e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home బతుకమ్మ బాపు‘రే’!

బాపు‘రే’!

బాపు‘రే’!

సత్యజిత్‌ రే.. దేశం గర్వించదగ్గ దిగ్గజ దర్శకుడు. కళాపిపాసి, విభిన్న కళలను ఆపోశన పట్టిన మేధావి. దేశం నుంచి ఆస్కార్‌ పొందిన ఏకైక దర్శక నిర్మాత. ఇంకా గ్రాఫిక్‌ డిజైనర్‌, గాయకుడు, కాలిగ్రాఫర్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌, ఫిక్షన్‌ రైటర్‌, పబ్లిషర్‌, వీటన్నిటికీ మించి అద్భుతమైన ఇలస్ట్రేటర్‌. ఆయన శత జయంతిని ‘బారో మార్కెట్‌’ అనే ఆన్‌లైన్‌ సంస్థ విభిన్నంగా జరుపుతున్నది. ఆ విశేషాలే ఇవి.

భారతీయ సినిమాకు చుక్కాని సత్యజిత్‌ రే. ఆ మాస్టర్‌ ఫిల్మ్‌ మేకర్‌కు వినూత్నంగా నివాళులు అర్పించాలని భావించింది ‘బారో మార్కెట్‌’. సత్యజిత్‌ రే గీసిన ఇలస్ట్రేషన్స్‌కు, ఆయన సృష్టించిన క్యారెక్టర్లకు మరింత ప్రచారం కల్పించేందుకు వాటిని రెడీ-టు-ఫ్రేమ్‌ రెప్లికా పోస్టర్లు, సిరమిక్‌ వాల్‌ప్లేట్లుగా మార్చి అన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టింది. ‘ఈ కరోనా సమయంలోనూ వాటికి తిరుగులేని డిమాండ్‌ ఉందని’ అంటున్నారు బారో మార్కెట్‌ వ్యవస్థాపకురాలు శ్రీల చటర్జీ.

‘రే ఎప్పుడూ తన సొంత భాషలోనే మాట్లాడేవారు. దేశ సంస్కృతిలోని విభిన్నకోణాలను ఆయన చిత్రాల్లో, పెయింటింగ్స్‌లో, ఇలస్ట్రేషన్స్‌లో ఆవిష్కరించారు. అభిమానిగా రే తత్వాన్ని నేను బలంగా నమ్ముతాను. ఆయన ఆలోచనలు, సందేశం సార్వజనీనమైనవి’ అని కీర్తిస్తారు శ్రీల చటర్జీ.
ఈ చిత్రాలలో.. ప్రతి ఫ్రేమ్‌లోనూ జీవకళ ఉట్టి పడుతుంది. రే ప్రతిభను విశ్వవ్యాప్తం చేసిన ఆయన మొదటి సినిమా ‘పథేర్‌ పాంచాలి’ (1955)కి చెందిన ఫ్రేములకు మంచి డిమాండ్‌ ఉంది. ఇక అత్యంత ప్రజాదరణ పొందిన సోనార్‌ కెల్లా, జల్సాఘర్‌, నాయక్‌ వంటి కొన్ని సుప్రసిద్ధ చిత్రాల పాత్రలు సిరామిక్‌ వాల్‌ ప్లేట్లలో ఒదిగి పోయాయి. రే క్లాసిక్‌ చిత్రాలోని క్యారెక్టర్లకు ఎంబ్రాయిడరీ రూపమూ ఇచ్చారు. చీరెలు, కుర్తాలు, బ్లౌజ్‌లపై సత్యజిత్‌ రే ఇలస్ట్రేషన్స్‌కు త్రెడ్‌ వర్క్‌తో ప్రాణం పోసి అందంగా మలిచారు. అరుదైన ఈ కళాత్మక ఇలస్ట్రేషన్స్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు baro market.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బాపు‘రే’!

ట్రెండింగ్‌

Advertisement