e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home బతుకమ్మ కొత్త రకం మంచాలపై మీరూ ఓ లుక్కేయండి

కొత్త రకం మంచాలపై మీరూ ఓ లుక్కేయండి

కొత్త రకం మంచాలపై మీరూ ఓ లుక్కేయండి

ఒకానొక కాలంలో పిల్లలు బామ్మ చెప్పే కథలు వింటూ పడుకునేవారు. ఆరు బయట తాతయ్యవద్ద నక్షత్రాలు లెక్కిస్తూ నిద్రలోకి జారుకునే వారు. చిన్న కుటుంబాల కాన్సెప్ట్‌ నేటి పిల్లలకు ఈ సౌకర్యాన్ని దూరం చేసింది. అలా ఏర్పడిన లోటును భర్తీ చేయడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు తల్లిదండ్రులు. పిల్లల పడక గదిని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. ట్రెండ్‌కు తగ్గట్టు రకరకాల బెడ్‌రూమ్‌ డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. అందులో నయా కాన్సెప్ట్‌ మంచాలు కొలువు దీరుతున్నాయి. బుజ్జాయిలకు నచ్చిన కారు తల్పాలు, బొమ్మల గిల్పాలు వచ్చేస్తున్నాయి.కొత్త రకం మంచాలపై మీరూ ఓ లుక్కేయండి.

నిద్రలో షి‘కారు’
చిన్నారులకు కార్లంటే మోజు. కారు బొమ్మ మొదలు కారులో షికారు వరకు కారుతో ముడి పడిన ముచ్చట్లెన్నో వాళ్లకు ఉంటాయి. పిల్లల ఆసక్తిని గుర్తించిన తయారీదారులు కారు ఆకారంలో మంచాలను తీసుకొచ్చారు. ముఖ్యంగా మగపిల్లలైతే వీటిని భలే ఇష్టపడుతున్నారు. కారు ఆకృతిలో ఉండే బెడ్‌కి ఎన్నో ప్రత్యేకతలు. టైర్లలో బెడ్‌ లైట్స్‌తోపాటు కొన్నిటికి కారు ఫీచర్లలాగే ఏసీ, మ్యూజిక్‌ సిస్టమ్‌ అరేంజ్‌మెంట్స్‌ కూడా ఉంటున్నాయి. కారు బెడ్స్‌పై ఇలా పడుకోగానే అలా కలల్లో షి‘కారు’ కొట్టేయొచ్చు. మార్కెట్‌లో హల్‌చల్‌ చేస్తున్న లగ్జరీ కార్ల మోడల్స్‌లోని తల్పాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటున్నది. రకరకాల రంగుల్లోని వెరైటీ మంచాలను పిల్లల కోసం ఇష్టంగా కొంటున్నారు తల్లిదండ్రులు.

కొత్త రకం మంచాలపై మీరూ ఓ లుక్కేయండి
కొత్త రకం మంచాలపై మీరూ ఓ లుక్కేయండి
- Advertisement -

రంగు హంగులు
మనిషిని ప్రభావితం చేసే వాటిల్లో రంగులది కీలకపాత్ర. ఒక్కో కలర్‌ ఒక్కో విధంగా ఆకర్షిస్తుంది. అందుకే, పిల్లల బెడ్‌రూమ్‌ విషయంలో రంగులకు అధిక ప్రాధాన్యం ఇస్తారు తల్లిదండ్రులు. ఈ మేరకు పిల్లల గదుల్లో సింగిల్‌ కలర్‌ థీమ్‌ను ఎంచుకుంటున్నారు. గోడకు వేసే రంగులే కాదు, ఆ గదిలో వేసే మంచం సైతం అదే రంగులో ఉండేలా చూస్తున్నారు. దానికి తగ్గట్టే కర్టెన్లు, ఫ్లోర్‌ మ్యాట్స్‌, బెడ్‌షీట్లు, దిండు కవర్లు.. ఒకే రంగులో ఎంచుకుంటున్నారు. ఎలక్ట్రిక్‌ బ్లూ, పర్పుల్‌, గులాబీ, ముదురు ఆకుపచ్చ రంగులు ఎంచుకొంటే మరింత అందంగా ఉంటుంది ఆ గది. పిల్లల బర్త్‌డేలను ఆ రూమ్‌లో సెలబ్రేట్‌ చేస్తే.. ఫొటోలు బాగా వస్తాయి.

