e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home బతుకమ్మ ఇంటికే..‘మందు’!

ఇంటికే..‘మందు’!

ఇంటికే..‘మందు’!

ఇప్పుడన్నీ ఆన్‌లైన్‌లోనే. ఫుడ్‌ ఆర్డర్‌ చేయొచ్చు. బట్టలు కొనుక్కోవచ్చు. క్యాబ్‌ బుక్‌ చేసుకోవచ్చు. మొబైల్‌ తీసుకోవచ్చు. అంతేనా? మద్యం కూడా బుక్ చేసుకోవచ్చు! ఆశ్చర్యంగా ఉంది కదూ? అదెక్కడో తెలుసుకుందాం!

‘రేపు పండగ కదా? ఏం ప్లాన్‌ చేస్తున్నారు? మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. మా ఏర్పాట్లూ మేం చేసుకొంటాం. డ్రంకన్‌ డ్రైవ్‌లో కలుద్దాం మరి’ అని సైబరాబాద్‌ సిటీ పోలీస్‌లు సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. తాగి బయటకు వెళితే ఎక్కడ పోలీసులు చెక్‌ చేస్తారో అని చాలామంది నారాజ్‌ అయ్యారు. ‘తాగి వాహనాలు నడపొద్దు. ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు’ అని పోలీసులు వారి క్షేమం కోసమే చెప్తున్నారు కదా! తాగి ఎందుకు బయటకు రావడం? దీనికీ ఓ పరిష్కారం కనిపెట్టారు మనోళ్లు.

బుక్‌ చేసిన కొద్దిసేపటికే
ఏదో శుభకార్యం ఉంటుంది. అక్కడికి వెళ్లాక వాళ్లూ వీళ్లూ కలిస్తే ఊరికే ఉండాలనిపిస్తుందా? మర్యాద కొద్దీ ఫంక్షన్స్‌లో మందు కూడా పెడుతున్నారు. కొన్నిసార్లు మొహమాటానికైనా తాగాల్సిన పరిస్థితి. కానీ ఆ తర్వాత ఏంటి? బయట డ్రంకన్‌ డ్రైవ్‌ ఉంటుంది. అలాగనీ ఫంక్షన్లోనే ఉండలేరు. పోనీ, వాహనం ఎవరికైనా ఇచ్చి వెనకాల కూర్చుందామా అంటే తాజాగా కొత్త చట్టం ఒకటి వచ్చింది. వెనకాల తాగినవాళ్లను కూర్చోబెట్టుకుంటే వాహనం నడిపేవాళ్లపై కూడా కేసు అని. ఇలా అయితే కిక్కు దక్కేదెలా అని బాధపడేవాళ్లకు, లిక్కర్‌ షాప్‌కు వెళ్లి మందు తెచ్చుకోవడం ఇష్టం లేనివాళ్లకు, మద్యం విషయంలో ప్రైవసీ మెయింటెన్‌ చేసేవాళ్లకు ఇంటివద్దకే మందు చక్కటి మార్గం. బుక్‌ చేసిన కొద్ది సమయానికే ఇంటికి మందు రానే వస్తుంది. ఎంచక్కా ఇంట్లో కూర్చొని, ముచ్చట్లు పెట్టుకుంటూ తాగేయొచ్చన్నమాట. ‘ఇంటివద్దకే మందు డెలివరీ అయ్యే భాగ్యం’ పైసలిచ్చినా దొరకదు మరి!

బూజీ యాప్‌
ఫుడ్‌ ఆర్డర్‌ చేసినట్టు మందు కూడా ఆర్డర్‌ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నది ‘బూజీ’. ఇది
హైదరాబాద్‌కు చెందిన ఇన్నోవెంట్‌ టెక్నాలజీ స్టార్టప్‌. ఔత్సాహిక ఆంత్రపెన్యూర్‌లు వివేకానంద్‌ బలిజెపల్లి, సుసోవాన్‌ మజుందార్‌ ఈ యాప్‌ను రూపొందించారు. వివేకానంద్‌ ‘బూజీ’ సంస్థకు సీఈఓ కాగా, మజుందార్‌ సీపీఓగా పనిచేస్తున్నారు. ఇంటికే మందు కావాలని అనుకున్నవాళ్లు ఏ బ్రాండ్‌ కావాలి? ఎంత కావాలి? డెలివరీ లొకేషన్‌.. వంటివన్నీ ఆర్డర్‌ బుకింగ్‌లో పొందుపరచాలి. సిటీలోని ప్రతీ ఏరియాలో బూజీ డెలివరీ బాయ్స్‌ ఉంటారు. బుక్‌చేసిన వెంటనే దగ్గర్లో ఉన్న లిక్కర్‌షాప్‌, బార్‌ల నుంచి మద్యం తీసుకొచ్చి డోర్‌ డెలివరీ చేస్తారు. దీనికోసం ఎలాంటి డెలివరీ చార్జీలు వసూలు చేయరు. ఫ్రీ డెలివరీ వల్ల వాళ్లకు లాభమేంటి అంటారా? ఆయా లిక్కర్‌ బ్రాండ్స్‌, స్టోర్స్‌ నుంచి కమీషన్‌ రూపంలో డబ్బులు అందుతాయి. అదేవిధంగా పోర్టల్‌లో లిక్కర్‌ యాడ్స్‌ ద్వారా సొమ్ము జమ అవుతుంది.

ఇంటికే..‘మందు’!

ప్రపంచంలోనే ఫస్ట్‌
బార్లు, క్లబ్స్‌తో ‘బూజీ’ అసోసియేట్‌ అయి ఉంటుంది. ఎక్కడెక్కడ ఏయే బ్రాండ్లు ఉన్నాయనే పూర్తి సమాచారం డేటాబేస్‌ రూపంలో పోర్టల్‌లో ఉంటాయి. వినియోగదారులను ఆకర్షించాలనే ఉద్దేశంతో వీటికి ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నారు. ఈవెంట్స్‌, గిఫ్ట్‌ కూపన్స్‌ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. గత యేడాది చివరి నుంచి ‘బూజీ లిక్కర్‌ డెలివరీ స్టార్టప్‌’ సేవలు అందుతున్నాయి. ‘ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మద్యం సరఫరా చేస్తున్నాం. ఆన్‌లైన్‌ డ్రింకింగ్‌ గేమ్స్‌ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రపంచంలోనే ‘మొదటి సామాజిక మద్యపాన వేదిక’గా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం వెస్ట్‌ బెంగాల్‌లో ఈ రకమైన సేవలను ప్రారంభించే పనిలో ఉన్నాం. దీనికోసం హైదరాబాద్‌లో టెస్ట్‌ డ్రైవ్‌ నడుస్తున్నది’ అంటున్నారు బూజీ సీఈఓ వివేకానంద్‌.

ఆలోచన ఎలా వచ్చింది?
ఫుడ్‌ డెలవరీ మాదిరిగా లిక్కర్‌ డెలివరీ చేయాలనే ఆలోచన వివేకానంద్‌కు వచ్చింది. దానిని మిత్రుడితో షేర్‌ చేసుకున్నాడు. వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒకవేళ స్టార్టప్‌ రూపొందిస్తే జరిగే మార్పులేంటి? అని కొంతకాలం అధ్యయనం చేశారు. బయటకు వెళ్లి మద్యం కొనుక్కోవాలంటే ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. దీనికి ‘బూజీ స్టార్టప్‌’ ద్వారా పరిష్కారం చూపించాలనుకున్నారు. బార్లు, పబ్బుల్లో జరిగే పార్టీల్లో పాల్గొనేవారే లక్ష్యంగా మరిన్ని ఫీచర్లు రూపొందిస్తున్నారు. హైదరాబాద్‌లో మాదిరిగా అన్ని నగరాల్లో ‘డ్రైవ్‌ త్రూ’ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చి, మద్యం స్టోర్‌లోకి వెళ్లకుండానే మద్యం సేవించే అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఐదు రాష్ర్ర్టాలతో చర్చలు జరుపుతున్నారు. మద్యప్రియులకు ఇది శుభవార్తే. కానీ, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అన్న విషయాన్నీ వారు గుర్తుంచుకోవాలి.

ఇవీ కూడా చదవండి…

కట్టడిపై నిర్లక్ష్యం.. తనిఖీలు శూన్యం

సినీ పాటల ‘బండి’!

ప్యాకింగ్‌చూడు గురూ..!

Advertisement
ఇంటికే..‘మందు’!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement