మనసు ఎంత ఆందోళనలో ఉన్నా, పచ్చని మొక్కలను చూస్తే చాలు నిమిషాల్లో ప్రశాంతత లభిస్తుంది. అంతేకాదు, పచ్చని పొదరింట్లో చుట్టూ పాజిటివిటీ ఉంటుంది. ఆ మొక్కల్లో రకరకాలు. ఒక్కో మొక్క , ఇంట్లోని ఒక్కో రూమ్‌కి సెట్ అవుతుందని నిపుణులు అంటున్నారు. వాటి వివరాలే ఇక్కడ.
పీస్ లిల్లీ
ఈ మొక్కకు తడి, తక్కువ వెలుతురు వల్ల ఎలాంటి సమస్యా ఉండదు. ఈ లిల్లీలు ఇంట్లోని కొద్దిపాటి స్థలంలోనే అపరిమితమైన అందాన్ని ఇస్తాయి. ముదురు ఆకుపచ్చ మొక్క మధ్య తెల్లటి పూలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. పైగా ఈ మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయి.
బోస్టన్ ఫెర్న్
ఈ మొక్కలను ఎక్కువగా బాత్ రూమ్‌లో పెట్టుకుంటారు. చాలా మొండి మొక్కగా దీనికి పేరు. ఎంతటి తేమనైనా తట్టుకోగలదు. వీటిని కిటికీ పక్కన హ్యాంగింగ్ కుండీల్లో పెట్టుకోవచ్చు. బాత్ టబ్ లేదా ఇంటి ఎంట్రన్స్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు.
స్పైడర్ ప్లాంట్
ఈ మొక్కను చంపడం చాలా కష్టమైన పని. కానీ, నిర్వహణ మాత్రం చాలా సులభం. ఇది చుట్టూ ఉన్న గాలిని స్వచ్ఛంగా మారుస్తుంది. ఇంట్లోని పెంపుడు జంతువులకు కూడా ఈ స్పైడర్ ప్లాంట్‌వల్ల హాని జరుగదు.
పోతోస్
ఎవర్గ్రీన్ పోతోస్ను ఇంట్లో వేలాడే కుండీల్లో పెట్టుకోవచ్చు. అలాగే, గది మూలన కుండీల్లోనూ పెంచుకోవచ్చు. వీటిని వాష్ బేసిన్ కౌంటర్ల దగ్గర వేజ్ లేదా గాజు సీసాల్లోనూ పెట్టొచ్చు. ఈ మొక్కలు ఎలాంటి వాతావరణంలోనైనా బతుకుతాయి. నాటిని కొద్దిరోజులకే ఆరోగ్యంగా ఏనుకుంటాయి కూడా.