కొత్త రకం మంచాలపై మీరూ ఓ లుక్కేయండి

చిన్నారి రాకుమారి కోసం..
ఐదేండ్ల చిన్నారి కూడా కార్టూన్‌ సినిమాల్లోని ప్రిన్సెస్‌ని ఇష్టపడుతుంది. ఆ క్యారెక్టర్‌లో తమని ఊహించుకుంటూ మురిసి పోతుంటారు. మరి వాళ్ల ఆశను తీర్చేందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అమ్మానాన్నలకు లేదు. ఎందుకంటే, మార్కెట్లో ప్రిన్సెస్‌ థీమ్‌ బెడ్‌రూమ్స్‌ దొరుకుతున్నాయి. రకరకాల డిజైన్లలో మంచాలు అందుబాటులో ఉన్నాయి. గదిగోడలకు బేబీ పింక్‌ కలర్‌తోపాటు అన్ని రకాల ఫర్నీచర్‌కి కూడా పింక్‌ కలర్‌ పెయింట్‌ వేయాలి. గోడలకు సీనరీలు పెడితే మరింత అందంగా ఉంటుంది. బార్బీ, ర్యాబిట్‌ థీమ్స్‌తో డెకరేట్‌ చేయొచ్చు.

కొత్త రకం మంచాలపై మీరూ ఓ లుక్కేయండి

పడక ఫా‘రెస్ట్‌’
ఒకప్పుడు పిల్లలకు ఏదైనా నేర్పించాలంటే పుస్తకాలే దిక్కు. కానీ, ఈరోజుల్లో అన్నిటినీ ప్రాక్టికల్‌గా చూపించాలనుకుంటున్నారు. అందువల్ల పిల్లలకు అడవి విలువను, ప్రకృతి ప్రాముఖ్యాన్ని చెప్పేందుకు ఫారెస్ట్‌ థీమ్‌ని ఎంచుకొంటున్నారు. గదిని వనసీమగా మార్చేస్తున్నారు. బెడ్‌, బెడ్‌షీట్‌, కర్డెన్స్‌, వాల్‌ పేపర్స్‌ నుంచి సీలింగ్‌ పెయింట్‌ వరకు అన్నిటా అరణ్య కళ ప్రతిబింబించాల్సిందే. ఆ ప్రయత్నంలో చెట్లు, తీగలు, ఆకులు, జంతువులు, పక్షుల ఆకారాలు, పెయింటింగ్స్‌ ఉపయోగిస్తున్నారు. ఫ్లోర్‌ మ్యాట్‌లనుకూడా స్పెషల్‌గా తయారు చేయిస్తున్నారు. పిల్లల గదిలో అక్కడక్కడా చిన్నచిన్న మొక్కలను కుండీల్లో పెట్టొచ్చు.

కొత్త రకం మంచాలపై మీరూ ఓ లుక్కేయండి

కలప పాన్పు
ఉడెన్‌ బెడ్స్‌లో రకరకాల డిజైన్లు వస్తున్నాయి. దీంతోపాటు ఫ్లోర్‌మీద టెర్రాకోట కార్పెట్‌ వేస్తే ఆ గదిలోని గాలికూడా వెచ్చగా ఉంటుంది. పైగా పిల్లలకు కలప విలువ నేర్పించిన వారవుతారు. అది చెట్లనుంచి వస్తుందని, మానవ మనుగడకు చెట్ల ఆవశ్యకత ఏంటో తెలిపే అవకాశం కూడా ఉంటుంది.

కొత్త రకం మంచాలపై మీరూ ఓ లుక్కేయండి
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొత్త రకం మంచాలపై మీరూ ఓ లుక్కేయండి
కొత్త రకం మంచాలపై మీరూ ఓ లుక్కేయండి
కొత్త రకం మంచాలపై మీరూ ఓ లుక్కేయండి

ట్రెండింగ్‌

Advertisement