తమిళ జాతీయవాద పోరులో నేలకొరిగిన పెద్దపులి ప్రభాకరన్


Sun,June 2, 2019 12:58 AM

ఎల్‌టీటీఈ అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి ప్రభాకరన్. వేలుపిళ్లై ప్రభాకరన్ కొంతమందికి స్వాతంత్య్ర సమర యోధుడైతే, మరి కొందరికి మాత్రం ఒక క్రూరమైన తీవ్రవాది. శ్రీలంకలో మైనారిటీలైన తమిళుల కోసం స్వతంత్ర తమిళరాష్ట్ర స్థాపనే లక్ష్యంగా లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ)ని స్థాపించి 26 ఏళ్లపాటు గెరిల్లా పోరును సాగించినవాడు. స్వతంత్ర తమిళరాజ్యస్థాపన పోరులో ఆత్మాహుతి దాడులకు ఆజ్యం పోసిన వాడు. ఒక దేశాధ్యక్షుడు, ఒక మాజీ ప్రధానమంత్రి హత్య, మరో అధ్యక్షుడిపై హత్యాయత్నంతోపాటు ఎన్నో రాజకీయ హత్యలు, ఆత్మాహుతి దాడులు, వందలాది ప్రజలు, సైనికుల మరణానికి ప్రభాకరన్ బాధ్యుడంటారు. మూడు దశాబ్దాలలో అరవైవేల నుండి లక్షమంది వరకు అటు తమిళ టైగర్లు, ఇటు అమాయకులతో పాటు అనేకమంది నాయకులు మృతిచెందారు. చివరికీ శ్రీలంక సైన్యం జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పో యాడు. ప్రత్యేక తమిళరాజ్యాన్ని స్థాపించకుండానే తుదిశ్వాస విడిచిన ప్రభాకరన్ చివరిపేజీ.

-మధుకర్ వైద్యుల, సెల్: 9182777409

మామూలు ఆయుధాలు, 50 కంటే తక్కువ మం ది అనుచరులున్న స్థాయి నుంచి కేవలం దశాబ్దంలోనే ఎల్టీటీఈని పదివేల మంది సైన్యం ఉన్న ఒక సంస్థగా మార్చాడు ప్రభాకరన్. అంటే దానిని ఒక దేశ సైన్యానికే సవాలు విసరగలిగే స్థాయికి తీసుకొచ్చాడు. ఇద్దరు భారతీయుల నుంచే తను స్ఫూర్తి పొందానని ప్రభాకరన్ చెప్పేవాడు. వారిలో ఒకరు భగత్ సింగ్ అయితే, ఇంకొకరు సుభాష్ చంద్రబోస్. వారి స్ఫూర్తితో శ్రీలంకలో తమిళ జాతీయవాదాన్ని లేవనెత్తిన ప్రభాకరన్ తుదివరకు తను నమ్మిన సిద్ధాంతం కోసం పాటు పడ్డాడు. దేశంలో హింసావాదాన్ని నివారించేందుకు పలు దఫాలుగా సాగించిన చర్చలు విఫలం కావడంతో శ్రీలంక ప్రభుత్వం తుదిపోరుకు సిద్ధమైంది. 2009 నుంచి పూర్తిస్థాయిలో తమిళ టైగర్ల ఏరివేతే లక్ష్యంగా శ్రీలంక సైన్యం ముందుకు సాగింది. 2009 మార్చి నుంచి పోరు మరింత తీవ్రమైంది.సైన్యం దూకుడు పెంచి చేస్తున్న దాడుల కారణంగా ఉత్తర శ్రీలంకలో తమ స్వాధీనంలో ఉన్న చాలా భూభాగాన్ని టైగర్లు కోల్పోయారు. 2003 నుంచి ఆరేళ్లుగా కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం 2008లో రద్దయింది. ఇరుపక్షాలూ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే దీనికి కారణం. తమిళ టైగర్ల రాజకీయ గురువు బాలసింగం నశన్ విలేకరులతో మాట్లాడుతూ, తాము గెరిల్లా సంస్థగా పోరాడుతున్నామని, ఉత్తర ప్రాంతంలో తమ ఆధీనంలో ఉన్న భూభాగంలో చాలా ప్రాంతాన్ని కోల్పోయినప్పటికీ తాము పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఒకవైపు ప్రభాకర్ లొంగిపోవాలని హెచ్చరిస్తూనే శ్రీలంక సైన్యం తమిళ పులులపై విరుచుకు పడింది. 2009 మే మొదటివారం నాటికి ఎల్‌టీటీఈ ఆధీనంలో ఉన్న పలు ప్రాంతాలను సైన్యం స్వాధీనం చేసుకుంది.
Karunakaran

