మండుటెండలో చల్లని చెరకు రసం తాగితే జిహ్వకు తియ్యదనం, గొంతుకు చల్లదనం, జఠరాగ్నికి ఉపశమనం లభిస్తుంది. ఎన్ని కూల్‌డ్రింక్స్ తాగినా లభించని తృప్తి గ్లాసెడు ఇక్షురసంతో దొరుకుతుంది. అందుకే, వేసవి చెర నుంచి తప్పించుకోవడానికి చాలామంది ఈ సహజసిద్ధ పానీయం కోసం వెదుకులాడుతారు. దారెంట చెరకు బండి కనిపిస్తే చాలు, యూ టర్న్ తీసుకొని మరీ వచ్చి తాగుతారు. కస్టమర్లతో కిటకిటలాడుతున్నా వేచి ఉంటారు. బండివాడితో మాటకలిపి అదనంగా నిమ్మచెక్క, అల్లం ముక్క పెట్టించి రుచికరమైన చెరకు రసాన్ని తాగుతూ గుటక గుటకకు ఉపశమనం పొందుతారు.
-మజ్జిగపు శ్రీనివాస్‌రెడ్డి
ఇవీ కూడా చదవండి..
శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం