రాశి ఫలాలు


Sun,May 19, 2019 01:07 AM

19-5-2019 నుంచి 25-5-2019 వరకు

మేషం

ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆత్మీయులతో సుహృద్భావ వాతావరణం ఉంటుంది. వాహనాల కొనుగోలు వ్యాపారం, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉన్న వారు సంతృప్తిగా ఉంటారు. చిన్న చిన్న వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. నిత్యావసర వస్తు వ్యాపారం, సాహిత్య, సంగీతం, హోటలు, క్యాటరింగు, పనులలో అనుకూలత ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలం. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. తోటి ఉద్యోగస్తులతో, పై అధికారులతో మనస్పర్థలు ఉంటాయి. ఆర్థిక సమస్యల వల్ల పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.

వృషభం

శుభకార్యాలు కలిసివస్తాయి. ఉన్నత విద్యకు అనుకూలం. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. సంతోషంగా, హాయిగా గడుపుతారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో ఇబ్బందులు ఉంటాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాలలో ప్రతికూల ఫలితాలు ఉంటాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందకపోవచ్చు. పెద్దల సూచనలను పాటించకపోవడంతో కొత్త సమస్యలు ఎదురవుతాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణరంగంలో ఉన్న వారికి న్యాయ, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. వాహనాల వల్ల వృథా ఖర్చులు ఎదురవుతాయి. అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మిథునం

శుక్రుడు తప్ప మిగిలిన గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. భార్యా పిల్లలతో చర్చించి పనులు చేయడం వల్ల కొంత కలిసివచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు తోటి వారి, పై అధికారుల వల్ల మనస్థాపానికి గురి కావాల్సి వస్తుంది. ప్రారంభించిన పనులు పూర్తికాకపోవచ్చు. పిల్లల శుభకార్యాలు కార్యరూపం దాల్చకపోవచ్చు. అనవసరమైన ప్రయాణాలు, చేయాల్సి వస్తుంది. వృథా ఖర్చులుంటాయి. పెద్దల మాట వినకపోతే కొత్త సమస్యలు ఎదురవుతాయి.

కర్కాటకం

ప్రధాన గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. ఆలోచించి పనులు చేస్తే మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. పనులను సకాలంలో పూర్తిచేస్తారు. మంచి పేరు పొందుతారు. ఆర్థిక లాభాలనూ పొందుతారు. రాజకీయ, కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారం సజావుగా సాగుతుంది. రాజకీయంలో ఉన్న వారికి కార్యకర్తలతో మంచి సంబంధాలు నెలకొంటాయి. శుభకార్యాలు చేస్తారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంచివారితో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. పనివారితో అనుకూలత పెరుగుతుంది.

సింహం

ప్రధాన గ్రహాలు గురు, శని ప్రతికూలంగా ఉన్నాయి. అయినా మిగతా గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. కాబట్టి తాత్కాలిక ప్రయోజనాలు ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. అన్నదమ్ములు, బంధువులు, వాహనాలతో పనులు నెరవేరుతాయి. ప్రయాణాలు బాగా కలిసివస్తాయి. నిత్యావసర వస్తు వ్యాపారం, షేర్, వడ్డీ, వస్త్ర, ఫ్యాన్సీ, హోటలు, క్యాటరింగు, సుగంధ ద్రవ్యాలు మొదలైన వ్యాపారాలలో ఉన్న వారు తాత్కాలిక లాభాలను పొందుతారు. ఆదాయం కొంత పెరుగుతుంది.

కన్య

శుక్రుడు మినహా, అన్ని గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. పనిలో నిబద్ధత అవసరం. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తికాకపోవచ్చు. శుభకార్యాల ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. అనవసర విషయాలకు ప్రాధాన్యం ఇచ్చి సమయాన్ని వృథా చేసుకుంటారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలలో ఆటంకాలు ఉంటాయి. రావాల్సిన డబ్బు అందకపోవచ్చు. పనివారితో ఇబ్బందులు ఉంటాయి. వాహనాల వల్ల ఖర్చులుంటాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

తుల

వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. శుభకార్య ఆలోచనలు ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరు పొందుతారు. మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలు తీరుతాయి. ఆదాయం పెరుగుతుంది. పనివారితో సమస్యలు పరిష్కారం అవుతాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. నదీస్నానాలు ఆచరిస్తారు. చాలా విషయాలలో మంచి జరిగే అవకాశం ఉంది. అనవసరమైన విషయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా పనులు చేసుకుంటూ వెళ్లడం మంచిది. ఆస్తుల విషయంలో తగాదాలు ఎదురవొచ్చు.

వృశ్చికం

అన్ని గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త ఉండాలి. ఓర్పు, నిబద్ధత అవసరం. తోటి ఉద్యోగులతో, పై అధికారులతో, కింది స్థాయి ఉద్యోగులతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాజకీయ, కోర్టు వ్యవహారాలలో ప్రతికూల ఫలితాలుంటాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. రావాల్సిన డబ్బు అందకపోవచ్చు. నిత్యావసర వస్తు, షేర్, వడ్డీ వ్యాపారాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగకపోవచ్చు. వృథా ఖర్చులు, అనవసర ప్రయాణాలు ఉంటాయి.

ధనుస్సు

ప్రధానగ్రహాలు ప్రతికూలంగా ఉన్నా శుక్రుడు, రవి, బుధుల సంచారం అనుకూలంగా ఉంది. దీంతో తాత్కాలికంగా లాభాలు, సంతృప్తి ఉంటుంది. వ్యాపారం అనుకూలిస్తుంది. నిత్యావసర వస్తు, షేర్, వడ్డీ వ్యాపారం, హోటలు, క్యాటరింగు, వస్త్ర, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్యాల వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. భార్యా పిల్లలతో సంతృప్తిగా గడుపుతారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. ఆఫీసులో తోటి వారితో మంచి వాతావరణం ఉంటుంది. ప్రారంభించిన పనులు పూర్తికాకపోవచ్చు. శుభకార్య ప్రయత్నాలలో ఆటంకాలుంటాయి. వృథా ఖర్చులుంటాయి.

మకరం

ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రద్ధతో, నిబద్ధతతో పనులు చేస్తారు. మంచివారితో సంబంధాలు పెరుగుతాయి. పనులు నెరవేరుతాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్నదమ్ములు, బంధువులతో అనుకూలత పెరుగుతుంది. వాహనాలు, నూతన వస్త్ర, వస్తువులను కొంటారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. ఉద్యోగంలో తోటి వారితో మనస్పర్థలు గోచరిస్తున్నాయి. ఆర్థిక సమస్యల వల్ల కొన్ని పనులు వాయిదా పడతాయి. రోజువారీ వ్యాపారాలలో ఇబ్బందులుంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెడతారు.

కుంభం

వ్యాపారం అనుకూలిస్తుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి. ఆదాయం పెరుగుతుంది. పనివారితో సమస్యలు పరిష్కారం అవుతాయి. పెద్దల సహాయ సహకారాలు ఉంటాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలు చేస్తారు. ఆధ్యాత్మికతకు ప్రాధాన్యం ఇస్తారు. తోటి ఉద్యోగులతో, పై అధికారులతో గొడవలు ఉండే అవకాశం ఉంది. రాజకీయంలో కార్యకర్తలతో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రారంభించిన పనులు సకాలంలో కాకపోవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం.

మీనం

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఉన్న వారికి ఆఫీసులో తోటి వారితో, పై అధికారులతో మంచి సంబంధాలు ఉంటాయి. ఆఫీసులో మంచి పేరును పొందుతారు. రాజకీయంలో ఉన్న వారికి జనాదరణ పెరుగుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటారు. పెద్దల సూచనలను పాటించక పోవడంతో కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. రోజువారీ వ్యాపారాలలో పనివారితో ఇబ్బందులు ఉంటాయి. న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి రావాల్సిన డబ్బు సకాలంలో అందకపోవచ్చు.
rasi-phalalu
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., ఫోన్: 040-27651530
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in

3342
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles