e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home బతుకమ్మ తీరొక్కచీరల కథ

తీరొక్కచీరల కథ

భారతావని చేనేతకు పెట్టింది పేరు. కశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు తీరొక్క చీరలు భారతీయతను చాటిచెబుతుంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన చేనేత శైలి అక్కడి సంప్రదాయానికి విజయ ధ్వజంలా రెపరెపలాడుతూ దర్శనమిస్తుంది. బెనారస్‌, కాంజీవరం,ఇక్కత్‌, కలంకారీ.. ఇలా జగమెరిగిన శ్రేణులే కాదు,మరెన్నో వినూత్నమైన చీరలు ఆయా ప్రాంతాల నేతన్నల దక్షతను చాటిచెబుతున్నాయి. వాటిలో కొన్ని ఇవి..

వెంకటగిరి (ఆంధ్రప్రదేశ్‌)
నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి ప్రాంతం కాటన్‌ చీరలకు ప్రసిద్ధి. ప్రత్యేకమైన జరీ వల్లే ఈ చీరలకు అంత ప్రజాదరణ. ఎందుకంటే వీటిని చేత్తో అల్లుతారు. ఈ చీరల్లో జాందనీ వర్క్‌కు మంచి డిమాండ్‌ ఉంటుంది. రెండువైపులా ఒకే డిజైన్‌ కనిపించడం జాందనీ ప్రత్యేకత. ఆ రోజుల్లో వీటిని మహారాణులు, జమీందార్ల భార్యల కోసమే నేసేవారట.

తీరొక్కచీరల కథ

బొమ్కాయ్‌ (ఒడిశా)
దళసరి వస్త్రం, వెడల్పాటి పల్ల్లూ బొమ్కాయ్‌ ప్రత్యేకత. ఈ చీరలు ముదురు రంగు అంచుతో ఆకట్టుకుంటాయి. బొమ్కాయ్‌ కాటన్‌ చీరలపై చేప డిజైన్‌ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. దాన్ని విజయానికి సంకేతంగా భావించేవారు. ఈ చీర డిజైన్‌ కాస్తంత గిరిజనుల వస్త్రశైలిని ప్రతిబింబిస్తుంది. ఎక్కువగా ఎరుపు, నలుపు, తెలుపు రంగుల్లో ఇవి దర్శనమిస్తాయి.

తీరొక్కచీరల కథ

కూరయ్‌నాడు(తమిళనాడు)
ఈ చీరను సిల్క్‌, కాటన్‌ దారాలను 2:1 నిష్పత్తిలో ఉపయోగించి రూపొం దిస్తారు. తమిళనాడులోని కూరయ్‌నాడులో నేయడం వల్ల ఆ పేరు వచ్చింది. తొమ్మిది గజాల ఈ చీర మీద చెక్స్‌, చారలు ఎక్కువగా కనిపిస్తాయి. పర్పుల్‌, ముదురు గులాబీ, ఆరెంజ్‌, ఆలివ్‌ గ్రీన్‌, పసుపు రంగులను ఎక్కువగా వాడతారు.

తీరొక్కచీరల కథ

లెప్చా (సిక్కిం)
పూర్వం ఈ లెప్చాను సిస్నూ అనే మొక్క నుంచి తీసిన నూలుతో నేసేవారు. ప్రస్తుతం కాటన్‌ వెజిటెబుల్‌ కలర్స్‌, సింథటిక్‌ కలర్స్‌ వాడి వస్ర్తాన్ని తయారు చేస్తున్నారు. ఈ లెప్చా ఫ్యాబ్రిక్‌ తెలుపు, ఎరుపు, నలుపు, పసుపు పచ్చ, ఆకుపచ్చ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

