e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home బతుకమ్మ ‘స్నేక్‌ యాప్‌' ఓ రక్షణ కవచం

‘స్నేక్‌ యాప్‌’ ఓ రక్షణ కవచం

‘స్నేక్‌ యాప్‌' ఓ రక్షణ కవచం

పాము కనిపిస్తే? కరుస్తుందేమోనన్న భయం! ఆ భయమే పామును మనకు శత్రువును చేస్తుంది. పాము బారినుంచి తప్పించుకొనేందుకు మనం, మన చేతిలో చిక్కకుండా ఉండేందుకు పాము! చంపేదాకా, చచ్చేదాక వస్తున్నాయి పరిస్థితులు. ‘ఇకపై పాము భయం వద్దు’ అంటున్నారు స్నేక్‌ఫ్రెండ్స్‌. ‘స్నేక్‌ యాప్‌’ ద్వారా మనకు ఓ రక్షణ కవచాన్ని అందిస్తున్నారు.

జనాభా పెరుగుతున్నది. ఉండటానికి ఇండ్లు సరిపోవడం లేదు. పంట పొలాలను నివాస స్థలాలుగా మారుస్తున్నారు. అప్పటి వరకూ పొలాల్నే నమ్ముకున్న పాములు ఇండ్లలోకి వస్తున్నాయి. నిజానికి పాములు మన దగ్గరికి రావడం లేదు. మనమే పాముల దగ్గరికి పోతున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పామును చూడగానే భయపడకుండా, ఆగ్రహంతో వాటిని కొట్టి చంపకుండా.. మొబైల్‌ యాప్స్‌ద్వారా ప్రచారం కల్పిస్తే.. మనిషి జీవిస్తాడు. పామూ బతుకుతుంది.

- Advertisement -

నిమిషాల్లో రక్షణ
పామంటే ఎవరికి మాత్రం భయం ఉండదు? అతి కొద్దిమంది మాత్రమే సర్పాలతో ఆడుకుంటారు. ధైర్యంగా పట్టుకుంటారు. అలాంటివారిలో విజయ్‌ నీలకంఠన్‌ ఒకరు. ఆమధ్య అతడి సెల్‌ఫోన్‌కు ఒక సమాచారం వచ్చింది. ఆరేండ్ల పసివాడిని పాము కరిచిందని కేరళలలోని కన్నూరు జిల్లా రామతేరు గ్రామం నుంచి మెసేజ్‌. ఇరవై నిమిషాల్లో నీలకంఠన్‌ రామతేరు చేరుకున్నారు. హుటాహుటిన ఆ అబ్బాయిని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. మొత్తానికి పసివాడిని బతికించాడు. ‘సర్ప’ వాట్సాప్‌ గ్రూప్‌ కనుక లేకపోతే, ఆ బాలుడు బతికేవాడు కాదేమో. ‘సర్ప’ అంటే.. స్నేక్‌ అవేర్‌నెస్‌, రెస్క్యూ అండ్‌ ప్రొటెక్షన్‌ యాప్‌. దీన్ని, ఆ బాలూడి తాలూకు బంధువులు ఇన్‌స్టాల్‌ చేసుకొని వాడుతున్నారు కాబట్టే, నీలకంఠన్‌కు సరైన సమయంలో సందేశం వెళ్లింది. బాధితుడికి తగిన చికిత్సా అందింది.

పెరుగుతున్న వినియోగం
నాగజాతి సంరక్షకులకు, సామాన్య జనాలకు ‘సర్ప’ సమన్వయకర్తగా పనిచేస్తున్నది. అటవీశాఖ అధికారులకు సమాచారం చేరవేయడానికీ సాయపడుతున్నది. పాములను రక్షించేవారికి ఓ వేదికగా రూపొందించిన ‘సర్ప’ యాప్‌ను కేరళ అటవీ, వన్యప్రాణి సంరక్షణ విభాగం, వైల్డ్‌లైఫ్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూటీఐ) కలిసి ప్రారంభించాయి. ‘పాము కాటేస్తే ఎలా స్పందించాలి? సర్ప రక్షకులతో ఎలా కనెక్ట్‌ అవ్వాలి? ఏ హాస్పిటల్స్‌కి వెళ్లాలి?’ అనేది ఈ యాప్‌ సూచిస్తుంది. ప్రస్తుతం కేరళలో ‘సర్ప’కు ఆరువేల మంది క్రియాశీలక వినియోగదారులు ఉన్నారు. అందులో 828 మంది రెస్క్యూ టీమ్‌ సభ్యులు, వలంటీర్లు. వీళ్లంతా పాములగురించి సమాచారం వచ్చిన వెంటనే.. సంఘటనా స్థలానికి వెళ్లి ఆ విష సర్పాలను రక్షిస్తారు. కాటుకు గురైన వారిని హాస్పిటల్‌కు తరలించి, ప్రాణాలు కాపాడుతారు. పట్టుబడిన పాములను సురక్షితంగా అడవిలో వదిలేస్తారు.

