e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home బతుకమ్మ వెరీగుడ్డు పులుసు!

వెరీగుడ్డు పులుసు!

వెరీగుడ్డు పులుసు!

ఇంట్లో కూరగాయలు లేకపోయినా, ఉన్నా వండే ఓపిక లేకపోయినా.. ఠక్కున గుర్తొచ్చేది గుడ్డు. చిన్నపిల్లల మారాం మాన్పించేది, బ్యాచిలర్స్‌ వంటకు భరోసా ఇచ్చేదికూడా గుడ్డే. కాలమేదైనా, వారమేదైనా రాత్రీ పగలనే తేడా లేకుండా కంచుట్లో పడి, కంచంలో చేరి, కడుపు నింపుతుంది. ప్రపంచ వ్యాప్తంగా గుడ్లతో రకరకాల వంటలు చేస్తారు. అవన్నీ తెలంగాణ స్పెషల్‌ ‘గుడ్డు పులుసు’ ఘుమఘుమల ముందు దిగదుడుపే.

మటన్‌, చికెన్‌, చేపల తర్వాత నాన్‌వెజ్‌ ప్రియుల ఓటు కోడిగుడ్లకే. మిగతావి వారానికోసారో నాలుగు రోజులకోసారో వండుతారుగానీ, కోడిగుడ్లు మాత్రం తరచూ పొట్టనింపి పుణ్యం కట్టుకోవాల్సిందే. కోడిగుడ్లతో ఎన్ని రకాల వంటలు చేసినా తెలంగాణ స్పెషల్‌ గుడ్డు పులుసు ఎంతో ప్రత్యేకమైంది. అనుకోకుండా అతిథులు వచ్చినా, సమయానికి బయటికెళ్ళే పరిస్థితులు లేకపోయినా గుడ్డు పులుసుతో మర్యాద చేయడం మామూలే. పులుసు పెడితే మరో కూరతో పన్లేదు. కలుపుకోవచ్చు, నంజుకోవచ్చు, జుర్రుకోవచ్చు.

- Advertisement -

ఉడక బెట్టిన గుడ్లు, ఉల్లిపాయలు, టమాట, కాస్త చింతపండు చేర్చి వండేదే గుడ్డు పులుసు. ఇది తెలంగాణ ప్రాచీన వంటకం. ఇప్పటికీ పల్లె, పట్టణం తేడా లేకుండా ఇష్టంగా తింటారు. ఉడక బెట్టిన గుడ్లలోని ఒక రకమైన వాసన, పులుసుతో ఉడికిన గుడ్డులో మాత్రం ఉండదు. పులుసు పట్టేందుకు గుడ్లకు గాట్లు పెట్టడమే ఇందుకు కారణం.

గుడ్డులోని పోషకాలపై ఎన్నో అధ్యయనాలు జరిగాయి. రోజుకో గుడ్డు తింటే చాలా సమస్యలనుంచి బయట పడవచ్చని చెబుతారు పరిశోధకులు. గుడ్డు మాంసాహారం కాదనీ, శాకాహారులు కూడా నిరభ్యంతరంగా ఆరగించ వచ్చని భరోసా ఇస్తారు. ఉడక బెట్టినా, ఫ్రై చేసినా.. ఎలా తీసుకున్నా దీనిలోని పోషకాలు పూర్తిగా శరీరానికి అందుతాయనేది పరిశోధకుల మాట.

ఒంట్లోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో గుడ్డు బాగా పనిచేస్తుంది. ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను పెంచి గుండె సమస్య ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుడ్డులోని హైడెన్సిటీ లిపోప్రొటీన్‌ శరీరంలోని కొవ్వు నిల్వలను సమతుల్యం చేస్తుంది. దీనిలో పుష్కలంగా లభించే యాంటీ ఆక్సిడెంట్స్‌.. లూటిన్‌, జియాక్సాన్తిన్‌ వృద్ధులలో కంటిసమస్యలను తగ్గిస్తాయి.

కొన్ని ప్రాంతాల్లో చింతపండు పులుసు వేయకుండా కూరలానూ వండుతారు. మరికొన్ని చోట్ల కుర్మా పద్ధతిలో పల్లీలు, నువ్వులు, మసాలాలు గుప్పిస్తారు. అయితే, చింతపండు పులుసు కుమ్మరించి చేసేదే అసలైన తెలంగాణ పాకం.
స్టార్‌ హోటళ్ళు సైతం దీన్ని తెలంగాణ స్పెషల్‌ వంటకంగా మోనూలో చేర్చి, మక్కువతో వడ్డిస్తున్నాయి.

గుడ్డులోని హైప్రొటీన్‌ శరీరం ఎక్కువ క్యాలరీలను తీసుకోకుండా నియంత్రిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు రోజూ ఉదయం ఒక గుడ్డును గుటుక్కుమనిపిస్తే చాలు. శరీరంలోని ప్రొటీన్‌ స్థాయిని పెంచడంలోనూ ఇది ఉపయోగపడుతుంది. అందుకే, శరీరాన్ని దృఢం చేసుకోవాలనుకునే వాళ్ళు కండపుష్ఠి కోసం గుడ్లను ఆహారంగా తీసుకుంటారు. పిల్లలకైతే ఇది అమృతంతో సమానం.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వెరీగుడ్డు పులుసు!
వెరీగుడ్డు పులుసు!
వెరీగుడ్డు పులుసు!

ట్రెండింగ్‌

Advertisement