అలాంటి వాటిలో ఎల్టీటీఈకి కంచుకోటగా ఉన్న వ్యూహాత్మక ఈశాన్య పట్టణం పొన్నేరన్‌ను శ్రీలంక సైనిక దళాలు స్వాధీనపర్చుకున్నాయి. దీంతో 20 ఏళ్ల తర్వాత లంక తమిళుల గుండెకాయ జాఫ్నాకు రోడ్డు మార్గాన్ని తెరిచేందుకు వీలు కలిగింది. గత కొద్ది వారాలుగా తమిళ తిరుగుబాటుదారులతో తీవ్రమైన యుద్ధం లో మునిగితేలుతున్న లంకసైన్యం టైగర్ల పట్టులో ఉన్న ప్రధాన పట్టణంలోకి తొలిసారిగా ప్రవేశించాయి. టైగర్స్ కార్యకలాపాలకు ముఖ్యకేంద్రంగా ఉన్న పొన్నేరన్ పట్టణం వశపర్చుకోవడంతో పాటు జాఫ్నా నగరానికి వెళ్లే ఎ-32 తీరప్రాంత రహదారిని శ్రీలంక బలగాలు విముక్తం చేశాయి. సైనికదళాలకు వత్తాసుగా లంక ఎయిర్‌పోర్స్ జాప్నా నగరం చుట్టూ ఉన్న టైగర్ల బంకర్లపై బాంబుల వర్షం కురిపించాయి. పొన్నేరన్ పతనంతో శ్రీలంక సైనిక బలగాలు జాఫ్నా నగరానికి దళాలను భూమార్గంలో పంపడానికి వీలు కలిగింది. జాఫ్నాలో అడుగుపెట్టిన శ్రీలంక సైనిక దళం జాఫ్నా దీవుల్లో అణువణువునా గాలింపు మొదలు పెట్టింది. పులుల రాజధానిగా పేర్కొనే జాఫ్నా దీవులు సైన్యం చేతుల్లోకి వెళ్లడంతో పెద్దపులి ఓటమిని అంగీకరించే పరిస్థితి ఎదురవుతుందని సైన్యం భావించింది. ఎల్టీటీఈ అధినేత తలదాచుకుంటున్నట్లు భావిస్తున్న నేలమాళిగను కనుగొన్న శ్రీలంక సైన్యం టైగర్ల స్థావరంగా ఉన్న ములైతీవులను భారీస్థాయిలో చుట్టుముట్టింది. ములైతీవుల అటవీప్రాంతం నుంచి చీమ కూడా బయటకువెళ్లకుండా ఆ ప్రాంతాన్నంతటినీ దిగ్బంధనం చేశారు. ప్రభాకరన్‌తోపాటు ఎల్టీటీఈ సీనియర్ నేతల జాడ కోసం అడవిలోని ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా గాలించారు. ఇందుకోసం సైనిక హెలికాఫ్టర్లను రంగంలోకి దించారు. ఇదిలావుండగా ముైల్లెతీవు నుంచి ఉన్న సముద్ర మార్గాలన్నింటినీ శ్రీలంక నౌకాదళం రంగంలోకి దిగి దిగ్బంధనం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభాకర్‌ను పట్టుకుని తీరతామని శ్రీలంక రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు.

కాగా ప్రభాకరన్ అప్పటికే శ్రీలంక నుంచి పరారై ఉండొచ్చనే ఊహాగానాలు సాగాయి. సైన్యం ముైల్లెతీవుల అడవుల్లో ప్రవేశించగానే ఎల్టీటీఈ అధినేత తన స్థావరం విడిచిపెట్టివుండొచ్చని భావించారు. అయితే ఆయన ఎక్కడ తల దాచుకున్నారనే విషయమై ఆసక్తికరమైన చర్చ జరిగింది. సమీపంలోని భారత్‌లో అడుగుపెట్టే అవకాశం లేదని, దక్షిణాసియాలోని ఏదేనీ దేశానికి నౌకామార్గంగుండా వెళ్లి ఉండొచ్చని భావించారు. కాగా లంక నౌకా దళం ఎల్టీటీఈ ప్రధాన నౌకాశ్రయంపై దాడి చేసి నాలుగు ఎల్టీటీఈ పడవలను ధ్వంసం చేసింది. ఈ ఘటనలో 16 మంది టైగర్లు హతమైనట్లు సమాచారం. ఒకవైపు యుద్ధం సాగుతున్న సమయంలోనే ప్రభాకరన్ లొంగిపోతే శ్రీలంక ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టేందుకు సిద్ధంగా ఉందని వికీలీక్స్‌తో పాటు పలు చానల్స్ ప్రచారం చేశాయి. ఎల్‌టీటీఈ విషయమై అమెరికా రాయబారి రాబర్ట్, భద్రతా కార్యదర్శి కోదపపాయ రాజపక్సేల మధ్య జరిగిన భేటీ సందర్భంగా ఈ విషయం చర్చకు వచ్చినట్లు వికీలీక్స్ పేర్కొ ంది. ప్రభాకరన్ కు బహి రంగంగా క్షమాభిక్ష ప్రసాదించేందుకు శ్రీలంక సుముఖత వ్యక్తం చేసినట్లు కొలంబియా టెలిగ్రాఫ్ పత్రిక కూడా వెల్లడించింది.

