టమర్స్‌ ఇచ్చే రేటింగ్‌ పెరిగింది” అంటున్నది వందన అనే పిజ్జా కార్నర్‌ బాలిక.

టూ ఇన్‌ వన్‌ కాంబోలు..

- Advertisement -

కేక్స్‌
చాక్లెట్‌ – ఫ్రూట్‌
స్ట్రాబెర్రీ – చాక్లెట్‌
బ్లాక్‌ ఫారెస్ట్‌ – వెనిలా

డోనట్స్‌
చాక్లెట్‌ – వెనిలా
స్ట్రాబెర్రీ – చాక్లెట్‌
కుకీస్‌- క్రీమ్‌

పిజ్జా
చికెన్‌ – పెప్పర్‌కార్న్‌

ఐస్‌క్రీమ్‌
మ్యాంగో-వెనిలా
చాక్లెట్‌- ఆల్మండ్‌ మిక్స్‌ విత్‌ వెనిలా
స్ట్రాబెర్రీ- బ్లాక్‌ కరంట్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కాంబో..అదరహో!
కాంబో..అదరహో!
కాంబో..అదరహో!

ట్రెండింగ్‌

Advertisement