సమాచారం పక్కాగా..
గడచిన నాలుగేండ్లలో ఏడు ఆండ్రాయిడ్‌ యాప్స్‌ వచ్చాయి. వీటిలో ‘సర్ప’తోపాటు స్నేక్‌పీడియా, స్నేక్‌హబ్‌, స్నేక్‌లెన్స్‌, సర్పెంట్‌, స్నేక్‌ ఫ్రెండ్‌, స్నేక్‌ బైట్‌, పాయిజన్‌ ఇన్ఫర్మేషన్‌ అనే అప్లికేషన్లూ ఉన్నాయి. ఈ యాప్స్‌ దేశంలోని పాముల గణాంకాలు, ఛాయాచిత్రాలు, విషపూరిత సర్పాలను గుర్తించే పద్ధతులు, రక్షకుల జాబితా, హాస్పిటల్స్‌ సమాచారం సమగ్రంగా అందిస్తున్నాయి. అయితే, వీటి వినియోగం ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాలకే పరిమితమైంది. ఈ యాప్స్‌ద్వారా తమకు కనిపించిన పాములు విషపూరితమైనవా, కాదా? అన్న అనుమానాన్ని నివృత్తి చేసుకున్నవారే ఎక్కువ. ఎక్కడైనా మనకు పాము కనిపిస్తే యాప్‌కు ఫొటోను పంపితే చాలు. అవసరాన్ని బట్టి, జీపీఎస్‌ ఆధారంగా వలంటీర్లు అక్కడికి చేరుకుంటారు. పామును భద్రంగా అడవిలో వదిలేస్తారు. అక్కడి మనుషులకు పాములంటే ఉన్న భయాన్నికూడా పోగొడతారు.

‘స్నేక్‌ యాప్‌' ఓ రక్షణ కవచం

పాము కాటుకు బలి
వన్యప్రాణుల రక్షణ చట్టం ప్రకారం పాములకు హాని చేస్తే శిక్ష తప్పదు. కానీ ఎవరు దీన్ని పాటిస్తున్నారు కనుక? జనాలకేమో పామును చూస్తే భయం. ఆ భయంలో ఏదో ఒకటి చేయబోయి పాముకాటుకు గురవుతున్నారు. చాలామంది చనిపోతున్నారు కూడా. కెనడాలోని టొరంటో యూనివర్సిటీ సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ రీసెర్చ్‌ నేతృత్వంలో గతేడాది ఒక అధ్యయనం నిర్వహించారు. దీని ప్రకారం, ఇండియాలో ప్రతీ సంవత్సరం పాముకాటుతో 58 వేలమంది చనిపోతున్నారు. 2000-2019 మధ్యకాలంలో 12 లక్షలమంది పాముకాటుకు బలయ్యారు. మరణాలలో 70% బిహార్‌, జార్ఖండ్‌, ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌లలోనే సంభవించాయి. వీటిలో సగం వర్షకాలంలో (జూన్‌-సెప్టెంబర్‌)లోనే జరిగాయి. అదికూడా గ్రామీణ ప్రాంతాల్లోనే అధికం.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘స్నేక్‌ యాప్‌' ఓ రక్షణ కవచం
‘స్నేక్‌ యాప్‌' ఓ రక్షణ కవచం
‘స్నేక్‌ యాప్‌' ఓ రక్షణ కవచం

ట్రెండింగ్‌

Advertisement