తీరొక్కచీరల కథ

తేల్యా రుమాల్‌ (తెలంగాణ)
నూనెతో చేసిన రుమాలు అని.. ఈ పేరుకు అర్థం. నల్లగొండ జిల్లా పుట్టపాక ఈ తేల్యా రుమాల్‌ రకం చేనేత వస్ర్తాలకు ప్రసిద్ధి. నూనెను ఉపయోగించి టై అండ్‌ డై టెక్నిక్‌ ద్వారా నూలుతో వస్ర్తాన్ని తయారు చేయడమే ఇక్కడి ప్రత్యేకత. గతేడాది పుట్టపాక క్లస్టర్‌లోని తేల్యా రుమాల్‌కు జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ (జీఐ) ట్యాగ్‌ లభించింది. ఆరెంజ్‌ రెడ్‌, మెరూనిష్‌ రెడ్‌, బ్లాక్‌ అండ్‌ వైట్‌లలో మాత్రమే
తేల్యా రుమాల్‌ వస్త్రం లభిస్తుంది.

తీరొక్కచీరల కథ

కోటా డోరియా (రాజస్థాన్‌)
ఎక్కువ బరువు లేకుండా, సింపుల్‌గా ఏ సందర్భానికైనా తగినట్టు ఉంటాయి. సున్నితంగా ఉంటాయి. రాజస్థాన్‌లో వేడి వాతావరణానికి అనువుగా తీర్చిదిద్దారు. చీరపై ఉండే గడులను ఖట్స్‌ అంటారు. వీటిలో బేసిక్‌, ప్రింటెడ్‌ జరా స్టయిల్‌ బాగుంటాయి. ఇందులో మొత్తం పద్నాలుగు రకాల దారాలను ఉపయోగించారు. వీటిలో ఎనిమిది కాటన్‌ దారాలైతే, మిగతావి సిల్క్‌ పోగులు.

తీరొక్కచీరల కథ

కున్బి ఫ్యాబ్రిక్‌ (గోవా)
కున్బీ చీరను అప్పట్లో పొలం పనులకు వెళ్లే మహిళలు ధరించేవారు. ఎరుపు, తెలుపు రంగుల్లో ఉండే ఈ కాటన్‌ చీరలు చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. దీనికి దోబీ బార్డర్‌ ప్రత్యేక ఆకర్షణ. ఇంచు నుంచి రెండించుల అంచుపై చెక్స్‌, చారలతో రకరకాల డిజైన్లు నేస్తారు. ఇటీవలే ఈ ఫ్యాబ్రిక్‌ని ప్రముఖ డిజైనర్‌ వెండెల్‌ రాడ్రిక్స్‌ ఫ్యాషన్‌ వీక్‌లో ప్రమోట్‌ చేశారు.

తీరొక్కచీరల కథ

ముగ సిల్క్‌ (అసోం)
ముగ చీరలను అసోంలోనే తయారు చేస్తారు. సోమ్‌, స్వాలూ అనే ఆకులను ఆహారంగా తీసుకునే పట్టుపురుగుల లార్వాతో తయారు చేసిన దారాలనే ఉపయోగిస్తారు. సహజమైన ఎల్లో-గోల్డెన్‌ మెరుపు వీటి ప్రత్యేకత. ఉతికినప్పుడల్లా మెరుపు పెరగడం మరో ప్రత్యేకత. ఒకప్పుడు ఈ చీరలను రాచకన్యలు కట్టుకునేవారట.

తీరొక్కచీరల కథ

కని ఫ్యాబ్రిక్‌ (కశ్మీర్‌)
కశ్మీరీ భాషలో ‘కని’ అంటే చిన్న చెక్క పుల్ల అని అర్థం. చీరలను నేసేటప్పుడు రకరకాల డిజైన్స్‌ కోసం కోసం ఆ పుల్లలు వాడతారు. అందుకే ఈ చీరలకు కని చీరలన్న పేరు వచ్చింది. ముఖ్యంగా ఈ ఫ్యాబ్రిక్‌తో తయారు చేసే శాలువాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధం. తర్వాతర్వాత చీరలు నేయడం మొదలుపెట్టారు. ఇందుకు పష్మినా నూలునే ఉపయోగిస్తారు.

తీరొక్కచీరల కథ
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తీరొక్కచీరల కథ

ట్రెండింగ్‌

Advertisement