వరుస విజయాలతో ముందుకు సాగుతున్న శ్రీలంక సైన్యం తమిళ పులుల కంచుకోటల్లో ఒకటైన కిలినోచ్చి పట్టణం శివార్లను చేరుకుంది. తమిళ పులుల ఆధినాయకుడు వేలుపిళ్లై ప్రభాకరన్ ఇకపై బోనులో బంధించబడిన పులి లాంటివాడేనని శ్రీలంక సైన్యాధిపతి శరత్ పేర్కొన్నారు. తమిళ పులుల బలమైన స్థావరం కిలినోచ్చి పట్టణానికి తమ సైన్యాలు నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని శరత్ చెప్పారు. అదేసమయంలో ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ దాక్కున్న రహస్య స్థావరాన్ని సైతం తాము తెల్సుకోగలిగామని లంక సైన్యం పేర్కొంది. సైన్యం ప్రకటించినట్లే తమిళ పులుల రాజకీయ ప్రధాన కేంద్రంగా ఉన్న కిలినోచ్చిని హస్తగతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో, టైగర్లు వాస్తవాన్ని గమనించి ఇప్పటికైనా లొంగిపోవాలని అప్పటి దేశాధ్యక్షుడు మహింద్రా రాజపాక్సే ఎల్టీటీఈకి పిలుపిచ్చారు. ఎల్టీటీటీకి తానిచ్చే చివరి సందేశం ఇదేనని రాజపాక్సే చెప్పారు. తమిళ టైగర్ల ఆధీనంలో ఉన్న కిలినోచ్చిని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా శ్రీలంక సైన్యం చారిత్రాత్మక విజయం సాధించిందని, పేర్కొన్నారు. కిలినోచ్చిని చేజార్చుకోవడం ఎల్టీటీకీ ఎదురుదెబ్బే. పదేళ్లుగా టైగర్లు కిలినోచ్చిని స్వతంత్ర దేశ నిర్మాణానికి తగినట్లుగా నిర్మించారు. స్వంత పోలీసులను, కోర్టులను, పన్నుల అధికారులను ఈ పట్టణంలో నియమించారు.
కిలినోచ్చిని హస్తగతం చేసుకున్న సైన్యం ఎల్టీటీఈ సైనిక కార్యాల యం ఉన్న ముైల్లెతీవు ను స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేసింది. గత 28 ఏళ్లు గా జరుగుతున్న వేర్పాటువాద యుద్ధాన్ని అంతమొందించే దిశగా సాగుతున్న శ్రీలంక సైన్యం టైగర్ల స్థావరప్రాంతాల లోపలకు దూసుకెళ్లడం ఇదే మొదటిసారి కావడం విశేషం. లంక ఎంఐ-14 హెలికాప్టర్లు పశ్చిమ ముల్లైతీవులోని తిరుగుబాటుదారుల స్థావరాలపై దాడిచేశాయి. దీంతో టైగర్లు వెనుకంజ వేయక తప్పలేదు. కిలినోచ్చి పతనంతో ఎల్టీటీకీ ఇక ముల్లైతీవు ప్రాంతం మాత్రమే మిగిలింది. ముైల్లెతీవులోని ఎల్టీటీఈ పులులపై ప్రభుత్వ దళాలు సాగించిన కాల్పుల్లో నలుగురు ఎల్టీటీఈ అగ్రనేతలు కూ డా హతమయ్యారు. వీరిని ప్రభాకరన్ పెద్ద కుమారుడు ఛార్లెస్ ఆంథోనీ, నదేశన్, రమేష్, సేవరత్నం పులేదేవన్లుగా గుర్తించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ముల్లైతీవు పట్టణానికి సమీపంలోని ప్రాతంలోనే ప్రభాకరన్ దాక్కుని ఉన్నాడని సైన్యం తెలిపింది. తమ దళాలు ప్రభాకరన్ రహస్య స్థావరాన్ని సైతం సమీపిస్తున్నాయని తెలిపారు. అదేసమయంలో తాము లొంగిపోయే ప్రసక్తే లేదని ఎల్టీటీఈ వర్గాలు తేల్చి చెప్పాయి.
Karunakaran1

