వాస్తు


Sun,May 19, 2019 01:15 AM

vasthu

ఇంటికి చుట్టూ రెండు కాంపౌండ్ వాల్స్ పెట్టొచ్చా?

- యాదిరెడ్డి, షామీర్‌పేట
ప్రాకారాలు మూడు , ఐదు ఆలయాలకు నిర్మించడం శాస్త్రీయం, ఇంటికి తప్పనిసరి అని లేదు. కొందరు ఇంటి ప్రహరీకి ఆనుకుని చెట్లు పెంచుతూ ఉంటారు. వాటిని కాపాడుకోవడానికి ఫెన్సింగ్ వేస్తుంటారు. కొందరు చైన్ లింక్‌మెష్‌లో పటిష్ఠత ఏర్పాటు చేసుకుంటారు. మీరు ఏ విధానం కోసం అడుగుతున్నారో చెప్పలేదు. ఫామ్స్‌లో పెద్ద తోటలో కూరగాయలు మీ స్థలంలో మీ ఇంటి చుట్టూ ఖాళీ ఉంటే వాటికోసం పూర్తి క్షేత్రం చుట్టూ కాంపౌండు కట్టుకోండి. లేదా.. ఇంటికి రెండు కాంపౌండ్లు కావాలి అనుకుంటే నిర్దిష్టకొలతలతో తూర్పు ఉత్తరాలు సమాంతర కొలతలు పాటిస్తే దక్షిణ పడమరలు ఎత్తు వచ్చేలా కాంపౌండ్లు కట్టవచ్చు. ఏదైనా తప్పక అవసరం, రక్షణ కొరకు మాత్రమే అయితే కట్టండి.

మా స్థలానికి నాలుగు వైపులా రోడ్డు ఉంది మూడు దిక్కులు షాపులు వేయవచ్చా?

- జి. గాయత్రి, సరూర్‌నగర్
స్థలం ఎక్కువ వైశాల్యంలో ఉన్నప్పుడు నాలుగువైపులా రోడ్లు వచ్చినప్పుడు వీధుల ప్రాధాన్యాన్ని బట్టి ఆయా రోడ్లకు షాపులు వేయడం దోషం కాదు. ఇల్లు, షాపులు వేయడం సహజంగా ఉంటుంది కాబట్టి దిశ ప్రధానంగా తూర్పు, ఉత్తరం గేట్లు తప్పక వచ్చేలా ఇల్లు కట్టాలి. దక్షిణం, పడమర, పూర్తిగా ఆ దిశలకు ఫేస్ ఉండేలా షాపులు వేయండి. ఇక మిగిలిన తూర్పు భాగాన్ని వదిలివేయండి. ఉత్తరం కూడా షాపులు వేయాలంటే ఉత్తర ఈశాన్యంలో గేటు వచ్చేలా ఒక షాపు మందం స్థలం వదిలివేయాలి. అదేవిధంగా అన్నివైపులా షాపులు వేసుకోవచ్చు. అయితే మీ ఇంటికి సంబంధించిన ప్రహరీ మాత్రం తప్పనిసరిగా చుట్టూ కట్టుకోవాలి. దక్షిణ పడమరల షాపుల గోడలు, ఉత్తరం షాపు గోడలు కాంపౌండ్ గోడగా వాడవద్దు. ఇంటి చుట్టూ ఖాళీ వదిలి(ప్రదక్షిణం) ఇల్లు ప్లాను చేయండి.

ఇంటిమీద (టెర్రస్) స్టాఫ్‌రూమ్స్ వేయవచ్చా?

- రఘు, జగిత్యాల
మనం నివసించే ఇంటిమీద పనిచేసే స్టాఫ్ గది ఉంటే మన కన్నా ఎత్తు మీద ఉండడం తప్పు అనుకుంటారు చాలా మంది. అపార్టుమెంట్లలో ఎవరు ఎవరి నెత్తిమీద ఉంటారో ఎవరికీ తెలియదు. స్టాఫ్‌రూమ్స్ టెర్రస్‌మీద వేయండి. ఆ గదులు ఎన్ని కావాలి అనే దాన్ని బట్టి దక్షిణం మధ్య లేదా, పడమర మధ్య వేయవచ్చు. దక్షిణ నైరుతి గది యజమాని తనకొరకు వాడుకునేలా పెట్టుకోవాలి. నైరుతి కాకుండా ఎటువైపు గదులు వేసి ఇచ్చినా దోషం లేదు. ఆ గదుల కింద మన ఇంట్లోని మిగతా బెడ్‌రూములు ఉంటాయి అని దిగులు పడాల్సిన అవసరం లేదు. కేవలం పై కప్పులమీద నైరుతి, ఈశాన్యం గదులు మాత్రం యజమానులు వాడాలి. మిగతావి ఎవరు వాడినా ఫరవాలేదు.

సెల్లార్ నుంచి మెట్లు వేసుకొని పై అంతస్తులకు వెళ్లొచ్చా? లోపలి నుంచి?

- సిలివేరు అరుణ, జాడికల్
సెల్లార్ అంటే భూమి లోపలికి సెల్లారు వేయడం. సెమీ సెల్లార్ తీయడం అని.. రెండు రకాలు మీరు వివరంగా రాయలేదు. 5 అడుగులు భూమి నుంచి లోతుకు 4 అడుగులు రోడ్డు నుంచి పైకి లేపి స్లాబ్ వేయడం సెమీ సెల్లార్ అవుతుంది. సెమీ సెల్లార్ కాకుండా పది అడుగుల సెల్లార్ నుంచి మెట్లు తీసుకోవద్దు. లిఫ్ట్ పెట్టుకోవచ్చు. మెట్లు తప్పక కావాలి అంటే నిర్మాణం మధ్య కాకుండా.. ఇంటికి తూర్పు ఆగ్నేయంలో లేదా ఇంటికి వాయువ్యంలో బయటి నుంచి మెట్లు వేసుకోవాలి. కింద కారు ఆపి మెట్ల గుండా ఇంటి లోపలికి వెళ్లాలి. లిఫ్టు, మెట్లు కావాలంటే సాధారణ స్టిల్ట్ రూఫ్ అంటే భూమి మీద గ్రౌండు ఫ్లోర్ వదిలి ఫస్ట్‌ఫ్లోర్ నిర్మాణం చేస్తే కింది నుంచి తీసుకోవచ్చు. ఏది ఏమైనా ఇంటినుంచి మధ్యలో భూమిలోకి దిగే మెట్లు పనికి రావు.
SUDHHALA
సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678

271
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles