ఆ 30 నిమిషాలు..


Sun,December 15, 2019 12:36 AM

అవును! అతన్ని కాల్చింది నేనే.. 400లకు పైగా ఆపరేషన్లలో నేను పాల్గొన్నాను. కానీ అప్పటి మా టార్గెట్ పెద్దది. అతన్ని వేటాడే బృందంలో నేనొక్కడిని. తొలుత రహస్య స్థావరాన్ని కనుగొన్నాం. పథకం ప్రకారమే దాన్ని ఛేదించాం. అడ్డుగా వచ్చిన వాళ్లను కాల్చేశాం. అందులో ఆయన కుమారుడు కూడా ఉన్నాడు. 30 నిమిషాల్లో మేం అనుకున్న మిషన్ పూర్తి చేశాం అతను చెప్పడం పూర్తి చేశాడు. 2014లో ఓ సమావేశంలో మాజీ నేవీ సభ్యుని మాటలివి...

-వినోద్ మామిడాల, సెల్: 7660066469

మూడేండ్ల క్రితం.. మే, 2, 2011, అబొట్టాబాద్. ఇస్లామాబాద్‌కు 120 కిలోమీటర్ల దూరం..ప్లాన్ పక్కాగా వర్కౌట్ అవుతున్నది. అనుకున్న టార్గెట్‌కు అతి దగ్గరలో ఉన్నారు పోలీసులు..రహస్య గది.. చుట్టూ అంతా చీకటి అయినా నైట్ విజన్ అద్దాల్లో అంతా కనిపిస్తున్నది. ఎదురుగా టార్గెట్... చేతిలో ఏకే-47.. రైఫిల్ పైకి లేపి రెండుసార్లు నొక్కిన ట్రిగ్గర్..బ్యారెల్ నుంచి దూసుకెళ్తున్న బుల్లెట్లు...ఒక నిశ్శబ్దం.. ఎన్నో ఏండ్ల అన్వేషణ, క్షణక్షణం ప్రపంచం ఎదురు చూస్తున్న సమయం.. ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేసిన ఓ ఉగ్రవాది హతం.. అతని పేరు వినాలంటేనే కష్టం.. అతని పనులు చూస్తే భయాందోళన కరం..అతని చరిత్ర అంతా హింసోన్మాదం..అతన్ని చూడాలంటే ప్రాణాలు పోయినట్టే.. మరి చంపాలంటే...?ఆ పేరు బిన్ లాడెన్.. ఒసామా బిన్ మహ్మద్ బిన్ అవాద్ బిన్‌లాడెన్..
అతను అల్‌కాయిదా ఉగ్రవాద సంస్థ అధినేత.
chivari-page

మే 2, 2011 అర్ధరాత్రి దాటిన తర్వాత..

పాకిస్థాన్‌లోని అబొట్టాబాద్‌లో లాడెన్ రహస్య స్థావరంలో సీల్స్ ఆపరేషన్ మొదలైంది. మూడంతస్థుల భవనం వజిరిస్థాన్ హవేలీ చుట్టూ ప్రహరీ ఉంది. ఏహెచ్-64 బ్లాక్‌హ్యాక్ హెలికాప్టర్ బిల్డింగ్‌పై చక్కర్లు కొడుతున్నది. చిమ్మని చీకటి. అంతా నిర్మానుష్యం. హెలికాప్టర్ నుంచి కొందరు కమాండోలు తాళ్లతో బిల్డింగ్‌పైకి దిగారు. బిన్‌లాడెన్ ఆ ఇంట్లో ఉన్నట్టు పక్కాగా తెలుస్తున్నది. కానీ ఇంకా నిర్ధారణ కాలేదు. మనిషి మాత్రం కనిపించలేదు. అతన్ని చంపడానికి వెళ్తున్నది సీల్స్ బృందం. ఎక్కడ, ఎవరూ, ఏం చేయాలనే అంశాలపై పకడ్బందీగా సిద్ధమయ్యారు. హెలిక్యాప్టర్ నుంచి దిగి లోనికి ప్రవేశించారు. అక్కడేమైనా జరగవచ్చు. బిన్‌లాడెన్‌ను చంపవచ్చు! లేదా వీళ్లే మరణించవచ్చు...!!సీల్స్ దళాలు కాంపౌండ్ వాల్‌ను దాటుకొని ముందుకు వెళ్తున్నాయి. అక్కడ అంచెలంచెలుగా రక్షణ వ్యవస్థ ఉంది. వాటిని ఛేదిస్తూ ముందుకు వెళ్తున్నారు కమాండోలు. చివరి అంచె వరకూ చేరుకున్నారు. అక్కడ లాడెన్ రక్షకులు ఎదురయ్యారు. వాళ్లను తుపాకులతోనే పలకరించారు కమాండోలు. చివరగా ఓ ఇనుప గేట్. దాన్ని దాటితే లాడెన్ కనిపించడం ఖాయం. ఆ ఇనుప గేట్‌ను కూల్చేశారు. ఆశ్చర్యం కలిగింది. లాడెన్ కనిపిస్తాడనుకున్న వాళ్లకు మరో పెద్ద గోడ కనిపించింది. శత్రువులను తప్పు దోవ పట్టించడానికి ఇలాంటి ఇనుప గేటు పెట్టాడంటే లాడెన్ స్థావరం ఖచ్చితంగా ఇదే అయుంటుందని నిర్ధారణకు వచ్చారు. కేవలం ఒకే అడుగు.. ముందుకెళ్తే లాడెన్‌ను చంపడమో.. లేక లాడెన్ మనుషుల చేతిలో కమాండోలు చనిపోవడమో.. ఏది జరిగినా సాహసమే.. చరిత్రే..

ఒక్కో గదిని దాటుకుంటూ వెళ్తున్నారు కమాండోలు. కొన్ని గదుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారు. మరి లాడెన్ ఎక్కడ ఉన్నట్టు? ఈ ప్రశ్నకు జవాబు కావాలంటే ముందు లాడెన్ కుమారుడు ఖలీద్‌ను కనిపెట్టాలి. 23 ఏండ్లు ఉంటాయి. అతన్ని ఎక్కడ కనిపెడితే అక్కడున్న గదిలో లాడెన్ ఉన్నట్టే అని నిఘా సమాచారం ఉంది కమాండోల దగ్గర. ఇప్పుడు ఖాలిద్‌ను గుర్తించాలి. అంటే అతన్ని బయటకు రప్పించాలి. దీనికోసం ఓ ప్లాన్ ఉంది వాళ్ల దగ్గర. ఖలీద్ ఇలా రా రెండే రెండు పదాలు.. బాగా దగ్గరివాళ్లు పిలిచినంత సహజంగా ఉండాలి. అలా ఉండేందుకు సీల్స్ బృందంలో ఓ సభ్యుడు అరబ్బీ, ఉర్దూలో ప్రాక్టీస్ చేశాడు. ప్లాన్ ప్రకారం. ఖలీద్ ఇలా రా అని చిన్నగా పిలిచాడు.. అప్పటికే కమాండోలు లోపలికి ప్రవేశించినట్టు ఖలీద్‌కు తెలియదు. ఓ గది నుంచి తల ఒకటి బయటకు కనిపించింది. తర్వాత ఓ మాట వినిపించింది క్యా హై?.. తరువాతి క్షణం ఆ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఇంకో మాట వినిపించలేదు. ఖలీద్ ఖేల్ ఖతం..
chivari-page1

ఖలీద్ అక్కడున్నాడంటే పై అంతస్తులో లాడెన్ ఉన్నట్టే. ఒక్కోమెట్టు ఎక్కుతూ పై అంతస్తుకు వెళ్తున్నారు కమాండోలు.. ఓ గదిలోకి అడుగు పెట్టారు. ఎన్నో ఏండ్లుగా వెదుకుతున్న టార్గెట్. కండ్ల ముందు కనిపిస్తున్నది. పక్కనే ఓ మహిళ. కమాండోలు ఆలస్యం చేయలేదు. నేవీ సీల్స్ బృందంలో ఓ సభ్యుడు ఏకే -47 లాడెన్‌పైకి ఎక్కు పెట్టాడు. ఆ మహిళ అడ్డుపడింది. లాడెన్ చిన్న భార్య. రైఫిల్ పైకి లేపి రెండుసార్లు ట్రిగ్గర్ నొక్కాడు ఓ కమాండో. బ్యారెల్ నుంచి బుల్లెట్లు దూసుకెళ్లాయి. రక్తం బయటకు వచ్చింది. మెదడు బయట పడింది. ఛాతీలో కాల్చారు. నెత్తుడి మడుగుల్లో శరీరం.కాల్చింది బిన్‌లాడెన్నేనా?అతనేనా? బృందంలో ఎవరో అన్నారు.ఎవరూ తొందరపడలేదు. తమ దగ్గరున్న ఫొటోతో సరిచూసుకున్నారు. అతని గడ్డాన్ని అటూ, ఇటూ తిప్పి చూశారు. రకరకాల కోణాల్లో ఫొటోలు తీశారు. ఇతనెవరు? బాల్కనీలో బిక్కుబిక్కుమంటున్న పిల్లలను కమాండోలు అడిగారు. లాడెన్ స్పష్టమైన జవాబు ఇచ్చారు.సీల్స్ బృందంలో సంతోషం. బిగ్గరగా రోదిస్తున్న ఒకామెను పలుకరించారు. బెడ్‌రూంలో ఉన్నది ఎవరు? ప్రశ్నించారు. ఒసామా.. ఏడుస్తూనే చెప్పిందామె.ఒసామా అంటే? మళ్లీ అడిగారు.ఒసామా బిన్ లాడెన్ అని చెప్పిందామె..రెండో నిర్ధారణతో నేవీ సీల్స్ సభ్యులకు నిర్ధారణ అయింది... కాల్చింది బిన్ లాడెన్‌నే.. మిషన్ కంప్లీట్.. 30 నిమిషాల్లో
chivari-page2

తర్వాత రోజు ప్రపంచం అంతా ఈ వార్త పాకింది. లాడెన్‌ను చంపినట్టుగా అమెరికా ప్రకటించింది. అతని మృతదేహాన్ని ఉత్తర అరేబియన్ సముద్రంలో పాడేసినట్టు చెప్పింది.తర్వాతి రోజుల్లో లాడెన్ చావుకు సంబంధించిన అనేక చర్చలు మొదలయ్యాయి. అనేక ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. సరైన సమాధానం మాత్రం దొరకలేదు. నేవీ ఆపరేషన్‌లో లాడెన్ మృతి చెందినట్టు ప్రకటించిన అమెరికా దానికి సంబంధించిన ఒక ఫొటో తప్ప భౌతిక ఆధారాలు చూపించలేదు. పైగా మృతదేహాన్ని సముద్రంలో పడేసింది. డీఎన్‌ఏ టెస్టులు నిర్వహించిన్నట్టు చెప్పి, దాని ఫలితాలు వెల్లడించలేదు. ఆ ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా లాడెన్‌ను కాల్చిన బృంద సభ్యుడు ఎవరు అనేది, బృందంలో పాల్గొన్నది ఎవరనేది భద్రతా కారణాల వల్ల బయటకు రాలేకపోయాయి. కానీ సరిగ్గా మూడేండ్ల తర్వాత అమెరికా నేవీ సీల్స్ మాజీ సభ్యుడు రాబర్ట్ ఓనీల్ చెప్పాడు. లాడెన్ తలలోకి బుల్లెట్లు దించింది నేనే అని ప్రకటించాడు. ఆరేండ్ల తర్వాత ది ఆపరేటర్ పుస్తకాన్ని విడుదల చేశాడు. లాడెన్‌ను ఇంటిని ఎలా సమీపించారు, లోపలికి ఎలా వెళ్లారు, అక్కడ ఎవరు ఎదురయ్యారు.. అనే విషయాలతో పుస్తకాన్ని 25.4.2017న విడుదల చేశాడాయన.

ఒక్కోమెట్టు ఎక్కుతూ పై అంతస్తుకు వెళ్తున్నారు కమాండోలు.. ఓ గదిలోకి అడుగు పెట్టారు. ఎన్నో ఏండ్లుగా వెదుకుతున్న టార్గెట్. కండ్ల ముందు కనిపిస్తున్నది. పక్కనే ఓ మహిళ. కమాండోలు ఆలస్యం చేయలేదు. నేవీ సీల్స్ బృందంలో ఓ సభ్యుడు ఏకే -47 లాడెన్‌పైకి ఎక్కు పెట్టాడు. ఆ మహిళ అడ్డుపడింది. లాడెన్ చిన్న భార్య. రైఫిల్ పైకి లేపి రెండుసార్లు ట్రిగ్గర్ నొక్కాడు ఓ కమాండో. బ్యారెల్ నుంచి బుల్లెట్లు దూసుకెళ్లాయి. రక్తం బయటకు వచ్చింది. మెదడు బయట పడింది. ఛాతీలో కాల్చారు. నెత్తుడి మడుగుల్లో శరీరం.కాల్చింది బిన్‌లాడెన్నేనా?అతనేనా? బృందంలో ఎవరో అన్నారు.
chivari-page3

883
Tags

More News

VIRAL NEWS