మే 19, 2009

ముైల్లెతీవు ఉత్తరాన 40 కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించిన ప్రాంతంలో ఎల్టీటీఈ ప్రస్తుతం దిగ్బంధించబడి ఉందని ఆర్మీ ఛీఫ్ శరత్ ప్రకటించారు. ఎల్‌టీటీఈ అధినేత ప్రభాకరన్ దాగి ఉన్నాడని భావిస్తున్న ముల్లైతీవును సైన్యం చుట్టుముట్టింది. లొంగిపోవాలంటూ శ్రీలంక ప్రభుత్వం ఇచ్చిన అల్టిమేటంను ప్రభాకరన్ బేఖాతరు చేయడంతో నో ఫైర్ జోన్‌లోకి చొచ్చుకొని పోయిన మిలటరీ బలగాలు పుతుమధాలన్ ఆసుపత్రిని స్వాధీనం చేసుకున్నాయి. పెద్దపులి లొంగుబాటుకు ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. 24 గంట ల్లో లొంగిపోవాలంటూ ప్రభుత్వం చేసిన హెచ్చరికను పెద్దపులి పెడచెవిన పెట్టింది. గడువు ముగిసినా ప్రభాకరన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇక సైన్యం రంగంలోకి దిగింది. టైగర్లకు గట్టి పట్టున్న ప్రాంతాలపై దాడులు ప్రారంభించింది. సైనిక దళాలతో సుమారు రెండున్నర గంటలపాటు ప్రభాకరన్ సేన ఎదురు కాల్పులకు దిగింది. తుదిపోరులో ప్రభాకరన్ మృతి చెందాడని సైన్యం ప్రకటించింది. ఈ దాడిలో ప్రభాకరన్‌తో పాటు 170 మంది ఎల్టీటీఈ తీవ్రవాదులు మృతి చెందారని సైన్యం ప్రకటించింది. ప్రభాకరన్ మృతదేహం ఫొటోలను పలు టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. తరువాత ప్రభాకరన్ చిన్న కుమారుడు బాలచంద్రన్, భార్య మథివథాని, కుమార్తె దువరాగల మృతదేహాలను కూడా శ్రీలంక సైన్యం కనుగొన్నదని అధికారులు ధృవీకరించారు. మరునాడు ప్రభాకరన్ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేసినట్లు శ్రీలంక ఆర్మీ చీఫ్ జనరల్ శరత్ ఫోన్సెకా తెలిపారు. అతని చితాభస్మాన్ని సమీపంలోని హిందూ మహాసముద్రంలో కలిపామని వివరించారు.

ఎల్‌టీటీఈ నాయకుడు ప్రభాకరన్ చిన్న కుమా రుడు బాలచంద్రన్ ప్రభాకరన్ (12) ను శ్రీలంక సాయుధ బలగాలు కిరాతకంగా హతమార్చాయి. సుదీర్ఘపోరులో ప్రభాకరన్‌ను హతమార్చిన శ్రీలంక సైన్యం ఆయన కుమారుడిని అక్కడే కస్టడీలోకి తీసుకుంది. కానీ ఎల్‌టీటీఈ తిరుగుబాటుదారులపై జరిపిన ఎదురు కాల్పుల్లోనే బాలచంద్రన్ ప్రభాకరన్ మరణించాడని చెప్పింది. కానీ నో వార్ జోన్ : శ్రీలంక హంతక క్షేత్రాలు పేరుతో ప్రసారం చేసిన తాజా డాక్యుమెంటరీలో కొన్ని పోటోలు బయటకు వచ్చా యి. బాలచంద్రన్ ఎదురు కాల్పుల్లో గానీ, ఎల్‌టీటీఈ పై పోరులో గానీ మరణించలేదు అనడానికి ఈ పొటోలే ప్రధాన సాక్ష్యాధారాలు అని పత్రికలు పేర్కొన్నాయి. బాలచంద్రన్ ప్రభాకరన్‌ను తమ కస్టడీలో ఉండగా ఉద్దేశపూర్వకంగానే శ్రీలంక సైన్యం హతమార్చిందనే విషయాన్ని ఇవి రుజువుచేశాయి. అమా నుషంగా 12 ఏళ్ళ బాలుడిని హత్య చేయడంపై మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా నిరసించాయి.
Karunakaran2

755
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles