చిన్ని దేశాన్నే నిర్మించాడు..


Sun,October 20, 2019 12:24 AM

bigsize
సినిమాలోని విలన్ హీరోను చంపడానికి రౌడీలకు అర్థమయ్యేలా డిజైన్ చేసి చూపిస్తారు. దాన్నే మినియేచర్ డిజైన్ అంటారు. ఈ మినియేచర్ క్రియేటివిటీతో బిల్డింగులే కాదు రాష్ర్టాలను కూడా డిజైన్ చేస్తున్నారు. అది కాస్త దేశం వరకూ వెళ్లింది. మినియేచర్‌తో ఏకంగా దేశాన్నే సృష్టించాడు. అక్కడెలాంటి సౌకర్యాలుంటాయో అచ్చు అలానే తీర్చిదిద్దాడు. ఎన్నో రైల్లుంటాయి. అందుకే అతిపెద్ద మోడల్ ట్రైన్‌సెట్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌కెక్కింది. ఆ మినియేచర్ ప్రపంచాన్ని చుట్టొద్దాం రండి.

bigsize2
యూ రప్ ఖండంలోని జర్మనీ దేశం. 1,37,988 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగున్న దేశం. అంత పెద్ద దేశాన్ని మినియేచర్ డిజైన్‌తో చూపించడం అద్భుతం. ఇది మామూలు విషయం కాదు. దేశాన్ని సృష్టించి చూపించాడు మినియేచర్ వండర్‌లాండ్ సహా వ్యవస్థాపకుడు గెర్రిట్. ఫొటోలో కనిపిస్తున్న మినియేచర్ వండర్‌లాండ్‌లో సుమారు 1300 ట్రైన్లు ఉన్నట్లు గెర్రిట్ చెప్పాడు. ఇది రైళ్లకే ఫేమస్ కాదు. ఇందులో 1000కి పైగా కార్లున్నాయి. అందులో 300 కార్లను నడుపుతున్నారు. ఇవన్నీ భూమ్మీద నడుస్తాయి కాబట్టి తయారు చేయడానికి సులభం అనుకుంటాం. అందుకే గెర్రిట్ వీటికి భిన్నంగా 60 విమానాలు కూడా తయారు చేశాడు. ఇవి వివిధ దేశాలకు వెళ్తుంటాయి. విమానాలన్నీ జర్మనీ నుంచి మొదలై యూఎస్, స్కాండినేవియా, డెన్‌మార్క్, నార్వే, స్వీడాన్, ఫిన్‌లాండ్, స్విట్జర్లాండ్, ఇటలీ ఎయిర్‌పోర్ట్‌లన్నింటినీ చుట్టొస్తాయి. గెర్రిట్ ప్రస్తుతం వెనిస్ నగరాన్ని డిజైన్ చేస్తున్నాడు. దీంతోపాటు మున్ముందు మొనాకో, ఫ్రాన్స్ నగరాలను కూడా తీర్చి దిద్దనున్నాడు. ఇప్పటివరకు చేసిన నగరాలతో పోలిస్తే వెనిస్ నగరం నిర్మించడానికి రెండేండ్లు పట్టింది. ఒక్కో నగరాన్ని డిజైన్ చేసేముందు ఆ నగర ఫొటోను క్యాప్చర్ చేస్తారు. దాన్నిబట్టి డిజైన్ చేసుకుంటారు. అయితే తీసే ఫొటోల మీదనే డిజైన్ అధారపడి ఉంటుంది. ఎందుకంటే.. దేన్నయితే చూసి డిజైన్ చేస్తున్నారో అదే అందంగా లేకుంటే ఇక తయారు చేసేది అందంగా ఎలా కనబడుతుందన్నది గెర్రిట్ పాయింట్. ఆ విధంగా వెనిషియాన్, రియాల్టో బ్రిడ్జ్, పియాజ్జా శాన్ మాక్రో, వెనిషియాన్ కార్నివాల్ రీక్రియేట్ చేయడానికి అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేశారు.

bigsize3

మోడల్ ట్రైన్ పరిమాణం

మినియేచర్ వండర్‌లాండ్ అతిపెద్ద మోడల్ ట్రైన్ సెట్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కింది. ట్రైన్‌సెట్ పరిమాణం 15,525 అడుగుల ట్రాక్ ఉంటుంది. ఇది జర్మనీలోని హాంబర్గ్ మినియేచర్ వండర్‌లాండ్ వద్ద ఉంది. ఈ సెట్టింగుతో పిల్లలు చక్కగా ఆడుకుంటారు. ఈ నిర్మాణాన్ని చాలావరకు నేలపైనే చేస్తారు. ఎందుకంటే కొన్నిసార్లు రెండు ట్రైన్లు ఢీ కొట్టుకునేలా చేస్తారు. డామేజ్ అయిన వాటిని మరలా బాగుచేస్తారు. అలా చేసినప్పుడే పనిపై పట్టు వస్తుందంటున్నారు గెర్రిట్. ఇది అలవాటుగా మారింది. మినిచేయర్ డిజైనింగ్ మీద ప్యాషన్‌తో చిన్నవి చేసే స్థాయి నుంచి జర్మనీని క్రియేట్ చేయాలనే ఆలోచన వచ్చింది. అది కూడా ఇప్పటివరకు ఎవరూ చూడని, చేయని డిజైన్ అయ్యిండాలి. ఆ ఆలోచనే ఇప్పుడు గిన్నిస్ రికార్డుకెక్కింది.

lukas

ఆటోమేటిక్ సిస్టమ్

మినియేచర్ వండర్‌ల్యాండ్‌లో కనిపించే కార్లను ఇంధనంతో నడుపరు. ఇవన్నీ ఎలక్ట్రిక్ కార్లు. అంటే.. ఇవి ఎప్పటికప్పుడు చార్జ్ అవుతుంటాయి. రోబోలా అన్నమాట. కారు వెళ్తున్నప్పుడు స్పీడ్ తగ్గి నెమ్మదిగా వెళ్తుంటే దానికి బ్యాటరీ డౌన్ అయినట్లు నిర్ధారించాలి. ఆ కార్లను చార్జింగ్ స్టేషన్‌కు పంపించాలి. అతిపెద్ద కార్ చార్జింగ్ స్టేషన్ నుఫింగ్‌జెన్ సెక్షన్‌లో ఉంది. కార్ బ్యాటరీ డౌన్ అవ్వగానే వాటంతట అవే చార్జింగ్ స్టేషన్‌కు వెళ్లి చార్జ్ అవుతాయి. కార్లు ఆటోమేటిక్‌గా రన్ అయ్యేలా సిస్టమ్ తయారు చేశారు. కార్లు, విమానాలు, ట్రైన్లు ఇవన్నీ ఒక సిస్టమ్ ప్రకారం రన్ అవుతాయి. ఒకదానికొకటి సంబంధం లేకుండా ప్రోగ్రామింగ్ ఉంటుంది.
- లుకాస్, కార్ చార్జింగ్ స్టేషన్

gerard

ప్రతీది సవాలే..

ఇప్పటివరకు చాలా కన్‌స్ట్రక్షన్స్ చేశాం. పనిపరంగా చూస్తే వెనిస్ నగరాన్ని డిజైన్ చేయడం సవాలుగా మారింది. ఎందుకంటే ఈ నగర ప్లానింగ్‌కే ఎక్కువ సమయం పట్టింది. ఇది అన్ని నగరాలకంటే భిన్నంగా ఉంటుంది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే.. ఎయిర్‌పోర్ట్ డిజైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. విమానాలు లాండ్ అవ్వడానికి, టేకాప్ అవ్వడానికి ప్రోగ్రామ్ సెట్ చేయాలి. ఇదంతా సరైన సమయంలోనే జరుగాలి. ప్రోగ్రామ్‌లో ఏమాత్రం తప్పులు దొర్లినా అంతా నాశనం అవుతుంది. అనుకున్న సమయానికి ల్యాండ్ అవ్వాలి. రోడ్లపై తిరిగే మనుషులు, వాహనాలకు ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్ కూడా ఉంటాయి. వాటని కచ్చితంగా పాటించాలి. ఈ పద్ధతి కూడా ప్రోగ్రామ్‌తోనే రన్ అవుతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్, రూల్స్‌పై ప్రోగ్రామింగ్ చేయడం గెట్రిన్‌కు సవాలుగా మారింది.
- గెరార్డ్, కంట్రోల్ సెంటర్
bigsize1

362
Tags

More News

VIRAL NEWS