డాక్టరు కావాలనుకొని..


Sun,October 20, 2019 03:07 AM

వీర్ సినిమాతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. సల్మాన్ కత్రినా కైఫ్‌లా ఉండే అమ్మాయి కోసం వెతికి జరీనాని పట్టుకొచ్చాడు. కాకపోతే హెవీగా ఉన్న కత్రినా అని అందరూ పిలుచుకున్నారు. జరీనా డాక్టర్ కావాలని కలలు కనేది. కానీ చదువు మధ్యలో ఆగడంతో కాల్ సెంటర్‌లో పనిచేసింది.

zareena
గోపీచంద్ చాలా రోజుల తర్వాత.. చాణక్యతో మంచి హిట్ అందుకున్నాడు.. అందులో రా ఏజెంట్‌గా.. బాలీవుడ్ నటి జరీనా ఖాన్ కనిపించింది.. అందంతో పాటు.. నటనకు కూడా ప్రశంసలందుకుంటున్నది.. కత్రినాకి డూప్‌గా వచ్చిన ఈ అమ్మడు.. ఆ తర్వాత బాలీవుడ్‌లో సక్సెస్ అందుకుంది.. ఇప్పుడు తెలుగు తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.. ఈ ముద్దుగుమ్మ గురించి కొన్ని సంగతులు..

zareena3
-ఈ మధ్యకాలంలో సోషల్‌మీడియాలో ఒక ఫొటో పోస్ట్ చేసింది జరీనా. అందులోను దగ్గర ముడతలు ఉన్నాయి. సుమారు 50కిలోలు తగ్గినందుకే ఆ ముడతలు అన్నట్లు, తన బాడీని చూసి తాను ఏమీ సిగ్గుపడడం లేదంటూ పెద్ద పోస్ట్ పెట్టింది. దానికి నెటిజన్లు కూడా ఆమెను అభినందించారు.
-బాలీవుడ్‌లోకి అడుగు పెట్టకముందు జరీనా బరువు 100 కేజీలు.
-పంజాబీ సినిమాలో కూడా నటించిన ఈ అమ్మడికి అక్కడ తగిన గుర్తింపు రాలేదు. కానీ ఆ తర్వాత బాలీవుడ్‌లో తుమ్ హో సినిమాలో చేసిన పోల్ డ్యాన్స్ పాట ఆమెకు మళ్లీ గుర్తింపు తెచ్చిపెట్టింది.

zareena1
సల్మాన్..
-జరీనాకి మంచి ఫ్రెండ్. అందుకే తనే పర్సనల్ ట్రైనర్ మాట్లాడి మరి జరీనా బరువు తగ్గాలని అనుకున్నాడు.

-మధ్యలో చాలా సినిమాలు చేసింది జరీనా. కాకపోతే ఆమె హెవీ వెయిట్‌తో బాధపడడంతో సల్మాన్ బరువు తగ్గమని సలహా ఇచ్చాడట.
-జరీనా ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు. తన చెల్లి బాగోగులు ఎవరూ చూసుకునేవాళ్లు లేక.. జరీనా తన ఎడ్యుకేషన్‌ని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది.

zareena2
జరీనాకి పిల్లులంటే ప్రాణం. ఇంట్లో దాదాపు డజనుకు పైగా పిల్లులకు నివాసం కల్పించింది జరీనా. పిల్లుల కోసం ఒక గదిని కేటాయించింది. అంతేకాదు.. వాటి ఆలనాపాలనా చూసుకునేందుకు ఒక కేర్‌టేకర్‌ని నియమించింది ఈ అమ్మడు.
-జరీనా ఇన్‌స్టాలో తన ఫిట్‌నెస్ ఫొటోలను షేర్ చేసింది. ఆ తర్వాతే.. 100 రోజుల ఫిట్‌నెస్ చాలెంజ్ వచ్చింది. ఒక వెయిట్‌లాస్ పిల్స్ కంపెనీ జరీనాని ఆ సమయంలో తమ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించమని కోరింది.

481
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles